Malakpet Murder Mystery : మలక్ పేట్ వివాహిత అనుమానాస్పద మృతి కేసులో బిగ్ ట్విస్ట్, హత్య చేసింది ఆడపడుచే

Best Web Hosting Provider In India 2024

Malakpet Murder Mystery : మలక్ పేట్ వివాహిత అనుమానాస్పద మృతి కేసులో బిగ్ ట్విస్ట్, హత్య చేసింది ఆడపడుచే

Bandaru Satyaprasad HT Telugu Mar 05, 2025 07:20 PM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Twitter
  • Share on Facebook
Bandaru Satyaprasad HT Telugu
Mar 05, 2025 07:20 PM IST

Malakpet Murder Mystery : మలక్ పేట్ వివాహిత శిరీష అనుమానాస్పద మృతి కేసులో సంచనాలు వెలుగులోకి వచ్చాయి. మత్తుమందు ఇచ్చి, ఊపిరాడకుండా చేయడంతో ఆమె మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో శిరీష భర్త, అతడి సోదరిని అరెస్టు చేశారు.

 మలక్ పేట్ వివాహిత కేసులో బిగ్ ట్విస్ట్, హత్య చేసింది ఆడపడుచే
మలక్ పేట్ వివాహిత కేసులో బిగ్ ట్విస్ట్, హత్య చేసింది ఆడపడుచే
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on twitter
  • Share on Facebook

Malakpet Woman Incident : హైదరాబాద్ మలక్‌పేట్ వివాహిత శిరీష హత్య కేసులో బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. శిరీషను ఆమె భర్త సోదరి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధరించారు. భార్య హత్య విషయం తెలిసినప్పటికీ బయటపెట్టకుండా తన సోదరితో కలిసి శిరీష మృతదేహాన్ని మాయం చేసేందుకు భర్త వినయ్‌ ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. శిరీషకు మత్తు మందు ఇచ్చి, స్పృహ కోల్పోయిన తర్వాత ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. శిరీష్ భర్త వినయ్, అతడి సోదరిని పోలీసులు అరెస్టు చేశారు.

శిరీష గుండెపోటుతో మరణించిందని ఆమె భర్త వినయ్ నాటకం ఆడాడని పోలీసులు గుర్తించారు. అయితే పోస్ట్ మార్టం రిపోర్టులో ఆమె గుండె పోటుతో మరణించలేదని, ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లుగా బయటపడిందన్నారు.

అసలేం జరిగింది?

హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన శిరీష తల్లిదండ్రులు ఆమె చిన్నతనంలోనే మరణించారు. దీంతో కరీంనగర్‌కు చెందిన ఓ ప్రొఫెసర్‌ శిరీషను దత్తత తీసుకున్నారు. 2016లో నాగర్‌ కర్నూలు జిల్లా దోమలపెంటకు చెందిన వినయ్‌తో శిరీష ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ ప్రేమ వివాహం ఇష్టం లేని ప్రొఫెసర్‌ కుటుంబం శిరీషను దూరం పెట్టారు. దీంతో వీరిద్దరూ మలక్‌పేటలోని జమున టవర్స్‌లో నివాసం ఉంటున్నారు. గతంలో ప్రైవేటు ఉద్యోగం చేసిన వినయ్‌ ప్రస్తుతం ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నాడు. శిరీష స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుంది. వీరిద్దరికీ 2019లో ఓ పాప జన్మించింది.

భార్యపై అనుమానం పెంచుకున్న వినయ్ నిత్యం గొడవ పడేవాడు. ఈ నెల 2వ తేదీ ఉదయం 10 గంటలకు భార్య సోదరి స్వాతికి ఫోన్‌ చేసిన వినయ్.. శిరీష గుండెనొప్పితో మరణించినట్టు చెప్పాడు. ఈ విషయాన్ని స్వాతి తన మేనమామకు చెప్పింది. ఆయన శిరీష నెంబర్ కు ఫోన్‌ చేసి తానొచ్చేంత వరకు మృతదేహాన్ని అక్కడే ఉంచాలని చెప్పాడు. అనంతరం పలుమార్లు ఫోన్‌ చేసినా ఎవరూ స్పందించలేదు. దీంతో ఆసుపత్రిలో సంప్రదించగా… ఆమె మృతదేహాన్ని అంబులెన్స్‌లో గ్రామానికి తీసుకెళ్తున్నట్లు తెలుసుకున్నారు.

గుట్టుచప్పుడు కాకుండా ఊరికి మృతదేహం

ఆసుపత్రి నుంచి అంబులెన్స్‌ డ్రైవర్‌ నంబర్‌ తీసుకున్న శిరీష బంధువులు పోలీసులతో ఫోన్‌ చేయించారు. దీంతో వారు దోమలపెంట సమీపంలో ఉన్నట్టు తెలుసుకున్నారు. పోలీసుల సాయంతో అంబులెన్స్‌ డ్రైవర్, వినయ్‌తో ఫోన్‌లో మాట్లాడి మృతదేహాన్ని సోమవారం నగరానికి తిరిగి రప్పించారు. పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా చాదర్‌ఘాట్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పోలీసుల దర్యాప్తులో…శిరీష మెడ చుట్టూ గాయాలున్నట్లు గుర్తించారు. సీపీఆర్ చేసినప్పుడు గాయాలయ్యాయని, మరోసారి అంబులెన్స్ లో తరలించినప్పుడు గాయాలయ్యాయని వినయ్ పొంతనలేని సమాధానాలు చెప్పాడు. అయితే పోస్టుమార్టంలో ఊపిరాడకుండా చేయటంతో ఆమె మరణించినట్టు తేలడంతో అసలు విషయం బయటపడింది. దీంతో పోలీసులు వినయ్, అతడి సోదరిని అరెస్టు చేశారు.

Bandaru Satyaprasad

TwittereMail

సత్యప్రసాద్ బండారు హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్

Telangana NewsTrending TelanganaTelugu NewsHyderabadCrime Telangana
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024