Best Web Hosting Provider In India 2024

Romantic Comedy OTT: సడెన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ – ప్రియురాలు సైకోలా మారితే!
Romantic Comedy OTT: తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ పాగల్ వర్సెస్ కాదల్ సడెన్‌గా ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. విజయ్ శంకర్, విషిక జంటగా నటించిన ఈ మూవీలో బ్రహ్మాజీ, షకలక శంకర్ కీలక పాత్రలు పోషించారు.
Romantic Comedy OTT: తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ పాగల్ వర్సెస్ కాదల్ థియేటర్లలో రిలీజైన ఆరు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈ తెలుగు మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్రీగా కాకుండా 99 రూపాయల రెంటల్‌తో రిలీజైంది. . పాగల్ వర్సెస్ కాదల్ మూవీలో విజయ్ శంకర్, విషిక హీరోహీరోయిన్లుగా నటించారు. షకలక శంకర్, బ్రహ్మాజీ కీలక పాత్రలు పషించారు. ఈ సినిమాకు రాజేష్ ముదునూరి దర్శకత్వం వహించాడు.
గత ఏడాది ఆగస్ట్‌లో…
ఈ రొమాంటిక్ కామెడీ మూవీ గత ఏడాది ఆగస్ట్‌లో థియేటర్లలో రిలీజైంది. కమర్షియల్‌గా అంతగా ఆదరణను దక్కించుకోలేదు. ఈ సినిమాతో పలువురు కొత్త నటీనటులు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.
సైకో అమ్మాయితో ప్రేమ…
భిన్న మనస్తత్వాలు కలిగిన రెండు జంటల కథతో దర్శకుడు రాజేష్ పాగల్ వర్సెస్ కాదల్ సినిమాను రూపొందించాడు. అతి ప్రేమ ఎలాంటి అనర్థాలకు దారితీస్తుందన్నది ఫన్నీగా ఈ మూవీలో చూపించారు. చూపించారు. కార్తీక్ సివిల్ ఇంజినీర్‌గా పనిచేస్తుంటాడు. చాలా ఇన్నోసెంట్.
కార్తీక్ లైఫ్‌లోకి అనుకోకుండా ప్రియ ఎంట్రీ ఇస్తుంది. ప్రియను ప్రాణంగా ప్రేమిస్తాడు కార్తీక్. కానీ ప్రియ మాత్రం కార్తీక్‌ను అనుమానిస్తుంది. అతడి ప్రేమకు టెస్ట్‌లు పెడుతుంది. ఆ టెస్టుల్లో పాస్ కావడానికి కార్తీక్ ఎలాంటి కష్టాలు పడ్డాడు? కార్తీక్ చెల్లులు అమృతకు ప్రియ అన్నయ్య మనోజ్‌కు ఉన్న సంబంధం ఏమిటి?ప్రియ సైకోలా బిహేవ్ చేయడానికి కారణం ఏమిటనే అంశాలతో పాగల్ వర్సెస్ కాదల్ సినిమా తెరకెక్కింది.
రాచరికంలో…
ఈ సినిమాలో బ్రహ్మాజీ, షకలక శంకర్ పోలీస్ ఆఫీసర్లుగా నటించారు. ప్రవీణ్ మ్యూజిక్ అందించాడు. విజయ్ శంకర్ తెలుగులో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథాంశాలతో కూడిన చిన్న సినిమాల్లో హీరోగా కనిపించాడు. ఇటీవల రిలీజైన రాచరికంలో సొసైటీలో అసమానతలను ఎదురించే ప్రేమికుడిగా నటించాడు. ఫోకస్, 2020 గోల్‌మాల్, కపట నాటక సూత్రధారి, దేవరకొండలో విజయ్ ప్రేమకథతో పాటు మరికొన్ని సినిమాలు చేశాడు.
ఒకే రోజు రిలీజ్…
విషిక హీరోయిన్‌గా నటించని పాగల్ వర్సెస్ కాదల్, కమిటీ కుర్రోళ్లు…రెండు ఒకే రోజు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఎమోషనల్ ఫూల్, హ్యాపీ బర్త్‌డేతో పాటు మరికొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కనిపించింది. పరువు, పరంపర వెబ్‌సిరీస్‌లలో కీలక పాత్రలు పోషించింది.
సంబంధిత కథనం