Best Web Hosting Provider In India 2024

Karthika Deepam 2 Serial: దీపపై రౌడీల ఎటాక్ – గన్ గురిపెట్టిన జ్యోత్స్న – కార్తీక్ ఎంట్రీతో సీన్ రివర్స్!
Karthika Deepam 2 Serial: కార్తీక దీపం 2 మార్చి 1 ఎపిసోడ్‌లో దీప, శౌర్యలను చంపేందుకు రౌడీలతో డీల్ కుదర్చుకుంటుంది జ్యోత్స్న. దీపను కత్తితో ఓ రౌడీ పొడవబోతాడు. రౌడీల ప్లాన్‌ను కనిపెట్టిన దీప వారిని చితక్కొడుతుంది. రౌడీలకు దొరక్కుండా శౌర్య పారిపోతుంది.
Karthika Deepam 2 Serial: చిన్నతనంలో తన ప్రాణాలు కాపాడిన ప్రాణదాత దీప అనే నిజం కార్తీక్‌కు తెలుస్తుంది. నా ప్రాణాలు కాపాడిన నువ్వే…నా జీవితంలోకి భార్యగా వస్తావని ఊహించలేదని అనుకుంటాడు కార్తీక్. ఆనందం పెట్టలేకపోతాడు. నువ్వు నాకు ఎంత పెద్ద సర్‌ప్రైజ్ ఇద్దామని అనుకున్నావో…నేను నీకు అంత కన్న పెద్ద సర్‌ప్రైజ్ ఇస్తానని స్కూల్‌కు బయలుదేరుతాడు.
లోకువ కాకూడదు…
శౌర్యను తీసుకొని స్కూల్ బయటకు వస్తుంది దీప. ఆటో స్టాండ్ వరకు నడవటానికి శౌర్య ఇబ్బంది పడుతుంది. కాళ్లు నొస్తున్నాయని అంటుంది. ఇలాంటి టైమ్‌లో జ్యోత్స్న వస్తే బాగుంటుందని శౌర్య చెబుతుంది జ్యోత్స్న వచ్చిన కారు ఎక్కొద్దని, ఎవరికి లోకువ కాకూడదని కూతురికి అర్థమయ్యేలా వివరిస్తుంది దీప.
జ్యోత్స్న స్కెచ్…
దీప, శౌర్యలను చంపడానికి జ్యోత్స్న ప్లాన్ చేస్తుంది. స్కూల్ దగ్గరే వారికి కనిపించకుండా దాక్కుంటుంది. జ్యోత్స్నతో డీల్ కుదర్చుకున్న రౌడీలు దీపను రౌండప్ చేస్తారు. ఓ రౌడీ వచ్చి హాస్పిటల్ అడ్రెస్ గురించి దీపను అడుగుతూ మాటల్లో పెడతాడు. వెనకనుంచి మరో రౌడీ కత్తితో పొడవబోతాడు. కత్తి పట్టుకున్న రౌడీ నీడ కనిపించడంతో దీప ఎలర్ట్ అవుతుంది.
ఆ రౌడీలపై ఎదురుతిరిగి చితక్కొడుతుంది. కానీ ఓ రౌడీ వెనుక నుంచి వచ్చి దీప తలపై బలంగా కర్రతో కొడతాడు. దాంతో దీప రౌడీలకు దొరికిపోతుంది. శౌర్యను చంపబోతారు రౌడీలు. పారిపోమని కూతురితో చెబుతుంది దీప. తల్లి చెప్పినట్లుగానే అక్కడి నుంచి పరిగెత్తుతుంది శౌర్య. రౌడీలు శౌర్య వెంటపడతారు.
పారిపోయిన శౌర్య…
జ్యోత్స్న రంగంలోకి దిగుతుంది. మత్తు మందు కలిపిన కర్ఛీఫ్‌ను అడ్డం పెట్టి దీప స్పృహ కోల్పోయేలా చేస్తుంది. జ్యోత్స్నను శౌర్య చూస్తుంది. జ్యోత్స్న మారిపోయిందని, మనం చెప్పిన మాట వింటుందనే నమ్మకం కలుగుతుందని భర్తతో అంటుంది సుమిత్ర. జ్యోత్స్న మారిపోయిందంటే నువ్వు నమ్ముతున్నావా అని సుమిత్రతో అంటాడు దశరథ్.
జ్యోత్స్న తనకు సారీ చెప్పిందని, గిల్టీగా ఫీలవుతుందని అన్నదని సుమిత్ర అంటుంది. జ్యోత్స్న సడెన్‌గా మారిడం చూసి దశరథ్ అనుమానపడతాడు. జ్యోత్స్న మనుషుల ప్రాణాలు కూడా తీయడానికి వెనుకాడదని, మార్పు వచ్చిందంటే ఏదో ఘోరం చేస్తూ ఉంటుంది, అది ఏమై ఉంటుంది అని దశరథ్ ఆలోచిస్తాడు.
