






Best Web Hosting Provider In India 2024

Instant suji vada: రవ్వతో కేవలం పది నిమిషాల్లొనే రుచికరమైన వడలు తయారు చేయచ్చు.. ఎలాగో ఇక్కడ తెలుసుకోండి!
Instant suji vada: బ్రేక్‌ఫాస్ట్ కోసం ముందుగా ఏమీ నానబెట్టకపోతే ఇన్‌స్టాంట్‌గా, ఈజీగా ఇలా వడలు తయారు చేసేయండి. ఇంట్లో ఎప్పుడూ ఉండే ఉప్మా రవ్వతో కేవలం పది నిమిషాల్లో వీటిని తయారు చేయచ్చు. రుచిలో కూడా ఈ వడలు అద్భుతంగా ఉంటాయి. ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్లిపోదాం రండి.

ఉదయం లేవగనే పిల్లల బాక్సుల్లోకి ఏం పెట్టాలి? వారికి హెల్తీగా, రుచిగా ఏం తినిపించాలి? ఇదేగా మీ ఆరాటం.నిజానికి ఉదయాన్నే హెల్తీగా, టేస్టీగా ఏదైనా చాలా ముఖ్యం. అయినప్పటికీ రోజుకో వైరైటీ తయారు చేయడం మాత్రం చాలా కష్టం. ముందురోజు నానబెట్టి చేసేవైతే గుర్తుంచుకుని చేయడం మరీ కష్టం. అందుకే ఇన్‌స్టంట్‌గా, హెల్తీగా చేసేవి ఏమైనా ఉంటే బాగుండు అని చాలా మంది తల్లలు, భార్యామణుులు అనుకుంటూ ఉంటారు. మీరూ అలాంటి వారే అయితే ఈ రెసిపీ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది.
ఇంట్లో అందరికీ ఇష్టమైన వడలను ఈజీగా, ఇన్‌స్టంట్‌గా చేయచ్చు. అది కూడా ఇంట్లో ఎప్పుడూ ఉండే ఉప్మా రవ్వతోనే. రుచిలో కూడా ఈ వడలు చాలా బాగుంటాయి. ఇన్ స్టాంట్ రవ్వ వడలను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం రండి..
ఇన్‌స్టాంట్ రవ్వ(సూజీ) వడ తయారీకి కావాల్సిన పదార్థాలు:
- సూజీ(ఉప్మా) రవ్వ- ఒక కప్పు
- నీరు – రెండు కప్పులు
- అల్లం- చిన్న ముక్క
- పచ్చిమర్చీ- రెండు లేదా మూడు
- చిల్లీ ఫ్లేక్స్- ఒక టేబుల్ స్పూన్
- ఉప్పు– రుచికి సరిపడా
- నూనె – డీప్ ఫ్రైకి సరిపడా
రవ్వ వడ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు:
- రవ్వతో వడ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో నీరు పోసి వేడి చేయండి.
- ఈ నీళ్లలో సన్నగా తరిగిన అల్లం ముక్క, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమర్చీ, కొత్తిమీర, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు వేసి కలపండి.
- ఇప్పుడు దీంట్లో రవ్వ వేసి వుండలు కట్టకుండా ఉండేలా బాగా కలపండి.
- స్టవ్ చిన్న మంట మీదే రవ్వ కాస్త మెత్తగా అయ్యేంత వరకూ ఉడికించండి.
- రవ్వ ఉడికి దగ్గర పడి ముద్దలా మారిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి.
- ఈ రవ్వ ముద్దలో కాస్త నూనె పోసి అంతా కలిపేయండి.
- ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న వుండలుగా తీసుకుని వడలలాగా తయారు చేసుకుని పక్కకు పెట్టుకోండి.
- ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడే ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో నూనె పోసి వేడి చేయండ.
- నూనె బాగా వేడెక్కిన తర్వాత మనం తయారు చేసి పక్కకు పెట్టుకున్న వడలను తీసి దాంట్లో వేయండి.
- నూనె వేసిన తర్వాత ఒకటి లేదా రెండు నిమిషాల తర్వాత వడను రెండో వైపుకి తిప్పుకోండి. ఇలా రెండు వైపులా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత వడలను తీసి టిష్యూ పేపర్ మీద వేయండి.
అంతే ఈజీ అంట్ టేస్టీ రవ్వ వడలు తయారు అయినట్టే. వీటిని పల్లీ చట్నీ, టమాటా చట్నీ, అల్లం చట్నీ ఇలా మీకు నచ్చిన కాంబినేషన్ లో తినచ్చు. పెరుగుతో కూడా ఈ వడలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని ఉదయం బ్రేక్‌ఫాస్ట్ గానూ తినచ్చు, సాయంత్రం స్నాక్స్ గానూ తీసుకోవచ్చు. ఎలా తిన్నా, ఎప్పుడు తిన్నా వీటి రుచి మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది.
సంబంధిత కథనం