Best Web Hosting Provider In India 2024

Ankle Weights Walking: నడుముతో పాటు తొడల భాగంలో కొవ్వు కరిగించుకొనేందుకు వాకింగ్‌లో ఈ కొత్త టెక్నిక్ ట్రై చేయండి!
Ankle Weights Walking: ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలనుకునే వారికి వాకింగ్ అనేది మంచి వ్యాయామం. ఎవరికి వారు వాకింగ్‌ను మరింత ప్రభావవంతంగా చేసుకునేందుకు ఉపయోగించుకునే ప్రక్రియే చీలమండలకు బరువులు తగిలించుకోవడం. ఈ వ్యాయామం ఆరోగ్యానికి ఎందుకు మంచిదో తెలుసుకుందామా!
వాకింగ్‌కు వెళ్లాలనుకునే వారు ఒకసారి కొత్తగా ట్రై చేయండి. యాంకిల్ వెయిట్స్ అంటే చీలమండల దగ్గర బరువును యాడ్ చేసుకోవడం వల్ల మీ వ్యాయామ తీవ్రతను పంచుకోండి. చూడటానికి కూడా ఫ్యాషన్ గా అనిపించే ఈ వెయిట్స్ మీ వాకింగ్ ప్రక్రియను మరింత ప్రభావవంతంగా మారుస్తుంది. వాకింగ్ మూమెంట్ ను కఠిన తరం చేసి ఎక్కువ కేలరీలు ఖర్చు అయ్యేలా చేస్తుంది. ఇలా జరగడం వల్ల మీ కాలు, నడుము భాగంలోని కండరాలు మరింత పటిష్ఠంగా తయారవుతాయి.
యాంకిల్ వెయిట్స్ అంటే ఏమిటి?
ఫిట్‌నెస్ పెంచుకునేందుకు చాలా మంది వినియోగించే ఒక ట్రైనింగ్ టూల్ ఈ యాంకిల్ వెయిట్స్. మీ శరీర బరువును పెంచి మీ మొత్తం సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇవి చాలా వరకూ మెటల్స్ తో లేదా ఇసుకతో తయారుచేస్తారు. ఈ బరువులు ప్రత్యేకంగా నడుం భాగాన్ని, తొడ భాగాన్ని టార్గెట్ చేస్తాయి.
యాంకిల్ వెయిట్స్ వల్ల కలిగే లాభాలేంటి?
నార్మల్ వాకింగ్ చేయడం కంటే వెయిట్స్ తో వాకింగ్ చేయడం బాగా ఉపయోగకరంగా ఉంటుందట. దీని వల్ల కలిగే మరిన్ని ఉపయోగాలేంటో తెలుసుకుందామా!
1. పట్టుదల పెరగడం: యాంకిల్ వెయిట్స్‌తో నడిస్తే మీ కాళ్ళు, హిప్స్ లోని కండరాలు బలంగా మారతాయి.
2. సమతుల్యత పెరుగుతుంది: ఈ వెయిట్స్ నడకలో స్థిరంగా ఉండటానికి సహాయపడతాయి. వీటితో నడిస్తే కిందపడడం లేదా తూలిపడడం చాలా తక్కువగా ఉంటుంది.
3. జాయింట్ ఆరోగ్యం: వీటిని వాడటం వల్ల మీ జాయింట్లకు చీలమండలు, మోకాళ్లు, అరికాళ్లకు మంచి సహాయం అంది, బలంగా మారతాయి.
4. బరువు తక్కువ చేయడం: యాంకిల్ వెయిట్స్ వేయడం వల్ల మీ శరీరానికి అదనపు శక్తి అవసరం అవుతుంది. దీనివల్ల మీరు ఎక్కువ కేలరీలు ఖర్చు చేయవచ్చు.
5. గుండెకు ఆరోగ్యం: వీటితో రెగ్యూలర్ గా నడవడం వల్ల, గుండెకు రక్తప్రసరణ మంచిగా అవుతుంది. అంతేకాకుండా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
6. ఎముకలు బలంగా అవ్వడం: వయస్సు పెరిగేసరికి ఎముకలు బలహీనపడవచ్చు. కానీ వీటితో నడవడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి.
ఎలా వాడాలి:
- తక్కువ బరువుతో మొదలు పెట్టాలి: ముందుగా 1-2 కిలోలతో మొదలుపెట్టి, క్రమంగా బరువు పెంచుకోండి.
- సౌకర్యంగా ఉండాలి: మీరు వేసుకునే యాంకిల్ వెయిట్స్ సౌకర్యంగా ఉండాలి. అలాగే, మంచి షూస్ కూడా ధరించండి.
- నడక సమయంలో సరైన స్థితిలో ఉండండి: మీరు నడుస్తున్నప్పుడు, మీ మెడ నేరుగా ఉంచి, కొంతమేర కండరాలను వినియోగించడం మంచిది.
ప్రమాదాలు:
1. కండరాల అసమతుల్యత: వీటితో కండరాలు బలపడతాయి. కానీ, ఇతర భాగాలపై దృష్టి సారించకపోతే అసమతుల్యత ఏర్పడవచ్చు.
2. గాయాలు: ఎక్కువ బరువు వాడితే గాయాలు కావచ్చు. కొంచెం బరువు తీసుకుని, క్రమంగా పెంచండి.
3. మోకాలు, చీలమండపై ఒత్తిడి: యాంకిల్ వెయిట్స్ వాడటం వల్ల మోకాలు మీద ఒత్తిడి పెరిగి, సమస్యలు రావచ్చు, ప్రత్యేకంగా ఆర్ధరైటిస్ ఉన్నవారికి ప్రమాదకరంగా మారొచ్చు.