జ్యోత్స్న ఆర్డర్…
రౌడీలకు దొరక్కుండా దాక్కుంటుంది శౌర్య. కానీ రౌడీలు ఆమెను చూస్తారు. శౌర్య మళ్లీ ఎవరి కంటికి కనిపించకూడదని, చంపేయమని రౌడీలకు ఆర్డర్ వేస్తుంది జ్యోత్స్న. దీప సంగతి తాను చూసుకుంటానని, పాపను పట్టుకోమని తన దగ్గర ఉన్న రౌడీలను కూడా పంపేస్తుంది. శౌర్యకు ఇదే ఆఖరు రోజు కావాలని అంటుంది.
నన్ను చంపడం తప్ప…
నిన్ను చంపడం తప్ప నాకు వేరే దారి లేదని, నీకు పుట్టిన పాపానికి శౌర్య కూడా చావాల్సిందేనని స్పృహలో లేని దీపతో అంటుంది జ్యోత్స్న. నువ్వు బతికి ఉంటే ఎప్పటికైనా నాకు ప్రమాదమే అని అంటుంది.
సైకిల్‌పై కార్తీక్ స్కూల్‌కు బయలుదేరుతాడు. నువ్వు నా ప్రాణదాతవు అనే నిజం తెలిసి కూడా ఇన్నాళ్లు నా దగ్గర దాచినందుకు నిన్ను క్షమించకూడదని, గట్టిగా హగ్ చేసుకొని పనిష్‌మెంట్ ఇవ్వాల్సిందేనని దీపను ఉద్దేశించి కార్తీక్ మనసులో అనుకుంటాడు.
గన్ గురిపెట్టిన జ్యోత్స్న…
గన్ తీసి దీపకు గురి పెడుతుంది జ్యోత్స్న. ముందు నువ్వు వెళ్లు…ఆ తర్వాత నీ కూతురుని నీ దగ్గరకు పంపిస్తానని అంటుంది. షూట్ చేయబోతుండగా సైకిల్ బెల్ సౌండ్ వినిపిస్తుంది. కార్తీక్ కనిపిస్తాడు. షాకైన జ్యోత్స్న… కార్తీక్‌కు కనిపించకుండా దాక్కుంటుంది.
దీపను చూసిన కార్తీక్…
రోడ్డుపై శౌర్య బ్యాగ్ కనిపించడంతో కార్తీక్ సైకిల్ ఆపేస్తాడు. బ్యాగ్ పక్కనే దీప చెప్పులు కనిపిస్తాయి. వాళ్లకు ఏదో ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానపడతాడు. దీప కోసం కార్తీక్ వెతకడం మొదలుపెడతాడు. కార్తీక్‌కు కనిపించకుండా జ్యోత్స్న అక్కడి నుంచి పారిపోతుంది.
చెట్ల మధ్య స్పృహ కోల్పోయి పడి ఉన్న దీపను చూస్తాడు కార్తీక్. పరిగెత్తుకుంటూ దీప దగ్గరకు వస్తాడు. దీపను ఎవరైనా చంపడానికి ప్రయత్నించి ఉంటారని అనుమానిస్తాడు. దీప మిస్సయిన శౌర్యను మాత్రం వదిలిపెట్టకూడదని జ్యోత్స్న ఫిక్సవుతుంది. శౌర్య పారిపోతూ రౌడీల కంటపడకుండా ఓ బస్ కింద దాక్కుంటుంది.
ఎవరూ కాపాడలేరు…
శౌర్యను వెతుక్కుంటూ కార్తీక్ వస్తోన్న సంగతి రౌడీలకు చెబుతుంది జ్యోత్స్న. వాడికి పాప ప్రాణాలతో కనిపించకూడదని అంటుంది. తండ్రిన చంపాలనుకున్నా…కానీ ప్రాణాలతో బయటపడ్డాడు. ఇప్పుడు దీపను చంపాలనుకుంటే బావ వచ్చి కాపాడాడు. కానీ శౌర్య ప్రాణాలు మాత్రం ఎవరూ కాపాడలేరని అనుకుంటుంది.
కార్తీక్ ఎంట్రీ…
శౌర్య బస్ కింద దాక్కున్న విషయం రౌడీలు కనిపెట్టేస్తారు. శౌర్యనుపట్టుకుంటారు. అప్పుడే అక్కడికి కార్తీక్ ఎంట్రీ ఇస్తాడు. ఆ రౌడీలను కొడతాడు. కానీ వెనక నుంచి వచ్చిన మరో రౌడీ కార్తీక్ తలపై కర్రతో గట్టిగా కొడతాడు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ముగిసింది.
సంబంధిత కథనం