




Best Web Hosting Provider In India 2024
Hyderabad : రెండతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం – ముగ్గురు మృతి..!
హైదరాబాద్ లోని పుప్పాలగూడ పాషా కాలనీలోని రెండతస్తుల భవనంలో అగ్నిప్రమాదం సంభవించించింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. వీరిలో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు. పలువురిని స్థానికులు తాళ్ల సాయంతో కాపాడారు.
పుప్పాలగూడలో అగ్నిప్రమాదం (image source @airnews_hyd)
రంగారెడ్డి జిల్లాలోని పుప్పాలగూడలో అగ్నిప్రమాదం జరిగింది. రెండతస్తుల భవనంలో (జీ ప్లస్ 2)ని గ్రౌండ్ ఫ్లోర్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది… అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. చనిపోయిన వారిలో ఏడేళ్ల చిన్నారి ఉండగా… మరో ఇద్దరు మహిళలు ఉన్నారు.
ఈ ప్రమాద ఘటనలో పలువురిని తాళ్ల సాయంతో బయటికి తీసుకువచ్చారు. భవనంలో లోని గ్యాస్ సిలిండర్ల పేలుడుతో ప్రమాద తీవ్రత పెరిగినట్లు తెలిసింది.ఈ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సంబంధిత కథనం
టాపిక్
Fire AccidentHyderabadRangareddy District
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.