Sunitha Williams: స్పేస్‌ నుంచి తిరిగి వస్తున్న సునీతా విలియమ్స్ జీతం ఎంత? నాసా ఇచ్చేదెంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

Best Web Hosting Provider In India 2024

Sunitha Williams: స్పేస్‌ నుంచి తిరిగి వస్తున్న సునీతా విలియమ్స్ జీతం ఎంత? నాసా ఇచ్చేదెంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

Ramya Sri Marka HT Telugu
Feb 28, 2025 02:00 PM IST

Sunitha Williams: సునీతా విలియమ్స్ లాంటి నాసా వ్యోమగాములు ప్రమాదకరమైన, అడ్డంకులతో కూడిన, భయంకరమైన వృత్తిలో పనిచేస్తుంటారు. కానీ, వారి జీతం, నికర విలువ గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? రండి తెలుసుకుందాం.!

స్పేస్ నుంచి తిరిగి వస్తున్న సునీతా విలియమ్స్ (ఫైల్ ఫొటో AP)
స్పేస్ నుంచి తిరిగి వస్తున్న సునీతా విలియమ్స్ (ఫైల్ ఫొటో AP) (AP)

నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ విజయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే రెండు సార్లు విజయవంతంగా అంతరిక్ష యాత్ర ముగించుకొని తిరిగి వచ్చారు. మూడోసారి తిరిగి భూమికు రాబోతున్నారు కూడా. తన సహచరుడు బుచ్ విల్మోర్‌తో కలిసి అంతరిక్ష యాత్రకు వెళ్లి తొమ్మిది నెలలకు పైగా అంతరిక్షంలోనే గడిపారు. వారి బోయింగ్ స్టార్‌లైనర్ కక్ష్యలోకి ప్రవేశించిన తర్వాత అనేక సాంకేతిక సమస్యలను ఎదుర్కోవడంతో 2024 జూన్ 5న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ISS)లో ఆగిపోయారు. తాజా సమాచారం ప్రకారం, మార్చి 2025 నెల మధ్యలో వస్తున్నట్లుగా అనౌన్స్‌మెంట్ వచ్చింది.

ఐఎస్ఎస్‌లో వ్యోమగాముల ఆగిపోవడం వలన బరువు తగ్గిపోయి డం గురించి ఆందోళనకరమైన నివేదికలు వచ్చాయి. ఫిబ్రవరిలో, నాసా వారిని స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాప్సుల్‌లో భూమికి తీసుకురావాలని ప్రణాళికలు రచించింది. దీనికి సంబంధించి ఐఎస్ఎస్ నిర్వహించిన అన్ని శారీరక పరీక్షలలో విలియమ్స్, సహ వ్యోమగామి విల్మోర్ ఉత్తీర్ణులయ్యారు.

విలియమ్స్ లాంటి వ్యోమగాములు ప్రమాదకరమైన, అడ్డంకులతో కూడిన, భయంకరమైన వృత్తిలో పనిచేస్తుంటారు. చాలా మందికి వృత్తి గురించి మాత్రమే తెలుసు. కానీ, వారి జీతం, నికర విలువ గురించి ఎప్పుడైనా ఆలోచించారా?

సునీతా విలియమ్స్ ఎంత సంపాదిస్తుంది?

ప్రపంచంలోని అగ్రస్థానంలో ఉన్న అంతరిక్ష సంస్థ నాసా, భవిష్యత్తు వ్యోమగాములకు ఆదర్శవంతమైన గమ్యస్థానం లాంటిది. యూఎస్ మీడియా నివేదికల ప్రకారం, నాసా వ్యోమగాములకు యూఎస్ ప్రభుత్వ గణాంకాల ప్రకారం జీతం నిర్దేశిస్తారు. ఇవి GS-13 నుండి GS-15 వరకు ఉంటాయట.

విలియమ్స్ లాంటి అనుభవజ్ఞులైన వ్యోమగాములకు సంవత్సరానికి జీతం G-15 విభాగంలో వస్తుంది. నాసా రికార్డుల ప్రకారం, దాదాపు $152,258.00 లేదా సంవత్సరానికి రూ. 12,638,434 (కోటి 26 లక్షల 38వేల 434) . ఈ మొత్తం వారి కష్టతరమైన అంతరిక్ష ప్రయాణాలు, శిక్షణ చెల్లింపుకు సూచిస్తుంది.

వ్యోమగాములు నాసా డిమాండింగ్ మెషీన్లకు అవసరమైన పని, బాధ్యత నిర్వర్తించినందుకు కూడా వేతనం పొందుతారు. నాసా వారికి పూర్తి హెల్త్ ఇన్సూరెన్స్, మెషీన్ లో ప్రయాణించేందుకు ట్రైనింగ్, వారి కుటుంబాలకు మెంటల్ సపోర్ట్, జర్నీకి అయ్యే ఖర్చులను భరిస్తుంది.

సునీతా విలియమ్స్ నికర విలువ ఎంత?

విలియమ్స్, ఒక మాజీ నేవల్ ఆఫీసర్, అత్యంత గౌరవనీయమైన వ్యోమగామి, నాసా, యూఎస్ సైన్యంతో గణనీయమైన కెరీర్‌ను కలిగి ఉంది. Marca.com ప్రకారం, భారతీయ-అమెరికన్ వ్యోమగామికి దాదాపు 5 మిలియన్ డాలర్ల నికర ఆస్తులు ఉన్నాయట.

అంతేకాకుండా, సునీతా టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో ఫెడరల్ మార్షల్‌ అయిన తన భర్త మైఖేల్ జె. విలియమ్స్‌తో కలిసి నివసిస్తుంది. గతంలో హెలికాప్టర్ పైలట్ గా పనిచేసిన ఆయన ప్రస్తుతం యూఎస్ మార్షల్ సర్వీస్ లో పనిచేస్తున్నారు. ఐఎస్ఎస్‌లో ఆమె చాలా కాలం పాటు సేవలు అందించి ధైర్యం, నిబద్ధతను ప్రదర్శించింది. అంతరిక్ష అన్వేషణలో ప్రధాన పురోగతిని సాధించి, వృత్తిపరమైన, వ్యక్తిగత విజయాలతో వెల కట్టలేని ఆస్తిని సంపాదించింది. అంతరిక్ష శాస్త్రంలో ప్రముఖ వ్యక్తిగా పేరు నిలబెట్టుకుంది.

Whats_app_banner

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024