






Best Web Hosting Provider In India 2024

MM Keeravani Concert: కీరవాణి కాన్సర్ట్.. తమ్ముడు రాజమౌళి డిమాండ్ ఇదీ.. ఫ్యాన్స్‌నూ రెచ్చగొడుతున్న దర్శక ధీరుడు
MM Keeravani Concert: ఎంఎం కీరవాణి నా టూర్ ఎంఎంకే కాన్సర్ట్ కోసం హైదరాబాద్ సిద్ధమవుతోంది. అదే సమయంలో అతని తమ్ముడు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తన డిమాండ్ వినిపించాడు. అంతేకాదు ఫ్యాన్స్ నూ రెచ్చగొడుతూ ఓ వీడియో రిలీజ్ చేశాడు.
MM Keeravani Concert: ఎస్ఎస్ రాజమౌళి, ఎంఎం కీరవాణి.. ఈ కాంబినేషన్ ఎన్ని అద్భుతాలు సృష్టించిందో మనకు తెలుసు. ఏకంగా ఆస్కార్ నే గెలుచుకొచ్చిన జోడీ వీళ్లది. ఇప్పుడు కీరవాణి తన ‘నా టూర్ ఎంఎంకే’ కాన్సర్ట్ కు సిద్ధమవుతున్న వేళ ఈ జోడీ సినిమాల్లో క్రియేట్ చేసిన మ్యాజిక్ ను లైవ్ లో వినడానికి ఫ్యాన్స్ ఉవ్విళ్లూరుతున్నారు. ఈ సమయంలో రాజమౌళి తనకు ఒరిజినల్ సౌండ్‌ట్రాక్స్ కూడా కావాలంటూ డిమాండ్ చేస్తున్నాడు.
కీరవాణి కాన్సర్ట్.. రాజమౌళి డిమాండ్
ఎంఎం కీరవాణి కాన్సర్ట్ హైదరాబాద్ లోని హైటెక్స్ లో మార్చి 22న సాయంత్రం 7 గంటలకు జరగనుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం (ఫిబ్రవరి 28) దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తన ఇన్‌స్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేశాడు.
ఈ కాన్సర్ట్ కోసం తాను ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నానని, అయితే ఇందులో పాటలతోపాటు ఒరిజనల్ సౌండ్‌ట్రాక్స్ కూడా ఉండాల్సిందే అంటూ తన డిమాండ్ వినిపించాడు. ఫ్యాన్స్ అందరూ కూడా తన డిమాండ్ ను ముందుకు తీసుకెళ్లాలని కోరాడు.
గుర్తు పెట్టుకో పెద్దన్నా..: రాజమౌళి
కీరవాణి కాన్సర్ట్ లో రాజమౌళి సినిమాల్లోని పాటలు ఎంత పెద్ద హిట్టో మనకు తెలుసు. ఆ పాటలను లైవ్ లో వినాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు. రాజమౌళి కూడా దీనికోసమే ఎదురు చూస్తున్నాడు. తన సినిమాలతోపాటు మిగిలిన సినిమాల్లోనూ కీరవాణి అద్భుతమైన పాటలు ఉన్నాయని, వాటిని వినడానికి తాను ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు. గుర్తు పెట్టుకో పెద్దన్నా అని ఇన్‌స్టా పోస్ట్ చేశాడు.
“మార్చి 22 కోసం చాలా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. ఆ రోజు హైదరాబాద్ టాకీస్.. ఎంఎం కీరవాణి నా టూర్ కాన్సర్ట్ ప్రజెంట్ చేస్తోంది. అందులో నా సినిమాలు, ఇతర సినిమాల్లోని పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. లోపలి సమాచారం ప్రకారం మన కోసం కొత్త మ్యూజిక్ కూడా క్రియేట్ చేస్తున్నాడట.
కానీ నా డిమాంట్ ఏంటంటే.. పాటలు ఒక్కటే కాదు.. నాకు ఓఎస్టీ (ఒరిజినల్ సౌండ్‌ట్రాక్స్) కావాలి. నా సినిమాలతోపాటు మిగిలిన సినిమాల్లోనూ ఎన్నో ఒరిజినల్ రీరికార్డింగ్స్ ఉన్నాయి. తన పాటలు ఎంత పాపులరో బ్యాక్ గ్రౌండ్ స్కోరు అంతకంటే పాపులర్. అందుకే నాతో కలిసి మీరు కూడా ఇవి కాన్సర్ట్ లో ఉండాల్సిందే అని డిమాండ్ చేయండి” అని రాజమౌళి కోరాడు.
సంబంధిత కథనం
టాపిక్