Tamannaah Breakup: ప్రేమించేవాడిని కాస్త చూసుకొని సెలెక్ట్ చేసుకోండి: బ్రేకప్ వార్తల నేపథ్యంలో తమన్నా కామెంట్స్ వైరల్

Best Web Hosting Provider In India 2024

Tamannaah Breakup: ప్రేమించేవాడిని కాస్త చూసుకొని సెలెక్ట్ చేసుకోండి: బ్రేకప్ వార్తల నేపథ్యంలో తమన్నా కామెంట్స్ వైరల్

Hari Prasad S HT Telugu
Published Mar 07, 2025 01:18 PM IST

Tamannaah Breakup: తమన్నా, విజయ్ వర్మ బ్రేకప్ వార్తల నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రేమించేవాడిని కాస్త తెలివిగా సెలెక్ట్ చేసుకోండని ఆమె చెప్పడం విశేషం.

 ప్రేమించేవాడిని కాస్త చూసుకొని సెలెక్ట్ చేసుకోండి: బ్రేకప్ వార్తల నేపథ్యంలో తమన్నా కామెంట్స్ వైరల్
ప్రేమించేవాడిని కాస్త చూసుకొని సెలెక్ట్ చేసుకోండి: బ్రేకప్ వార్తల నేపథ్యంలో తమన్నా కామెంట్స్ వైరల్

Tamannaah Breakup: తమన్నా, విజయ్ వర్మ విడిపోయారా? రెండేళ్ల ప్రేమకు గుడ్ బై చెప్పి ఎవరి దారి వాళ్లు చూసుకున్నారా? ఈ వార్తలపై ఈ జంట ఇప్పటి వరకూ నోరు మెదపకపోయినా.. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ప్రేమ, రిలేషన్షిప్ పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ల్యూక్ కౌటినో పాడ్‌కాస్ట్ లో ఆమె మాట్లాడింది.

లవ్, రిలేషన్‌షిప్‌ మధ్య తేడా అదే

తమన్నా తన బ్రేకప్ రూమర్ల మధ్య అసలు ప్రేమ, రిలేషన్‌షిప్ మధ్య ఉన్న తేడా ఏంటో చెప్పే ప్రయత్నం చేసింది. ప్రేమ అనేది బేషరతుగా ఉంటుందని, అదే రిలేషన్‌షిప్ ఒకరకంగా ఓ బిజినెస్ ట్రాన్జాక్షన్ లాంటిదని ఆమె అనడం గమనార్హం.

“ప్రేమ అంటే ఏంటి, రిలేషన్‌షిప్ అంటే ఏంటి అనేదాని మధ్య చాలా మంది అయోమయానికి గురవుతుంటారు. షరతులు వచ్చి చేరే క్షణం ప్రేమ అనేది ఇక ఉండదు. ప్రేమ ఎప్పుడూ బేషరతుగా ఉండేదే. అది వన్ సైడెడ్ కూడా కావచ్చు. ప్రేమ అనేది లోపల ఉండేది.

అవతలి వ్యక్తిపై మీరు చూపించేది. అవతలి వ్యక్తి నుంచి కూడా మీరు ఏదో కోరుకుంటున్నారంటే, వాళ్లు ఇలా చేయాలని అనుకుంటున్నారంటే అప్పుడది కేవలం ఓ బిజినెస్ లావాదేవీగా మిగిలిపోతుంది. నేను ఒకవేళ ఎవరినైనా ప్రేమిస్తే వాళ్లను వాళ్లలా ఉండనీయాలన్నది నేను తెలుసుకున్నాను” అని తమన్నా చెప్పింది.

కాస్త తెలివిగా సెలెక్ట్ చేసుకోండి

ఇక ప్రేమించేవాడిని కాస్త తెలివిగా సెలెక్ట్ చేసుకోండని కూడా ఈ సందర్భంగా తమన్నా సూచిస్తోంది. నిజానికి తాను సింగిల్ గా ఉన్నప్పటి కంటే రిలేషన్షిప్ లో ఉన్నప్పుడే చాలా సంతోషంగా ఉన్నట్లు కూడా చెప్పింది. “నేను ఒంటరిగా ఉన్నప్పటి కంటే ఓ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడే చాలా సంతోషంగా ఉన్నట్లు నాకు అనిపించేది.

నాకూ ఓ తోడు ఉందన్న ఆ ఫీలింగ్ నాకు చాలా బాగా అనిపిస్తుంది. అదో అద్భుతమైన ఫీలింగ్. కానీ అది ఎవరు అన్నది ముఖ్యం. ఎందుకంటే మీ జీవితాన్ని ప్రభావితం చేసే కాస్త అవకాశాన్ని దీనిద్వారా అవతలి వ్యక్తికి ఇస్తున్నారు. అందుకే తెలివిగా ఎంపిక చేసుకోవాలి. మీ గురించి మీకు తెలిసినప్పుడు అది సాధ్యమవుతుంది” అని తమన్నా అభిప్రాయపడింది.

తమన్నా, విజయ్ బ్రేకప్

తమన్నా, విజయ్ పరస్పర అంగీకారంతో బ్రేకప్ చెప్పుకున్నట్లు ఈ మధ్యే పింక్‌విల్లాలో వచ్చిన రిపోర్టు వెల్లడించింది. ఈ ఇద్దరూ పార్ట్‌నర్లుగా విడిపోయినా.. మంచి స్నేహితులుగా కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు ఆ రిపోర్టు చెప్పింది.

2023లో గోవాలో కలిసి న్యూ ఇయర్ జరుపుకున్నప్పుడే ఈ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ గురించి బయటి ప్రపంచానికి తెలిసింది. గతేడాది నవంబర్ లో ఈ జంట పెళ్లికి సిద్ధమవుతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అంతలోనే బ్రేకప్ న్యూస్ రావడం అభిమానులను నిరాశకు గురి చేసింది.

Hari Prasad S

TwittereMail
హరి ప్రసాద్ ఎస్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024