Action OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చిన అక్ష‌య్‌కుమార్ యాక్ష‌న్ మూవీ – ఇండియా, పాకిస్థాన్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో

Best Web Hosting Provider In India 2024

Action OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చిన అక్ష‌య్‌కుమార్ యాక్ష‌న్ మూవీ – ఇండియా, పాకిస్థాన్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో

Nelki Naresh HT Telugu
Published Mar 07, 2025 01:09 PM IST

Sky Force OTT: అక్ష‌య్ కుమార్ హీరోగా న‌టించిన బాలీవుడ్ మూవీ స్కై ఫోర్స్ సెలైంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చింది. శుక్ర‌వారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో 249 రూపాయ‌ల రెంట‌ల్‌తో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ యాక్ష‌న్ మూవీలో వీర్ ప‌హారియా, సారా అలీఖాన్‌, నిమ్ర‌త్ కౌర్ కీల‌క పాత్ర‌లు పోషించారు.

యాక్షన్  ఓటీటీ
యాక్షన్ ఓటీటీ

అక్షయ్ కుమార్ హీరోగా న‌టించిన బాలీవుడ్ మూవీ స్కై ఫోర్స్ ఎలాంటి ముంద‌స్తు అనౌన్స్‌మెంట్ లేకుండా సైలెంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చింది. శుక్ర‌వారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్రీగా కాకుండా 249 రూపాయ‌ల రెంట్‌తో రిలీజ్ చేశారు. మ‌రో రెండు వారాల త‌ర్వాత ఫ్రీ స్ట్రీమింగ్ అందుబాటులోకి రానున్న‌ట్లు తెలిసింది.

థియేట‌ర్ల‌లో ఫ్టాప్‌…

స్కై ఫోర్స్ మూవీలో అక్ష‌య్ కుమార్‌తో పాటు వీర్ ప‌హారియా, సారా అలీఖాన్‌, నిమ్ర‌త్ కౌర్ కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ యాక్ష‌న్ మూవీకి సందీప్ కేవ్లానీ, అభిషేక్ అనిల్‌కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. రిప‌బ్లిక్ డే కానుక‌గా జ‌న‌వ‌రి 24న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ ఫ్లాప్ టాక్‌ను మూట‌గ‌ట్టుకుంది. దాదాపు 160 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ ఫుల్ థియేట్రిక‌ల్ ర‌న్‌లో 149 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను ద‌క్కించుకున్న‌ది.అయితే అక్ష‌య్ కుమార్ గ‌త సినిమాల‌తో పోలిస్తే క‌లెక్ష‌న్స్ ప‌రంగా ప‌ర్వాలేద‌నిపించింది.

ఫైట‌ర్‌, ఆప‌రేష‌న్ వాలెంటైన్‌…

క‌మ‌ర్షియ‌ల్‌గా ఈ మూవీ ఫెయిలైనా కాన్సెప్ట్‌తో పాటు అక్ష‌య్‌కుమార్‌, వీర్ ప‌హారియా యాక్టింగ్‌కు అడియెన్స్ నుంచి అభినంద‌న‌లు ద‌క్కాయి. అయితే ఈ కాన్సెప్ట్‌తో ఇది వ‌ర‌కే హృతిక్ రోష‌న్ ఫైటర్‌తో పాటు తెలుగులోనూ ఆప‌రేష‌న్ వాలెంటైన్ లాంటి సినిమాలొచ్చాయి. వాటి ఛాయ‌ల‌తోనే స్కై ఫోర్స్ సాగింది. విజువ‌ల్ ఎఫెక్ట్స్ ఆశించిన స్థాయిలో లేక‌పోవ‌డం సినిమాకు మైన‌స్‌గా మారింది.

1965 ఇండియా పాకిస్థాన్ యుద్ధం…

1965లో జ‌రిగిన ఇండియా, పాకిస్థాన్ వైమానిక యుద్ధం నేప‌థ్యంలో స్కై ఫోర్స్ మూవీ తెర‌కెక్కింది. ఈ యుద్ధంలో అస‌మాన ధైర్య సాహ‌సాలు ప్ర‌ద‌ర్శించిన ఇండియ‌న్ స్క్వాడ్రాన్ లీడ‌ర్స్ బొప్ప‌య్య దేవ‌య్య‌తో పాటు ఓం ప్ర‌కాష్ త‌నేజా జీవితాల స్ఫూర్తితో ద‌ర్శ‌క‌ద్వ‌యం స్కైఫోర్స్ క‌థ‌ను రాసుకున్నారు. పాక్ వైమానిక స్థావ‌రం అయిన స‌ర్దోగ మీద ఇండియా ఎందుకు దాడిచేసింది. ఈ యుద్ధంలో బొప్ప‌య్య దేవ‌య్య క‌నిపించ‌కుండా పోవ‌డానికి దారితీసిన ప‌రిణామాలేమిటి? ఈ దాడుల కార‌ణంగా రెండు దేశాల మ‌ధ్య ఎలాంటి ప‌రిస్థితులు నెల‌కొన్నాయి అనే అంశాల‌తో స్కై ఫోర్స్ మూవీ తెర‌కెక్కింది.

ప‌ది ఫ్లాప్‌లు…

స్కో ఫోర్స్ కంటే ముందు అక్ష‌య్ కుమార్ హీరోగా న‌టించిన ఖేల్ ఖేల్ మే, స‌ర్ఫిరా, భ‌డే మియా చోటే మియా, మిష‌న్ రాణిగంజ్‌, సెల్ఫీతోపాటు ప‌దికిపైగా సినిమాలు డిజాస్ట‌ర్స్ అయ్యాయి. ఈ సినిమా రిజ‌ల్ట్‌తో సంబంధం లేకుండా ప్ర‌స్తుతం హిందీలో ఏడు సినిమాలు చేస్తోన్నాడు అక్ష‌య్‌కుమార్‌. తెలుగులో మంచు విష్ణు హీరోగా న‌టిస్తోన్న క‌న్న‌ప్ప మూవీలో గెస్ట్ రోల్‌లో క‌నిపించ‌నున్నాడు. శివుడి పాత్ర‌ను పోఫిస్తున్నాడు.

Nelki Naresh

TwittereMail
నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024