Best Web Hosting Provider In India 2024

Akira Nandan Debut: రామ్‌చరణ్‌ను పరిచయం చేసిన బ్యానర్లోనే పవన్ తనయుడు అకీరా ఫస్ట్ మూవీ?
Akira Nandan Debut Movie: పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్ తొలి చిత్రంపై తాజాగా మరిన్ని రూమర్లు బయటికి వచ్చాయి. ఈ సినిమా ప్రొడక్షన్ హౌస్, దర్శకుడి గురించిన విషయాలు చక్కర్లు కొడుతున్నాయి.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్ తెరంగేట్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు ఫస్ట్ మూవీ గురించి ప్రకటన వస్తుందా అని వేచిచూస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌తో కొంతకాలంగా అకీరా తరచూ కనిపిస్తున్నారు. పవన్ వెన్నంటే ఉంటున్నారు. అకీరా హీరోగా చేసేందుకు పూర్తి రెడీ అయ్యారని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. అయితే, అకీరా ఫస్ట్ మూవీ గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అయితే, తాజాగా కొన్ని రూమర్లు బయటికి వచ్చాయి.
వైజయంతీ మూవీస్ నిర్మాణంలో?
అకీరా నందన్ హీరోగా చేసే తొలి సినిమాను ‘వైజయంతీ మూవీస్’ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించనున్నారని తాజాగా రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఆ ప్రతిష్ట్మాక బ్యానర్‌తో చిత్రంతో అకీరా సినీ ఎంట్రీ ఉంటుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌ను కూడా చిరుత (2007) చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం చేసింది వైజయంతీ మూవీస్. మరికొందరు హీరోలను కూడా ఇంట్రడ్యూస్ చేసింది. ఇప్పుడు అకీరాను తొలి మూవీని కూడా ప్రొడ్యూజ్ చేయనుందనే రూమర్లు బలంగా వినిపిస్తున్నాయి.
తమిళ దర్శకుడితో!
అకీరా నందన్ తొలి సినిమాకు తమిళ డైరెక్టర్ విష్ణువర్ధన్ దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. పవన్‌తో పంజా మూవీ చేశారు విష్ణువర్ధన్. ఆ చిత్రం కమర్షియల్‌గా హిట్ కాలేదు. కానీ పవన్ స్టైలిష్ లుక్, యాక్షన్ ఆ చిత్రంలో మెప్పించాయి. కొందరికి పంజా తెగ నచ్చేసింది. ఇప్పుడు అకీరా మూవీకి విష్ణువర్ధనే దర్శకత్వం చేయనున్నారని టాక్. ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
అకీరా నందన్ ప్రస్తుతం వైజాగ్‌లో యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. పవన్ కల్యాణ్, ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ కుమారుడే అకీరా. ఇటీవలి కాలంలో పవన్ వెంట ఎక్కువగా అతడు కనిపిస్తున్నారు.
అకీరా నందన్ తొలి చిత్రంపై కొంతకాలంగా చాలా రూమర్లు వస్తున్నాయి. చాలా మంది దర్శకులు, నిర్మాత పేర్లు వినిపించాయి. అయితే, డైరెక్టర్ విష్ణువర్ధన్నే ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. మరి ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.
విష్ణువర్ధన్తో అకీరా చేసే మూవీ పంజాకు సీక్వెల్ అంటూ కూడా రూమర్లు వినిపిస్తున్నాయి. పంజా 2గా అది రానుందంటూ రూమర్లు ఉన్నాయి. అయితే, ఈ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. పంజా కమర్షియల్‌గా సక్సెస్ కాకపోవటంతో దాని సీక్వెల్‌తో అకీరా తెరంగేట్రం చేయడం రిస్క్ అవుతుందని కొందరు భావిస్తున్నారట. మొత్తంగా అకీరా ఫస్ట్ ప్రాజెక్టుపై అధికారికంగా వివరాలు వెలువడే వరకు రూమర్లు మాత్రం వస్తూనే ఉండేలా ఉన్నాయి.
సంబంధిత కథనం
టాపిక్