Santhana Prapthirasthu: స్పెర్మ్ కౌంట్ తక్కువ, 100 రోజుల్లో ప్రెగ్నెంట్.. నవ్విస్తున్న సంతాన ప్రాప్తిరస్తు టీజర్

Best Web Hosting Provider In India 2024

Santhana Prapthirasthu: స్పెర్మ్ కౌంట్ తక్కువ, 100 రోజుల్లో ప్రెగ్నెంట్.. నవ్విస్తున్న సంతాన ప్రాప్తిరస్తు టీజర్

Sanjiv Kumar HT Telugu
Mar 05, 2025 04:08 PM IST

Santhana Prapthirasthu Teaser Released By Sandeep Reddy Vanga: స్పెర్మ్ కౌంట్, ప్రెగ్నెన్సీ వంటి అంశాల చుట్టూ తెరకెక్కిన తెలుగు కామెడీ చిత్రం సంతాన ప్రాప్తిరస్తు. తాజాగా సంతాన ప్రాప్తిరస్తు టీజర్‌ను డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా రిలీజ్ చేశారు. నవ్విస్తోన్న సంతాన ప్రాప్తిరస్తు టీజర్ చూస్తే..!

స్పెర్మ్ కౌంట్ తక్కువ, 100 రోజుల్లో ప్రెగ్నెంట్.. నవ్విస్తున్న సంతాన ప్రాప్తిరస్తు టీజర్
స్పెర్మ్ కౌంట్ తక్కువ, 100 రోజుల్లో ప్రెగ్నెంట్.. నవ్విస్తున్న సంతాన ప్రాప్తిరస్తు టీజర్

Sandeep Reddy Vanga Released Santhana Prapthirasthu Teaser: విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “సంతాన ప్రాప్తిరస్తు”. ఈ సినిమాను మధుర ఎంటర్‌టైన్‌మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్‌పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు.

ఏబీసీడీ, అహ నా పెళ్లంట డైరెక్టర్

అల్లు శిరీష్ హీరోగా “ఏబీసీడీ” సినిమా, రాజ్ తరుణ్‌తో “అహ నా పెళ్లంట” వెబ్ సిరీస్ రూపొందించిన దర్శకుడు సంజీవ్ రెడ్డి సంతాన ప్రాప్తిరస్తు సినిమాను తెరకెక్కించారు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా, ఏక్ మినీ కథ లాంటి చిత్రాలకు స్క్రీన్ ప్లే అందించిన రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రాస్తున్నారు.

సందీప్ రెడ్డి వంగా చేతుల మీదుగా టీజర్

యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా సంతాన ప్రాప్తిరస్తు టీజర్‌ను ఇవాళ (మార్చి 5) రిలీజ్ చేశారు. యానిమల్, అర్జున్ రెడ్డి చిత్రాల డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సంతాన ప్రాప్తిరస్తు టీజర్‌ను విడుదల చేశారు.

నవ్వించేలా సీన్స్

“సంతాన ప్రాప్తిరస్తు” సినిమా టీజర్ చూసి సందీప్ రెడ్డి వంగా హిలేరియస్‌గా ఎంజాయ్ చేశారు. ఈ టీజర్ ఆద్యంతం సందీప్ రెడ్డిని ఎంటర్‌టైన్ చేసింది. “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా టీజర్ చూసిన సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. “టీజర్ ప్రామిసింగ్‌గా ఉంది. సంతాన ప్రాప్తిరస్తు మంచి ఎంటర్‌టైనింగ్ మూవీలా అనిపిస్తోంది. అన్ని సీన్స్ నవ్వించాయి. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నా. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్” అని చెప్పారు.

ప్రేమించి పెళ్లి చేసుకుని

ఇక “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా టీజర్ ఎలా ఉందో చూస్తే.. సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా పనిచేసే హీరో విక్రాంత్ మీద వర్క్ ప్రెజర్ ఎక్కువే ఉంటుంది. సాఫ్ట్ వేర్ ఫీల్డ్‌లో యూత్ లైఫ్‌కు విక్రాంత్ ఒక ఎగ్జాంపుల్‌గా కనిపిస్తాడు. అందమైన అమ్మాయి కల్యాణి ( చాందినీ చౌదరి)ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కల్యాణి తండ్రికి ఈ పెళ్లి ఏమాత్రం ఇష్టం ఉండదు.

పిల్లల కోసం ప్రయత్నాలు

అయితే, పెళ్లయ్యాక పిల్లలు పుడితే పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తారని డైరెక్టర్ తరుణ్ భాస్కర్ క్యారెక్టర్ సలహా ఇస్తుంది. పిల్లల కోసం విక్రాంత్, కల్యాణి ట్రై చేస్తుంటారు. అయితే, విక్రాంత్‌కు స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటంతో ఈ కొత్త జంట పేరెంట్స్ కాలేకపోతారు. స్పెర్మ్ కౌంట్ పెంచుకునేందుకు వైద్యుల సలహాలు, డైట్ ఫాలో అవుతూ వంద రోజుల్లో తన భార్యను ప్రెగ్నెంట్ చేయాలని ప్రయత్నాలు మొదలుపెడతాడు హీరో.

సక్సెస్ అయ్యాడా

ఈ ప్రయత్నంలో తను సక్సెస్ అయ్యాడా లేదా అనేది టీజర్‌లో ఆసక్తి కలిగించింది. ఫన్, ఎమోషన్‌తో పాటు నేటితరం యూత్ ఎదుర్కొంటున్న ‘కన్సీవ్’ సమస్యను అన్ని వర్గాల ప్రేక్షకులు చూసేలా కన్విన్సింగ్‌గా ఈ మూవీలో చూపించినట్లు సంతాన ప్రాప్తిరస్తు టీజర్‌తో తెలుస్తోంది.

Sanjiv Kumar

TwittereMail

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌ కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024