






Best Web Hosting Provider In India 2024

Star Maa New Serial: స్టార్ మాలో సరికొత్త సీరియల్.. వచ్చే వారం నుంచే.. ఆ సీరియల్ స్థానంలోనే..
Star Maa New Serial: స్టార్ మాలో సరికొత్త సీరియల్ వస్తోంది. వచ్చే సోమవారం (మార్చి 10) నుంచే ఈ సీరియల్ ప్రారంభం కానుండటం విశేషం. సాయంత్రం 6 గంటలకు రానుంది.
Star Maa New Serial: తెలుగులో టాప్ సీరియల్స్ కు పెట్టింది పేరైన స్టార్ మాలో సరికొత్త సీరియల్ రాబోతోంది. ఈ సీరియల్ పేరు భానుమతి. తాజాగా ఈ సరికొత్త సీరియల్ ను ఆ ఛానెల్ అనౌన్స్ చేసింది. అది కూడా ప్రైమ్ టైమ్ ప్రారంభమయ్యే సాయంత్రం 6 గంటలకు ఈ కొత్త సీరియల్ రానుండటం ఆసక్తి రేపుతోంది.
భానుమతి సీరియల్
భానుమతి సీరియల్ వచ్చే సోమవారం (మార్చి 10) నుంచి ప్రారంభం కానుంది. సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6 గంటలకు టెలికాస్ట్ కానున్నట్లు స్టార్ మా ఛానెల్ వెల్లడించింది. ఇది చెదిరన కలా లేక ఓ కొత్త ఆశకు ఆరంభమా అంటూ భానుమతి మా ఇంటి మాలక్ష్మి సీరియల్ ను అనౌన్స్ చేసింది. ఈ సందర్భంగా ఆ ఛానెల్ ఓ ప్రకటన రిలీజ్ చేసింది.
“సీరియల్ అంటే కేవలం వినోదం మాత్రమే కాదు విలక్షణమైన కథతో పాటు వ్యవస్థపై నమ్మకం, సంప్రదాయాల పట్ల గౌరవం, పోరాటతత్వం వంటి విలువలతో కూడుకున్నది ఉండేలా స్టార్ మా ముందు నుంచి అడుగులు వేస్తూ వస్తోంది.
ఈ క్రమంలో స్టార్ మాలో అందించిన పాత్రలు సాహసం, ధైర్యం, ఆత్మవిశ్వాసం, నమ్మకం, బాధ్యత, నిజాయతీ, కరుణ, దయ వంటి వాటిని మనకు చూపిస్తూ వచ్చాయి. వీటి కోవలోకి మరో కొత్త పాత్ర వచ్చి చేరబోతోంది. ఆ పాత్రే ‘భానుమతి’. మనం ఎగరాలని బలంగా అనుంటే రెక్కలు వాటంతట అవే వస్తాయని రుజువు చేసే అమ్మాయి కథే ఇది” అని అందులో స్టార్ మా పేర్కొంది.
భానుమతి స్టోరీ ఇలా..
చదువే జీవితానికి వెలుగు చూపించే దీపం అని నమ్మే అమ్మాయే భానుమతి. బాగా చదువుకుని డాక్టర్ కావాలనేది ఆమె కల. తన లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో భానుమతి ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంది.. వాటిని ధైర్యంగా ఎలా అధిగమించిందో చెప్పే కథ ‘భానుమతి’. ఈ సరికొత్త సీరియల్ మార్చి 10 నుంచి స్టార్ మాలో ప్రసారం కానుంది.
తెలుగు సంప్రదాయాల ప్రకారం మన కుటుంబాల్లో ఆడపిల్లను ఇంటి మహాలక్ష్మిగా భావిస్తుంటాం. అందుకనే ‘భానుమతి’ కథకి ‘మా ఇంటి మాలక్ష్మి’ అనే ట్యాగ్ లైన్‌ను పెట్టారు. ఈ సీరియల్ ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ప్రసారం అవుతుంది.
సత్యభామ సీరియల్ స్థానంలోనే..
స్టార్ మాలో సుమారు ఏడాదిన్నరగా సాగుతున్న సత్యభామ సీరియల్ స్థానంలో ఈ భానుమతి రానుంది. ఈ మధ్యే సత్యభామ ముగియనున్నట్లు వచ్చిన వార్తలు ఆ సీరియల్ అభిమానులను షాక్ కు గురి చేశాయి. ఈ శనివారం (మార్చి 8)తో ఈ సీరియల్ ముగియనుంది. సోమవారం (మార్చి 10) నుంచి భానుమతి సీరియల్ ఈ సత్యభామ వచ్చే సాయంత్రం 6 గంటలకే రానుండటం విశేషం.
సత్యభామ సీరియల్‌లో నిరంజన్, దేబ్జానీ మోదక్ జంటగా నటించారు. క్రిష్, సత్య అనే క్యారెక్టర్స్‌లో నటించారు. సత్యభామ సీరియల్ 2023 డిసెంబర్ 18న మొదలైంది. సోమవారం నాటితో ఈ సీరియల్ 341 ఎపిసోడ్స్ పూర్తిచేసుకుంది. 346 ఎపిసోడ్స్‌తో సీరియల్‌ను ఎండ్ చేయబోతున్నారు.
సంబంధిత కథనం