


Best Web Hosting Provider In India 2024

NNS 28th February Episode: కాళీని కత్తితో పొడిచేసిన మనోహరి.. రణ్‌వీర్ ఇంట్లో అమర్, భాగీ ముందే..
NNS 28th February Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ శుక్రవారం (ఫిబ్రవరి 28) ఎపిసోడ్లో కాళీని కత్తితో పొడిచేస్తుంది మనోహరి. రణ్‌వీర్ ఇంట్లో అమర్, భాగీ ముందే ఆమె ఇలా చేయడంతో అందరూ షాక్ తింటారు.
NNS 28th February Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (ఫిబ్రవరి 28) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. మిస్సమ్మ, రాథోడ్ కలిసి అనామికకు క్లాస్ పీకుతారు. అమర్ కు ఏ పని చేసి పెట్టొద్దని, పిల్లల పని తప్ప మరొకటి పట్టించుకోకూడదని ఆమెకు స్పష్టంగా చెబుతారు. అటు తనపై దాడి చేయించింది మనోహరే కాదో తెలుసుకోవడానికి రణ్‌వీర్ ప్లాన్ చేస్తుంటాడు.
అమర్, భాగీ రొమాంటిక్ సీన్
అమర్ రూమ్ లోకి అనామిక వెళ్లడం, డోర్ లాక్ కావడంతో కంగారు పడుతూ మిస్సమ్మ, రాథోడ్ పైకి వెళ్తారు. అటు శివరాం, నిర్మల కూడా వస్తారు. డోర్ ఎంతకీ రావడంతో లోపలి నుంచి అమర్.. బయటి నుంచి మిగిలిన వాళ్లందరూ ప్రయత్నిస్తుంటారు.
ఈలోపల డోర్ ను బలంగా తన్ని తీయాలని భాగీ చూస్తుంది. అంతలో లోపలి నుంచి అమర్ డోర్ తీయడంతో ఆమె పరుగెత్తుకుంటూ వెళ్లి అమర్ తో కలిసి సోఫాలో పడుతుంది. అందరి ముందే అమర్, భాగీ మధ్య రొమాన్స్ పుడుతుంది. వాళ్లిద్దరూ కాసేపు అలాగే ఉండిపోతారు.
అమర్‌కు రణ్‌వీర్ ఫోన్
అటు తన ఇంటికి డిన్నర్ కు రావాల్సిందిగా అమర్ కు ఫోన్ చేస్తాడు రణ్‌వీర్. భాగీ, పిల్లలతో కలిసి రావాలని అడగ్గా.. సరే అంటాడు. అటు భాగీ అంటూ పిలిచి డిన్నర్ కు బయటకు వెళ్దాం అని అమర్ అనగానే.. ఆమె ఓ క్యాండిల్ లైట్ డిన్నర్ ఊహించుకుంటుంది. కానీ రణ్‌వీర్ ఇంటికి అనగానే ఆమె ఉసూరుమంటుంది.
అటు రణ్‌వీర్ మాత్రం తనపై దాడి చేయించింది మనోహరో కాదో తెలుసుకునే పనిలో ఉంటాడు. అమర్ వాళ్లను తన ఇంటికి డిన్నర్ కు పిలవడం వల్ల మనోహరి కచ్చితంగా మరోసారి అదే రోజు రాత్రి తనపై దాడి చేయిస్తుందని భావిస్తాడు. ఒకవేళ అదే జరిగితే ఆమెనే తనపై దాడి చేయించినట్లు కన్ఫమ్ అవుతుందని అనుకుంటాడు.
రణ్‌వీర్ ఇంటికి కాళీ
అమర్.. భాగీ, పిల్లలతో కలిసి రణ్‌వీర్ ఇంటికి వెళ్తాడు. అక్కడ వాళ్లకు డిన్నర్ కోసం అతడు అన్ని ఏర్పాట్లు చేస్తాడు. లోని వెళ్లి తనను చంపడానికి వచ్చే వాడి కోసం ఎదురు చూస్తుంటాడు. అమర్, భాగీ, పిల్లలు బయట హాల్లో వేచి చూస్తూ ఉంటారు. మరోవైపు కాళీ.. రణ్‌వీర్ ను చంపడానికి గోడ దూకి ఇంట్లోకి వస్తాడు. ఈ ప్రయత్నంలో అతని ఫోన్ కింద పడిపోయినా చూసుకోకుండా లోనికి వెళ్తాడు.
అమర్, భాగీ, పిల్లలు అందరూ కలిసి రణ్‌వీర్ ఇంటికే వెళ్లారని మనోహరి తెలుసుకుంటుంది. ఎలాగైనా కాళీని దాడి చేయకుండా ఆపాలని అనుకుంటుంది. అతనికి ఫోన్ చేసిన ఫలితం ఉండదు.
కాళీని కత్తితో పొడిచిన మనోహరి
ఇటు ఇంట్లో రణ్‌వీర్ ను చూసిన కాళీ కత్తితో వెనుక నుంచి దాడి చేయడానికి ప్రయత్నిస్తాడు. ఇంతలో రణ్‌వీర్ అతని చేయి పట్టుకొని ఆపుతాడు. ఇద్దరి మధ్యా ఘర్షణ జరుగుతుంది.
అటు మనోహరి అప్పటికే రణ్‌వీర్ ఇంటికి చేరుకోగా.. వాళ్లిద్దరూ గొడవ పడటం కనిపిస్తుంది. రణ్‌వీర్ ను చంపడానికి ఇదే మంచి టైమ్ అనుకొని కింద పడి ఉన్న కత్తి తీసుకుంటుంది. అతనిపై దాడి చేయడానికి వెళ్తుండగా.. అమర్, భాగీ ఆమె నీడను చూస్తారు.
అటు మనోహరి.. రణ్‌వీర్ ను పొడిచేయడానికి వెళ్లి పొరపాటున కాళీని పొడుస్తుంది. అది చూసి కాళీ, రణ్‌వీర్ షాక్ తింటారు. ఆ తర్వాత ఏం జరిగింది? మనోహరి పరిస్థితి ఏంటి? రణ్‌వీర్, అమర్ నుంచి ఆమె తప్పించుకుంటుందా? తెలియాలంటే నిండు నూరేళ్ల సావాసం శుక్రవారం (ఫిబ్రవరి 28) ఎపిసోడ్ చూడాల్సిందే.
సంబంధిత కథనం
టాపిక్