Best Investigative Thriller Movies OTT: ఓటీటీలోని బెస్ట్ మలయాళం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీస్ ఇవే.. తెలుగులోనూ చూడండి

Best Web Hosting Provider In India 2024

Best Investigative Thriller Movies OTT: ఓటీటీలోని బెస్ట్ మలయాళం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీస్ ఇవే.. తెలుగులోనూ చూడండి

Hari Prasad S HT Telugu
Mar 05, 2025 06:32 PM IST

Best Investigative Thriller Movies OTT: ఓటీటీలో దిమ్మదిరిగే ట్విస్టులతో సాగే మలయాళం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాలకు కొదవే లేదు. మరి వాటిలో బెస్ట్ సినిమాలేంటి? రేఖాచిత్రమ్ ఓటీటీ స్ట్రీమింగ్ కు ముందే వీటిని చూసేయండి.

ఓటీటీలోని బెస్ట్ మలయాళం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీస్ ఇవే.. తెలుగులోనూ చూడండి
ఓటీటీలోని బెస్ట్ మలయాళం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీస్ ఇవే.. తెలుగులోనూ చూడండి

Best Investigative Thriller Movies OTT: మలయాళం సినిమాలంటే ఇష్టమా? అందులోనూ ట్విస్టులతో సాగే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ ను ఎగబడి చూస్తారా? అయితే ఓటీటీలో ఆ జానర్లో వచ్చిన బెస్ట్ మూవీస్ ఏవో ఇక్కడ చూడండి. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, సోనీలివ్, జియోహాట్‌స్టార్, జీ5 లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో వీటిని చూడొచ్చు. శుక్రవారం (మార్చి 7) రేఖాచిత్రమ్ మూవీ రాబోతున్న నేపథ్యంలో అంతకుముందే వీటిని కవర్ చేసేయండి.

సూక్ష్మదర్శిని – జియోహాట్‌స్టార్ ఓటీటీ

బేసిల్ జోసెఫ్, నజ్రియా నటించిన మూవీ సూక్ష్మదర్శిని. ఈ మూవీ జియోహాట్‌స్టార్ లో అందుబాటులో ఉంది. బెస్ట్ మలయాళం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ లో ఇదీ ఒకటి. ఇంట్లో జరిగే ఓ మర్డర్ చుట్టూ తిరిగే స్టోరీ ఇది.

కోల్డ్‌కేస్ – ప్రైమ్ వీడియో ఓటీటీ

ఓ మర్డర్ కేసును పరిష్కరించడానికి ప్రయత్నించే ఓ పోలీస్ ఆఫీసర్, ఓ జర్నలిస్టు చుట్టూ తిరిగే స్టోరీయే ఈ కోల్డ్ కేస్. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

సీబీఐ 5 – నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

మలయాళ సీనియర్ నటుడు మమ్ముట్టి ఓ సీబీఐ ఆఫీసర్ గా నటించిన సినిమా. ఓ సీరియల్ కిల్లర్ ను పట్టుకొనేందుకు ఆ అధికారి చేసే ప్రయత్నమే ఈ మూవీ. సీబీఐ 5ని నెట్‌ఫ్లిక్స్ లో చూడొచ్చు.

తలవన్ – సోనీలివ్ ఓటీటీ

తలవన్ ఓ డిఫరెంట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ. ఇది ఇద్దరు పోలీస్ ఆఫీసర్ల మధ్య నడిచే వార్. పోలీస్ డిపార్ట్‌మెంట్ లో అధికారుల మధ్య ఉండే విభేదాలు, ఇగోలను ఈ తలవన్ లో చక్కగా చూపించారు. ఈ మూవీని సోనీలివ్ ఓటీటీలో చూడొచ్చు.

ఐడెంటిటీ – జీ5 ఓటీటీ

ఐడెంటిటీ కూడా ఓ మైండ్ బెండింగ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు. ఇందులోని ట్విస్టులు అసలు ఊహించలేం. టొవినో థామస్, త్రిష్ నటించారు. ఓ పోలీస్ ఆఫీసర్, ఓ జర్నలిస్ట్, ఓ స్కెచ్ ఆర్టిస్ట్ కలిసి ఓ మర్డర్ మిస్టరీని ఛేదించే స్టోరీ ఇది. జీ5 ఓటీటీలో అందుబాటులో ఉంది.

అంజామ్ పతీర – ప్రైమ్ వీడియో ఓటీటీ

అంజామ్ పతీర్ మూవీ పోలీస్ అధికారుల హత్యలు చుట్టూ తిరిగే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ. కుంచకో బొబన్ లీడ్ రోల్లో నటించాడు. ఇందులో అతడు ఓ సైకాలజిస్ట్. ఆ హత్యలను ఛేదించడంలో అతని పాత్ర ఏంటన్నది మూవీలో చూడొచ్చు. ప్రైమ్ వీడియో ఓటీటీలో సినిమా అందుబాటులో ఉంది.

ఫోరెన్సిక్ – నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

ఫోరెన్సిక్ మూవీ నెట్‌ఫ్లిక్స్ లో ఉంది. ఈ సినిమాలో ఓ ఫోరెన్సిక్ నిపుణుడు, ఓ పోలీస్ ఆఫీసర్ కలిసి కొన్ని హత్యల వెనుక ఉన్న మిస్టరీని ఛేదించడం చూడొచ్చు. టొవినో థామస్ లీడ్ రోల్లో నటించాడు.

Hari Prasad S

TwittereMail

హరి ప్రసాద్ ఎస్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024