Mega Women Promo: నాగబాబుపై చిరంజీవి జెలస్.. అమ్మకి తమ్ముడే ఇష్టమంటూ..మెగా వుమెన్ ప్రోమో.. స్పెషల్ ఇంటర్వ్యూ.. పవన్ మిస్

Best Web Hosting Provider In India 2024

Mega Women Promo: నాగబాబుపై చిరంజీవి జెలస్.. అమ్మకి తమ్ముడే ఇష్టమంటూ..మెగా వుమెన్ ప్రోమో.. స్పెషల్ ఇంటర్వ్యూ.. పవన్ మిస్

Chandu Shanigarapu HT Telugu
Published Mar 07, 2025 09:34 PM IST

Mega Women Promo: మార్చి 8న వుమెన్స్ డే సందర్భంగా మెగా కుటుంబం నుంచి స్పెషల్ సర్ ప్రైజ్ రాబోతోంది. తల్లి, సిస్టర్స్ కలిసి మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ప్రోమో శుక్రవారం (మార్చి 7) రిలీజైంది.

తల్లి, సోదరితో చిరంజీవి, నాగబాబు
తల్లి, సోదరితో చిరంజీవి, నాగబాబు

వుమెన్స్ డే సెలబ్రేషన్స్ ముందే మొదలయ్యాయి. మహిళల దినోత్సవసం సందర్భంగా మెగా కుటుంబం నుంచి ఓ స్పెషల్ సర్ ప్రైజ్ రాబోతోంది. ఆదివారం (మార్చి 8) వుమెన్స్ డేను పురస్కరించుకుని ‘మెగా వుమెన్’ పేరుతో తల్లి, సిస్టర్స్, నాగబాబు తో కలిసి చిరంజీవి స్పెషల్ ఇంటర్వ్యూ రిలీజ్ కాబోతోంది. దీనికి సంబంధించిన ప్రోమో నేడు (మార్చి 7) రిలీజైంది. ఈ ప్రోమోలో చిరంజీవి పంచ్ లు నవ్వులు పూయిస్తున్నాయి.

సిస్టర్స్ తో కలిసి

తల్లి అంజనాదేవి, సిస్టర్స్ విజయ దుర్గ, మాధవి, తమ్ముడు నాగబాబుతో కలిసి చిరంజీవి ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అమ్మతో ఉన్న అనుబంధం గురించి వీళ్లు పంచుకున్నారు. అన్నయ్య వాళ్లు దూరంగా ఉండటంతో అమ్మకు అన్ని పనులు తానే చేసేదాన్ని అని విజయదుర్గ అన్నారు. ఇద్దరి బిడ్డలతో ధైర్యంగా ఉండాలి, ఎవరిపై ఆధారపడొద్దని అమ్మ ధైర్యమిచ్చేదని ఆమె అన్నారు.

తాను డిప్రెషన్ లోకి వెళ్లినప్పుడు అమ్మ అండగా నిలిచారని చిరంజీవి మరో సోదరి మాధవి వెల్లడించారు. ఎప్పుడూ ఒంటరిగా ఫీల్ కావొద్దని, తన కోసం అమ్మ ఎప్పుడూ ఉంటుందని అంజనాదేవి భరోసా ఇచ్చారని మాధవి అన్నారు.

అమ్మ హగ్

అమ్మ హగ్ ఇస్తే చాలు.. ఏ కష్టమైనా వెళ్లిపోతుందని నాగబాబు అనడం ప్రోమోలో కనిపించింది. తామంతా ఒక్కటిగా కలిసి ఉన్నామంటే దానికి కారణం అమ్మ అని నాగబాబు చెప్పారు. ఈ రోజుకి కూడా అమ్మను హగ్ చేసుకుంటే చాలని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఈ ఇంటర్వ్యూలో చిరంజీవి చిన్న సోదరుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాత్రం మిస్సయ్యారు. ఏపీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ ఈ ఇంటర్వ్యూలో కనిపించలేదు.

లాస్ట్ పంచ్

ప్రోమోలో లాస్ట్ పంచ్ మాత్రం చిరంజీవిదే. అమ్మ హగ్ విషయంలో నాగబాబుపై చిరు జెలసీగా మాట్లాడారు. నాగబాబు కంపెనీ అంటేనే అమ్మకు ఇష్టమన్నారు. మేం దగ్గర ఉన్నప్పుడు ఎక్కువ నవ్వదు కానీ నాగబాబు కనిపిస్తే వెంటనే నవ్వుతుందని చిరు అన్నారు. అమ్మకు వాడే ఎక్కువ క్లోజ్ అని చిరు చెప్పారు. ఇప్పటికీ వాడిని (నాగబాబు) తీసుకుని ముద్దు పెడుతుందని చిరు చెప్పారు. వెంటనే ఈ మాటలకు అంజనమ్మ నవ్వేశారు. ఫుల్ ఇంటర్వ్యూ రేపు వుమెన్స్ డే సందర్భంగా రిలీజ్ కానుంది.

Chandu Shanigarapu

eMail
Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024