Lunch Box Cleaning Tips: పిల్లల లంచ్ బాక్స్‌లోని పసుపు మచ్చలు, దుర్వాసన పొగొట్టే సూపర్ టిప్స్ ఇవిగోండి!

Best Web Hosting Provider In India 2024

Lunch Box Cleaning Tips: పిల్లల లంచ్ బాక్స్‌లోని పసుపు మచ్చలు, దుర్వాసన పొగొట్టే సూపర్ టిప్స్ ఇవిగోండి!

Ramya Sri Marka HT Telugu
Feb 28, 2025 05:00 PM IST

Lunch Box Cleaning Tips: పిల్లలు స్కూలుకి తీసుకెళ్తున్న లంచ్ బాక్స్‌లు ఎంత క్లీన్ చేసినా మరకలు, దుర్వాసన వదలడం లేదా? అయితే ఈ టిప్స్ మీ కోసమే. ఈ చిన్న చిన్న చిట్కాలతో వాటిని శుభ్రం చేసారంటే మరకలు, మచ్చలతో పాటు దుర్వాసన కూడా మాయం అవాల్సిందే!

పసుపు మచ్చలతో కనిపిస్తున్న లంచ్ బాక్సు
పసుపు మచ్చలతో కనిపిస్తున్న లంచ్ బాక్సు (Shutterstock)

స్కూల్ అయినా, ఆఫీస్ అయినా, చాలా మంది ప్లాస్టిక్, టప్పర్ వేర్ లంచ్ బాక్స్‌లను ఉపయోగిస్తున్నారు. రంగురంగుల ఈ కంటైనర్లు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. అలాగే వీటిలో కూరలో వేసుకుని వెళ్లడం వల్ల నూనె కారిపోతుంది, బాక్సులు పగిలిపోతాయి అని భయపడుతూ ఉండాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ అసలు సమస్య ఏంటంటే.. కొత్త లంచ్ బాక్స్ కొన్ని రోజులు బాగుంటుంది, కానీ కొంతకాలం ఉపయోగించిన తర్వాత వాటిపై పచ్చల్లు, కూరగాయల పసుపు మచ్చలు, ఏర్పడతాయి. ఎంత శుభ్రంగా తోమినా జిడ్డు తొలగిపోదు. దీని వల్ల లంచ్ బాక్స్‌లో ఒక విచిత్రమైన వాసన కూడా వస్తుంది.

డిష్ వాషర్‌తో, స్క్రబ్‌తో ఎంత రుద్దినా ఈ మచ్చలు పోవు పైగా ఎక్కువగా రుద్దడం వల్ల లంచ్ బాక్స్‌లో గీతలు పడి చూడటానికి పాతదిగా కనిపిస్తుంది. మీకు ఇంట్లో కూడా ఇదే సమస్య ఉంటే, ఈరోజు మేము మీ కోసం కొన్ని సులభమైన కిచెన్ టిప్స్ తీసుకువచ్చాము, వీటి సహాయంతో మీరు క్షణాల్లో మీ పసుపు, దుర్వాసనతో కూడిన లంచ్ బాక్స్‌లను శుభ్రం చేసేయచ్చు.

ముందుగా నానబెట్టండి

స్క్రబ్‌తో రుద్దకుండా లంచ్ బాక్స్‌లోని జిడ్డు, మచ్చలు, దుర్వాసనను తొలగించడానికి ముందుగా వాటిని కాసేపు నానబెట్టాలి. ఇందుకోసం మీరు డిష్వాష్ లిక్విడ్ సోప్‌ను ఉపయోగించవచ్చు.

దీనికి ముందుగా లంచ్ బాక్స్ లో కాస్త వెచ్చని నీరు పోసి, అందులో ఒకటి లేదా రెండు చెంచాల లిక్విడ్ డిష్వాష్ సోప్ వేసి కలపండి. ఇప్పుడు దీన్ని 20 నుండి 30 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఆ తర్వాత ఏదైనా స్క్రబ్బర్ సహాయంతో తేలికగా లంచ్ బాక్స్‌ను రుద్ది శుభ్రం చేయండి. అంతే ఇలా చేశారంటే మీ కంటైనర్ చాలా శుభ్రంగా, సువాసనభరితంగా మారుతుంది.

బేకింగ్ సోడా, వెనిగర్‌తో శుభ్రం చేయండి

వంటగదిలో ఉన్న బేకింగ్ సోడా, వెనిగర్ రెండూ చాలా మంచి క్లీనింగ్ ఏజెంట్లు. ఎంతటి మొండి మరకలు మచ్చలను అయినా, దుర్వాసనను అయినా తొలగించే శక్తి వీటిని ఉంటుంది. జిడ్డును తొలగించడంలో ఇవి చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి.

మీ మురికి ప్లాస్టిక్ లంచ్ బాక్స్‌ను శుభ్రం చేయడానికి, ఒక గిన్నెలో సమాన మొత్తంలో వెనిగర్‌, బేకింగ్ సోడా వేసి కలపండి. ఇప్పుడు ఈ పేస్ట్‌ను ఏదైనా బ్రష్ సహాయంతో లంచ్ బాక్స్ అంతా అప్లై చేయండి. తర్వాత 15 నుండి 20 నిమిషాల పాటు బాక్సలను అలాగే ఉంచి, ఆ తర్వాత బ్రష్‌తో తేలికగా రుద్దుతూ శుభ్రం చేయండి. ఇలా చేశారంటే మచ్చలు సులభంగా పోతాయి. దుర్వాసన కూడా మాయమైపోతుంది.

నిమ్మకాయ, ఉప్పును ఉపయోగించండి

ఇంట్లో వెనిగర్, బేకింగ్ సోడా లేకపోతే మీ వంటగదిలో ఎప్పుడూ ఉండే నిమ్మకాయ ముక్క మీకు చాలా బాగా సహాయపడుతుంది. నిమ్మకాయను మధ్య నుండి కట్ చేసి, దానిపై కొంచెం ఉప్పు వేయండి. ఇప్పుడు దీన్ని లంచ్ బాక్స్ పై అప్లై చేయండి. ఇలా 15 నిమిషాల పాటు అలాగే ఉంచిన తర్వాత గోరు వెచ్చని నీటితో కడగాలి. అంతే మీ లంచ్ బాక్స్ చాలా శుభ్రంగా మారిపోతుంది. అదనంగా మీరు డిష్వాష్ లిక్విడ్ తో పాటు సమాన మొత్తంలో నిమ్మకాయ కలిపి కూడా లంచ్ బాక్స్‌ను శుభ్రం చేయవచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024