





Best Web Hosting Provider In India 2024

Highest Grossing Animated Movie: ప్రపంచంలో అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటెడ్ మూవీ ఇదే.. రూ.16700 కోట్ల వసూళ్లు
Highest Grossing Animated Movie: ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటెడ్ మూవీ ఇది. రూ.700 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా నాలుగు వారాల్లోనే సుమారు రూ.16700 కోట్లు వసూలు చేయడం విశేషం.
Highest Grossing Animated Movie: హాలీవుడ్ యానిమేటెడ్ సినిమాలను మించిపోయింది ఓ చైనీస్ మూవీ. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటెడ్ ఫిల్మ్ గా రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా పేరు నే ఝా 2 (Ne Zha 2). నాలుగు వారాల్లోనే ఈ ఘనత సాధించడం విశేషం.
నే ఝా 2 బాక్సాఫీస్ రికార్డులు
బాక్సాఫీస్ రికార్డులంటే హాలీవుడ్ సినిమాల పేరిటే ఉంటుందన్నది తెలిసిందే. దశాబ్దాలుగా ఇదే కొనసాగుతోంది. యానిమేటెడ్ సినిమాలైనా సరే వాళ్లదే హవా. ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చే సినిమాలు ఏటా వేల కోట్లు వసూలు చేస్తుంటాయి. అయితే అమెరికా ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు చూస్తున్న చైనా.. ఇప్పుడు సినిమాల్లోనే అదే పని చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
తాజాగా జనవరి 29న రిలీజైన నే ఝా 2 అనే యానిమేషన్ మూవీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. 8 కోట్ల డాలర్లు (సుమారు రూ.700 కోట్లు) బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా.. నాలుగు వారాల్లోనే 192 కోట్ల డాలర్లు (సుమారు రూ.16700 కోట్లు) వసూలు చేయడం విశేషం. దీంతో ప్రపంచ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటెడ్ మూవీగా నిలిచింది.
చైనీస్ ధమాకా
నే ఝా 2 ఓ చైనీస్ యానిమేటెడ్ మూవీ. ఇదొక ఫ్యాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్. జియావోజీ డైరెక్ట్ చేశాడు. ఎన్‌లైట్ పిక్చర్స్ ఫెంగ్‌షఎన్ యూనివర్స్ నుంచి వచ్చిన మూడో సినిమా ఇది. 2019లో నే ఝా, 2020లో జియాంగ్ జియా తర్వాత ఈ ఏడాది జనవరి 29న నే ఝా 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాలుగు వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా 192 కోట్ల డాలర్లు వసూలు చేసింది.
అత్యధిక వసూళ్లు సాధించిన చైనీస్ మూవీ కూడా ఇదే కావడం విశేషం. ఇక యానిమేటెడ్ మూవీస్ విషయానికి వస్తే గతంలో డిస్నీ అండ్ పిక్సర్ రూపొందించిన ఇన్‌సైడ్ ఔట్ 2 (169 కోట్ల డాలర్లు) రికార్డును ఈ నే ఝా 2 బ్రేక్ చేసింది. చైనాలో ఇప్పటికీ ఈ మూవీ థియేటర్లలో ఉంది. దీంతో 200 కోట్ల డాలర్ల మార్క్ అందుకోవడం ఖాయం. ఇప్పటి వరకూ ప్రపంచ సినిమా చరిత్రలో ఈ మార్క్ అందుకున్న సినిమాలు కేవలం ఆరు మాత్రమే.
నే ఝా 2 మూవీ ఇలా..
నే ఝా 2 మూవీ రికార్డు బాక్సాఫీస్ రన్ కొనసాగుతూనే ఉంది. ఈ సినిమాను చైనీస్ మైథాలజీ, ఇక 16వ శతాబ్దపు చైనీస్ నవల ఇన్వెస్టిచర్ ఆఫ్ ద గాడ్స్ ఆధారంగా తెరకెక్కించారు. చైనీస్ న్యూ ఇయర్ సందర్భంగా థియేటర్లలో రిలీజైంది.
అప్పటి నుంచి నాలుగు వారాల్లోనే ప్రతి డిస్నీ అండ్ పిక్సర్ మూవీ రికార్డును బ్రేక్ చేస్తూ వెళ్తోంది. అదే సమయంలో రిలీజైన పలు మార్వెల్ సినిమాలను కూడా వెనక్కి నెట్టి వసూళ్లు సాధిస్తోంది. ప్రస్తుతం ఈ నే ఝా 2 మూవీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఏడో స్థానంలో ఉంది.
సంబంధిత కథనం