12న ఫీజు పోరు విజ‌య‌వంతం చేయాలి

Best Web Hosting Provider In India 2024

 వేలాది మందితో కలెక్టరేట్ల వద్ద ధర్నా 

 జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు చెవిరెడ్డి హర్షిత్‌ రెడ్డి పిలుపు

తిరుపతి : వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఈనెల 12వ తేదీన జరిగే వైయ‌స్ఆర్‌సీపీ ఫీజు పోరు కార్య‌క్ర‌మాన్ని విజయవంతం చేయాలని పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి పిలుపు నిచ్చారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల నుంచి వైయ‌స్ఆర్‌సీపీ పార్టీ విద్యార్థి విభాగం నియోజకవర్గాల అధ్యక్షులతో తుమ్మలగుంటలోని చంద్రగిరి నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఆయన సమావేశమయ్యారు. 

చిత్తూరు, తిరుపతి కలెక్టరేట్ల వద్ద నిరసన

వైయ‌స్ఆర్‌సీపీ ఫీజుపోరును చిత్తూరు, తిరుపతి కలెక్టర్‌ కార్యాలయాల వద్ద విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన చేపట్టనున్నట్టు చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి తెలిపారు. చిత్తూరు కలెక్టర్‌ కార్యాలయం వద్ద కుప్పం, పలమనేరు, పుంగనూరు, పూతలపట్టు, జీడీ నెల్లూరు, చిత్తూరు నియోజకవర్గాల విద్యార్థులు, తిరుపతి కలెక్టరేట్‌ వద్ద సత్యవేడు, శ్రీకాళహస్తి, తిరుపతి, నగరి, చంద్రగిరి, వెంకటగిరి, సూళ్లూరుపేట నియోజకవర్గాల విద్యార్థులు నిరసన చేపట్టనున్నట్లు తెలిపారు. ఫీజు పోరు కార్యక్రమానికి అన్ని ప్రయివేటు విద్యాసంస్థల యజమాన్యాలు కూడా సహకరించాలని విజ్ఞ‌ప్తి చేశారు. అనంతరం అన్ని నియోజకవర్గాల వైయ‌స్‌ఆర్‌ విద్యార్థి విభాగం నూతన అధ్యక్షులను శాలువలతో సత్కరించారు. రాష్ట్ర విద్యార్థి విభాగం నాయకులు ఓబుల్‌రెడ్డి,చిద్విలాసరెడ్డి, శశి, ఎన్‌వీ.సురేష్‌, పవన్‌కుమార్‌, డీ.లో కేష్‌, బీ.హరి, మహేష్‌, చెంగల్‌రెడ్డి, ప్రేమ్‌కుమార్‌, కుప్పిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వినోద్‌, యుగంధర్‌, రాజశేఖర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, హరికుమార్‌ పాల్గొన్నారు.

May be an image of 21 people

Best Web Hosting Provider In India 2024