






Best Web Hosting Provider In India 2024

OTT Crime Thriller Movie: ఓటీటీలోకి వస్తున్న కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. చంపడమే అతడి ఉద్యోగం
OTT Crime Thriller Movie: ఓటీటీలోకి ఇప్పుడో కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు వస్తోంది. చంపడమే ఉద్యోగంగా భావించే ఓ క్రిమినల్ స్టోరీ ఇది. తొలిసారి ఇప్పుడు ఇండియన్ ఓటీటీలోకి అడుగుపెడుతోంది.

OTT Crime Thriller Movie: క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ కు ఓటీటీలో ఫుల్ డిమాండ్. అందులోనూ కొరియన్ కంటెంట్ అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడీ రెండింటి కాంబినేషన్ లో ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీ వస్తోంది. ఈ సినిమా పేరు హిట్ మ్యాన్ (Hit Man).
హిట్ మ్యాన్ ఓటీటీ రిలీజ్ డేట్
హిట్ మ్యాన్ కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమా చాలా రోజుల తర్వాత ఇండియన్ ఓటీటీలోకి వస్తోంది. లయన్స్ గేట్ ప్లే ఓటీటీ ప్లాట్‌ఫామ్ లో మార్చి 28 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
సమాజంలోని అవినీతి, జాతి వివక్ష, వ్యవస్థీకృత నేరాలు, అన్యాయం, అసమానతలాంటి అంశాలను అందరూ మెచ్చేలా తీయడంతో కొరియన్ ఫిల్మ్ మేకర్స్ అందరి కంటే ముందుంటారు. అలా వచ్చిందే ఈ హిట్ మ్యాన్ మూవీ కూడా. సుమారు రెండున్నరేళ్ల తర్వాత ఈ సినిమా ఓటీటీ ద్వారా భారతీయ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
హిట్ మ్యాన్ మూవీ గురించి..
హిట్ మ్యాన్ నవంబర్, 2022లో రిలీజైన క్రైమ్ థ్రిల్లర్ మూవీ. కాంగ్ టే-హో డైరెక్ట్ చేశాడు. గంటా 31 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాకు థియేటర్లలో ఓ మోస్తరు రెస్పాన్స్ వచ్చింది. జియాంగ్ జీ వూ, పార్క్ జీ సూ, వోన్ సుక్ కోలాంటి వాళ్లు నటించారు.
ఈ సినిమా హిట్ మ్యాన్ అని పిలిచే ఓ ప్రొఫెషనల్ కిల్లర్ చుట్టూ తిరుగుతుంది. చంపడాన్నే ఓ ఉద్యోగంగా అతడు భావిస్తాడు. ఎవరినైనా చంపడానికి అతడు సుపారీ తీసుకున్నాడంటే ఆ వ్యక్తితో సంబంధం ఉన్న వాళ్లందరినీ కూడా చంపేయడం అతని అలవాటు.
అయితే అనుకోకుండా వచ్చే ఓ ట్విస్ట్ అతని జీవితాన్ని మార్చేస్తుంది. ఓరోజు ఓ బామ్మ అతని దగ్గరికి వస్తుంది. తన మనవరాలి మరణంపై అనుమానం వ్యక్తం చేస్తుంది. ఓ అగ్ని ప్రమాదంలో ఆమె చనిపోయిందని, అయితే అది ప్రమాదం కాకపోవచ్చని, ఏదో జరిగి ఉంటుందని అంటుంది.
అసలు ఏం జరిగిందో తెలుసుకొని, ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటున్నట్లు ఆ బామ్మ హిట్ మ్యాన్ తో చెబుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది మూవీలో చూడాలి. ఇప్పుడీ మూవీ మార్చి 28 నుంచి లయన్స్ గేట్ ప్లేలో స్ట్రీమింగ్ కు రానుంది.
సంబంధిత కథనం