


Best Web Hosting Provider In India 2024

Warangal Mamunur Airport : మామూనూరు ఎయిర్‌పోర్ట్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
Warangal Mamunur Airport: వరంగల్ జిల్లాలోని మామునూరులో విమానాశ్రయం నిర్మాణానికి ముందడుగు పడింది. విమానాశ్రయంగా అభివృద్ధి చేయాలని గతంలో ప్రతిపాదనలు పంపగా… ఇందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజా అనుమతుల నేపథ్యంలో…వరంగల్ ఎయిర్ పోర్టు పనుల్లో వేగం పెరగనుంది.
మామునూరు విమానాశ్రయం అభివృద్ధికి కేంద్రం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు అనుమతిని మంజూరు చేస్తూ కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వశాఖ కార్యదర్శి అమిత్ కుమార్ జా…. ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్ కు లేఖ రాశారు. విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయటంతో పాటు కార్యకలాపాల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది… నిర్ణయం తీసుకుందని ఇందులో తెలిపారు.
మామునూరును విమానాశ్రయంగా అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం గతంలోనే ప్రతిపాదనలు పంపింది. భూసేకరణ విషయంలో కూడా ఇబ్బందులు రాకుండా… ముందుకెళ్లే పనిలో ఉంది. ఈ ఎయిర్ పోర్టు అభివృద్ధి కోసం… కేంద్ర విమానాయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకి కూడా పలుమార్లు విజ్ఞప్తి పత్రాలను అందజేసింది. ఈ నేపథ్యంలో… మామునూరు విమానాశ్రయ అభివృద్ధికి తాజాగా కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది.
భూసేకరణకు లైన్ క్లియర్….
ఎయిర్ పోర్టు పునరుద్ధరణకు అవసరమైన 253 ఎకరాల భూ సేకరణకు కొద్దిరోజుల కిందటే తెలంగా సర్కార్ రూ.205 కోట్లు విడుదల చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. మామునూరు విమానాశ్రయానికి మొత్తం 1,875 ఎకరాల స్థలం ఉండేది. ఈ స్థలంలో 6.6 కి.మీ రన్ వే, పైలట్, సిబ్బంది క్వార్టర్స్, పైలట్ శిక్షణ కేంద్రం, ఒకటి కన్నా ఎక్కువ టెర్మినళ్లు ఉండేవి. కాగా, విమానాశ్రయానికి చెందిన 468 ఎకరాల భూమిలో టీజీఎస్పీ ఫోర్త్ బెటాలియన్, పోలీస్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 700 ఎకరాల్లో ప్రభుత్వ డెయిరీ ఫామ్ నిర్మించి ఉంది.
మిగిలిన స్థలం చుట్టూ రక్షణగా ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు ప్రహరీ నిర్మించారు. ఇక మిగిలిన దాంట్లో విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయడానికి 943.14 ఎకరాల భూమి అవసరం కాగా ప్రస్తుతం 696.14 ఎకరాల భూమి అందుబాటులో ఉంది. దానికి తోడు అదనంగా కావాల్సిన మరో 253 ఎకరాల భూమిని అధికారులు గతంలోనే గుర్తించారు. కానీ భూ సేకరణ అంశం కొన్నాళ్లుగా ఆగుతూ సాగుతూ వచ్చింది.
భూ నిర్వాసితులకు పరిహారం ఇచ్చి భూమిని సేకరించడం పట్ల ఆలస్యమవుతూ వచ్చింది. ప్రస్తుతం ఈ అటంకాలను అధిగమించేలా రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది. ఈ నేపథ్యంలో…. భూసేకరణ కోసం రూ. 205 కోట్లను విడుదల చేసింది. దీంతో భూసేకరణకు లైన్ క్లియర్ అయినట్లు అయింది. ఆ వెంటనే విమానాశ్రయం డీపీఆర్ రెడీ చేయాల్సిందిగా ఆర్ అండ్ బీ శాఖ…. ఎయిర్ ఆథారిటీ ఆఫ్ ఇండియాను కోరింది. ఇందుకు పలు ప్రతిపాదనలను కూడా పంపింది.
ఇక వేగంగా మామునూరు పనులు – మంత్రి కోమటిరెడ్డి
జిల్లా మామునూర్ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిని మంజూరీ చేసిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. మామునూర్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసి, తిరిగి కార్యకలాపాలు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విమానాశ్రయ ప్రాధికార సంస్థ (Airport Authority of India) అభ్యర్థనకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు.
గత పదేండ్లుగా పెండింగ్ లో ఉన్న NOC అడ్డంకులపై జీఎంఆర్ సంస్థ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపామని… బోర్డులో పెట్టి NOC ఇచ్చేలా చేశామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. దీంతో HAIL తన బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని మామునూర్ విమానాశ్రయ అభివృద్ధికి అడ్డంకిగా ఉన్న 150 కిలోమీటర్ల నిబంధనను సవరిస్తూ NOC ఇచ్చిందని వివరించారు. ప్రస్తుతం ఈ NOCని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదించిందని మంత్రి తెలిపారు. దీంతో మామునూర్ ఎయిర్ పోర్టు నిర్మాణం మరింత వేగంగా ముందుకు సాగుతుందని ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని అనుమతులు రావడంపై మంత్రి వెంకట్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మించేటప్పుడు కేంద్రంతో.. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (HIAL) ఒక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలోని క్లాజ్ 5.2 లో 25 సంవత్సరాల వరకు… 150 కిలోమీటర్ల పరిధిలో ప్రస్తుతం అందుబాటులో ఉండి అభివృద్ధి చేసేవి, మరో కొత్త దేశీయ/అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుమతించరాదని ఇందులో ఉంది. దీంతో ఈ పరిధిలో రాష్ట్రంలో ఇప్పటి వరకు మరో ఎయిర్ పోర్టు నిర్మాణం జరగలేదు. ఇదే విషయంపై HAILతో తెలంగాణ ప్రభుత్వం చర్చలు జరిపి… ఎన్వోసీని తీసుకువచ్చింది. ఇదే ఎన్వీసీని కేంద్రానికి కూడా అందజేసింది.
సంబంధిత కథనం
టాపిక్