






Best Web Hosting Provider In India 2024

Ramam Raghavam OTT Release Date: మూడు వారాల్లోనే ఓటీటీలోకి వస్తున్న తెలుగు థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
Ramam Raghavam OTT Release Date: తెలుగు థ్రిల్లర్ మూవీ రామం రాఘవం మూడు వారాల్లోనే ఓటీటీలోకి వస్తోంది. త్వరలోనే ఓ ఓటీటీ ఈమధ్యే అనౌన్స్ చేయగా.. తాజాగా మరో ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని కూడా వెల్లడించింది.
Ramam Raghavam OTT Release Date: జబర్దస్త్ కమెడియన్ ధనరాజ్ డైరెక్ట్ చేసిన మూవీ రామం రాఘవం. ఈ సినిమా గత నెల 21న థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు మూడు వారాల్లోనే డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. అయితే ఈ తెలుగు థ్రిల్లర్ సినిమా రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ పైకి రానుండటం విశేషం.
రామం రాఘవం ఓటీటీ రిలీజ్ డేట్
రామం రాఘవం మూవీ స్ట్రీమింగ్ తేదీని బుధవారం (మార్చి 5) సన్ నెక్ట్స్ ఓటీటీ అనౌన్స్ చేసింది. మార్చి 14 నుంచి ఈ మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు చెప్పింది. తెలుగుతోపాటు తమిళంలోనూ రానుంది.
“మీరు ఊహించలేని విధంగా సాగే ఓ తండ్రీకొడుకుల కథ ఇది. రామం రాఘవం మార్చి 14 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది” అనే క్యాప్షన్ తో సన్ నెక్ట్స్ ట్వీట్ చేసింది. ఈ సినిమాలో సముద్రఖని, ధనరాజ్, హరీష్ ఉత్తమన్, సత్య, వెన్నెల కిశోర్, శ్రీనివాస్ రెడ్డి, సునీల్, పృథ్వీ రాజ్ నటించారు.
మరో ఓటీటీలోకి కూడా..
నిజానికి రామం రాఘవం మూవీ మరో ఓటీటీలోకి కూడా రానుంది. ఈ మధ్యే ఈటీవీ విన్ ఓటీటీ మూవీ స్ట్రీమింగ్ పై అప్డేట్ ఇచ్చింది. అయితే ఆ ప్లాట్‌ఫామ్ త్వరలోనే అని చెప్పింది తప్ప స్ట్రీమింగ్ తేదీని వెల్లడించలేదు. “కొన్ని యుద్ధాలు కుటుంబాల్లోనే ఉంటాయి. కానీ ఇది మాత్రం బిగ్ స్క్రీన్ పై దుమారం రేపింది. రీసెంట్ బ్లాక్‌బస్టర్ కోసం సిద్ధంగా ఉండండి.
త్వరలోనే ఈటీవీ విన్ లోకి వస్తోంది” అనే క్యాప్షన్ తో రామం రాఘవం మూవీ ఓటీటీ రిలీజ్ పై అప్డేట్ ఇచ్చింది. ఇప్పుడు సన్ నెక్ట్స్ ఓటీటీ డిజిటల్ ప్రీమియర్ అనౌన్స్ చేయడంతో ఈటీవీ విన్ కూడా త్వరలోనే ఓ తేదీ వెల్లడించే అవకాశం ఉంది.
రామం రాఘవం మూవీ ఎలా ఉందంటే?
జబర్దస్త్ కమెడియన్ వేణు బాటలోనే ఇప్పుడు ధనరాజ్ కూడా వెళ్లాడు. గతంలో అతడు బలగం మూవీతో హిట్ కొట్టగా.. ఇప్పుడితడు రామం రాఘవంతో వచ్చాడు. ఈజీ మనీ కోసమో, వ్యసానాల బారిన పడో తల్లిదండ్రులను చంపడానికి కొడుకులు సిద్ధపడిన కథనాలు అప్పుడప్పుడు పత్రికల్లో టీవీలో కనిపిస్తుంటాయి.
ఆ సంఘటనల నుంచే స్ఫూర్తి పొందుతూ రైటర్ శివ ప్రసాద్ రామం రాఘవం కథను రాసుకున్నట్లుగా అనిపించింది. ఈ పాయింట్‌ను ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్‌గా మనసుల్ని కదలించేలా స్క్రీన్‌పై ప్రజెంట్ చేశాడు ధన్‌రాజ్.
నిజాయితీపరుడైన తండ్రి…అడ్డదారుల్లో పయనించే కొడుకు.. వారిద్దరి మధ్య విద్వేషాలు, విభేదాలు ఎలాంటి పరిణామాలకు దారితీసాయన్నదే రామం రాఘవం మూవీ కథ. ఈ పాయింట్‌ను యాక్షన్, కామెడీ ట్రాక్‌లాంటి కమర్షియల్ హంగులతో చెప్పే స్కోప్ ఉంది.
కానీ ధన్‌రాజ్ అవసరపు అంశాల జోలికి వెళ్లి కథను పక్కదారి పట్టించకుండా నిజాయితీగా కథను చెప్పాడు. సముద్రఖని, ధన్‌రాజ్ కాంబోలో వచ్చే డైలాగ్స్, సీన్స్ తెచ్చిపెట్టినట్లుగా కాకుండా నాచురల్‌గా సాగుతాయి.
రామం రాఘవం మంచి ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ. కమెడియన్‌గా తనకున్న ఇమేజ్ను క్యాష్ చేసుకోవాలనే ఆలోచనతో కాకుండా తాను నమ్మిన కథతో ధన్‌రాజ్ నిజాయితీగా ఈ సినిమా చేశాడు. థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ రాని ఈ మూవీని త్వరలోనే ఈటీవీ విన్ ఓటీటీలో చూడొచ్చు. స్ట్రీమింగ్ తేదీపై కూడా త్వరలోనే అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది.
సంబంధిత కథనం