


Best Web Hosting Provider In India 2024

Zee Telugu Special: జీ తెలుగులో 3 రోజుల పండుగ.. వరుసగా 3 స్పెషల్స్‌తో ట్రిపుల్ బొనాంజా!
Zee Telugu Special From March 1 To 3: ప్రముఖ బుల్లితెర ఎంటర్టైన్మెంట్ ప్లాట్‌ఫామ్ జీ తెలుగులో వరుసగా మూడు రోజులు పండుగ జరగనుంది. మూడు స్పెషల్స్‌తో ట్రిపుల్ బొనాంజా వినోదం ఇవ్వనుంది జీ తెలుగు ఛానెల్. వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం టీవీ ప్రీమియర్‌తోపాటు మిగతా విశేషాల వివరాల్లోకి వెళితే..!
Zee Telugu Special From March 1 To 3: వరుస సూపర్‌హిట్ సినిమాలు, సరికొత్త కాన్సెప్ట్‌లతో ఫిక్షన్, నాన్ఫిక్షన్ షోలతో అలరిస్తున్న జీ తెలుగు మరో త్రిపుల్ బొనాంజా ఎంటర్టైన్మెంట్తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ ఏడాది సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాని వరల్డ్ టెలివిజ్ ప్రీమియర్‌గా ప్రసారం చేసేందుకు సిద్దమైంది.
సంక్రాంతికి వస్తున్నాం టీవీ ప్రీమియర్
అలాగే, జీ తెలుగులోని 16 సీరియల్స్ పోటీపడే సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్, మధ్యతరగతి కుటుంబ కథతో ప్రేక్షకులను ఆకట్టకునేలా రూపొందుతున్న లక్ష్మీ నివాసం సీరియల్‌ని ప్రారంభించనుంది. సంక్రాంతికి వస్తున్నాం మార్చి 1 (శనివారం)న సాయంత్రం 6 గంటలకు టీవీ ప్రీమియర్ కానుంది.
నటులు శ్రీకాంత్, రోజా, రాశి, డైరెక్టర్ అనిల్ రావిపూడి అతిథులుగా హాజరైన సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ గ్రాండ్ లాంచ్ మార్చి 2 (ఆదివారం) సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుంది. ఇక ప్రేమ, బాధ్యత, బంధాలే ప్రధానంగా సాగే సరికొత్త సీరియల్ లక్ష్మీ నివాసం ప్రారంభం మార్చి 3 (సోమవారం) రాత్రి 7 గంటలకు ప్రసారం కానుంది.
ఇటు టీవీ-అటు ఓటీటీ
ఇలా మూడు స్పెషల్స్‌తో వరుసగా మూడు రోజులు జీ తెలుగులో ట్రిపుల్ బొనాంజా ఇవ్వనుంది. దీంతో బుల్లితెర ప్రేక్షకులకు పండుగే అని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే, విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా అటు జీ తెలుగు వేదికగా బుల్లితెర ప్రేక్షకులు, ఇటు జీ5లో ఓటీటీ ఆడియెన్స్ ముందుకు రానుంది.
కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే కథాంశంతో అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. థియటర్ రన్ ముగించుకుని జీ తెలుగు వేదికగా ఈ శనివారం సాయంత్రం 6 గంటలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా సంక్రాంతికి వస్తున్నాం ప్రసారం కానుంది.
బుల్లిరాజు కూడా
జీ తెలుగు ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న నాన్-ఫిక్షన్ షోలలో ఒకటైన సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుంది. ఈ లాంచ్ ఎపిసోడ్‌కి ప్రముఖ నటులు శ్రీకాంత్, రోజా, రాశి, డైరెక్టర్ అనిల్ రావిపూడి, సంక్రాంతికి వస్తున్నాం ఫేమ్ బుల్లిరాజు అతిథులుగా హాజరై మరింత వినోదాన్ని అందించనున్నారు.
యాంకర్ రవి, అషు రెడ్డి వ్యాఖ్యాతలుగా వ్యవహరించనున్న ఈ షోలో జీ తెలుగు 16 సీరియల్ జట్లు ఛాంపియన్షిప్ టైటిల్ కోసం తలపడతాయి. సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ ప్రారంభ ఎపిసోడ్ నుంచే అంతులేని వినోదంతోపాటు సరదా ఆటలు, సవాళ్లతో హోరాహోరీ పోటీ జరగనుంది.
ఆసక్తికరమైన మలుపులతో
సూపర్ సీరియల్ ఛాంపియన్ షో ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతుంది. అంతేకాదు, ఆసక్తికరమైన మలుపులతో సాగే సీరియల్స్‌తో ఆకట్టుకుంటున్న జీ తెలుగు మరో అద్భుతమైన కథతో రూపొందుతున్న లక్ష్మీ నివాసం సీరియల్‌ని ప్రారంభించబోతోంది.
సాధారణ మధ్యతరగతికి చెందిన లక్ష్మి, శ్రీనివాస్‌ల ప్రేమకథ ఆధారంగా ఈ సీరియల్ తెరకెక్కుతోంది. లక్ష్మీ నివాసాన్ని నిర్మించాలనే శ్రీనివాస్ కల, ఆడపిల్లల పెళ్లిళ్లు చేయాలనే లక్ష్మి ఆరాటం, వారి పిల్లల ఆకాంక్షల మధ్య జరిగే సంఘర్షణే ప్రధానంగా ఈ సీరియల్ కథ సాగుతుంది.
సీరియల్స్‌లో స్వల్ప మార్పులు
ఈ అందమైన కుటుంబ ప్రయాణం గురించి మరింత తెలుసుకోవాలంటే మార్చి 3 సోమవారం నుంచి ప్రతిరోజూ రాత్రి 7 గంటలకు జీ తెలుగులో ప్రసారమయ్యే లక్ష్మీ నివాసం సీరియల్ మిస్‌కాకుండా చూడాల్సిందే. లక్ష్మీ నివాసం సీరియల్ ప్రారంభంతో జీ తెలుగు ఇతర సీరియల్స్ ప్రసార సమయాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి.
మార్చి 3వ తేదీ నుంచి నిండు నూరేళ్ల సావాసం సాయంత్రం 6.30 గంటలకు, మా అన్నయ్య సాయంత్రం 6 గంటలకు, చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రసారమవుతాయి.
సంబంధిత కథనం