Best Web Hosting Provider In India 2024

విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మీ
విజయవాడ నగరంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
విజయవాడ: పదవులు, పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించి సామాన్య మహిళలను రాజకీయాల్లో నాయకురాళ్లుగా నలుగురినీ నడిపించేందుకు పదవులిచ్చి పెద్దపీట వేసి ప్రోత్సహించిన ఘనత వైయస్ జగన్ మోహన్ రెడ్డిదే అని విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మీ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ సూచనల మేరకు విజయవాడలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు.
వేడుకలలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతూ శైలజ,జిల్లా మహిళ అధ్యక్షురాలు విజిత,స్టేట్ జనరల్ సెక్రటరీ స్వప్న,కార్పొరేటర్లు నిర్మలకుమారి,ప్రవల్లిక, రహేనా మహిళా నాయకులతో కలిసి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేకు కట్ చేసి జోహార్ వైయస్ఆర్, జై జగన్ అంటూ నినాదాలు చేస్తూ ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. వైయస్ఆర్సీపీ హయాంలో మహిళలందరూ ఎంతో ఆనందంగా ఉంటూ అన్ని రంగాల్లో ముందుకెళ్లే వారని తెలిపారు. మహిళలను ప్రోత్సహిస్తూ అనేక పథకాలు వైయస్ జగన్ అమలు చేశారని చెప్పారు. ప్రతి మహిళా లక్షాధికారి అవ్వాలి అనే వైయస్ఆర్ ఆశయాలను వైయస్ జగన్ ముందుకు తీసుకు వెళ్లారని తెలిపారు. మహిళలు విద్యావంతురాలు అవ్వాలని విద్యలో కూడా ముందుండాలనే లక్ష్యంతో పనిచేశారని చెప్పారు. మహిళలకు ఉన్నత పదవులు ఇస్తూ రాజకీయాలలో కూడా రాణించాలని అండగా ఉన్నారన్నారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు.
వైయస్ జగన్ మహిళా పక్షపాతి: డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ
వైయస్ జగన్ మహిళా పక్షపాతి అని డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ అన్నారు. వైయస్ఆర్సీపీ పాలనలో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి పదవులు ఇచ్చారని చెప్పారు. మహిళలు స్థిరపడటానకి ఎంతో సహాయం చేశారని గుర్తు చేశారు..
నేడు కూటమి ప్రభుత్వం మహిళలను నిర్లక్ష్యం చేస్తుందని చెప్పారు. కూటమి ప్రభుత్వం మహిళల్ని పట్టించుకోవటం లేదని రాబోయే రోజుల్లో వైయస్ జగన్ ను మళ్ళీ గెలిపించడానికి మహిళలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. వేడుకలలో భాగంగా పలు రంగాల్లో రాణించిన మహిళలకు శాలువాలు కప్పి సన్మానం చేశారు.