Vinesh Phogat Pregnancy: ఫేమస్ ఫోగట్ ఫ్యామిలీలో హ్యాపీనెస్.. మొన్న ఎమ్మెల్యే.. ఇప్పుడేమో రెజ్లింగ్ క్వీన్ గుడ్ న్యూస్

Best Web Hosting Provider In India 2024


Vinesh Phogat Pregnancy: ఫేమస్ ఫోగట్ ఫ్యామిలీలో హ్యాపీనెస్.. మొన్న ఎమ్మెల్యే.. ఇప్పుడేమో రెజ్లింగ్ క్వీన్ గుడ్ న్యూస్

Chandu Shanigarapu HT Telugu
Published Mar 07, 2025 04:38 PM IST

Vinesh Phogat Pregnancy: ఇండియన్ రెజ్లింగ్ క్వీన్ వినేశ్ ఫోగట్ తల్లి కాబోతుంది. ఈ విషయాన్ని భర్త సోమ్‌వీర్‌తో కలిసి ఆమె ప్రకటించింది. వినేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా అన్న సంగతి తెలిసిందే.

తల్లి కాబోతున్న మాజీ రెజ్లర్ వినేశ్ ఫొగాట్
తల్లి కాబోతున్న మాజీ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ (PTI)

రెజ్లింగ్ లో దేశ, విదేశాల్లో సత్తాచాటి ఫేమసైన ఫోగట్ కుటుంబంలో ఇప్పుడో గుడ్ న్యూస్. భారత దిగ్గజ రెజ్లర్ వినేశ్ ఫోగట్ తల్లి కాబోతోంది. రెజ్లరైన సోమ్‌వీర్‌ను ఆమె 2018లో పెళ్లి చేసుకోబోతోంది. వీళ్లు తమ బిడ్డకు వెల్కం చెప్పబోతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. 30 ఏళ్ల వినేశ్ గర్భం దాల్చడం ఇదే మొదటిసారి.

న్యూ ఛాప్టర్

‘‘మా ప్రేమ కథ న్యూ ఛాప్టర్ తో కంటిన్యూ అవుతుందని’’ వినేశ్, సోమ్‌వీర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించారు. చిన్నారి పాదం ఎమోజీ, గుండె చిహ్నంతో సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. చిన్నప్పటి నుంచి రెజ్లింగ్ పైనే ప్రాణం పెట్టి సాగిన వినేశ్ ఎన్నో గొప్ప ప్రదర్శనలు చేసింది. దేశానికి పతకాలు సాధించి పెట్టింది. ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్ లో స్వర్ణాలు ముద్దాడింది. కానీ ఒలింపిక్ మెడల్ కల మాత్రం కలగానే మిగిలిపోయింది. పారిస్ ఒలింపిక్స్ లో ఆమె అనూహ్యంగా పతకానికి దూరమైంది.

అధిక బరువు

2024 పారిస్ ఒలింపిక్స్ 50 కేజీల విభాగంలో వినేశ్ ఫైనల్ చేరి హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా రెజ్లర్ గా నిలిచింది. ఆమె ఫైనల్లో గెలిస్తే పసిడి, ఓడితే రజతం వచ్చేది. కచ్చితంగా పతకం పక్కా. కానీ అధిక బరువు ఆమె ఆశలను, కోట్లాది భారతీయుల ఆకాంక్షలను తుడిచేసేంది. కేవలం 150 కేజీల బరువు అధికంగా ఉన్న కారణంగా ఫైనల్ ఆడకుండా వినేశ్ పై అనర్హత వేటు పడింది. దీంతో ఆమె గుండె పగిలింది.

రిటైర్మెంట్ నిర్ణయం

పారిస్ ఒలింపిక్స్ నుంచి కన్నీళ్లతో నిష్క్రమించిన వినేశ్.. ఆ బాధలోనే సంచలన నిర్ణయం తీసుకుంది. ఆటకు రిటైర్మెంట్ ప్రకటించి షాక్ కు గురిచేసింది. ఎమోషన్ లో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోవద్దంటూ ఆమెకు చాలా మంది చెప్పారు. కానీ వినేశ్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఫైనల్ కు ముందే అధిక బరువు ఉన్నా కాబట్టి, కనీసం రజతమైనా ఇవ్వాలని వినేశ్ అప్పీల్ చేసినా ఫలితం లేకపోయింది.

కాంగ్రెస్ ఎమ్మెల్యేగా

ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత వినేశ్ రాజకీయాల్లో అడుగు పెట్టింది. కాంగ్రెస్ పార్టీలో చేరింది. గత హర్యాని అసెంబ్లీ ఎన్నికల్లో జులానా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచింది. ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వినేశ్.. ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఆనౌన్స్ చేసింది.

Chandu Shanigarapu

eMail
Whats_app_banner

సంబంధిత కథనం


Best Web Hosting Provider In India 2024


Source link