

Best Web Hosting Provider In India 2024

Face Mask Making at Home: ఇంట్లోనే ఫేస్ మాస్క్ తయారు చేసుకోవాలనుకుంటున్నారా.. ఈ 5 పాయింట్లు గుర్తుంచుకోండి!
Face Mask Making at Home: రాబోయే సమ్మర్ కోసం ఇంట్లో ఉండే ఫేస్ మాస్క్ తయారుచేసుకోవాలనుకుంటే ఇది తప్పక తెలుసుకోండి. మీకు సరిపోయే ఫేస్ మాస్క్ తో పాటు దాని తయారీకి కావాల్సిన కరెక్ట్ కాంబినేషన్స్ కూడా తెలిస్తేనే ఎఫెక్టివ్‌గా చేసుకోగలుగుతారు. మరింకెందుకు ఆలస్యం. పదండి.

మొఖంపై మచ్చలు, ముడతలు, చర్మంపై ఏ ఇతర సమస్యలున్నా ఫేస్ మాస్క్ అద్భుతమైన పరిష్కారం చూపిస్తుంది. కాకపోతే ఏది మంచిదో తెలుసుకోవడమే ముఖ్యం. చాలా వరకూ ఉపయోగకరంగా పనిచేసే ఫేస్ మాస్క్‌లన్నీ ఇంట్లో తయారుచేసుకున్నవే. ఫేస్ మాస్క్ అంటే అందుబాటులో ఉన్న ఏదో ఒక వస్తువుతో తయారుచేసుకునేది కాదు. మీ చర్మానికి సరిపోయేదిగా ఉండాలి. మీరు ఉపయోగించే ఫేస్ మాస్క్ మంచి ఫలితాలను కనబరిచేదిగా కూడా ఉండాలి.
ఉదాహరణకు, పసుపు, కలబంద, తేనె చర్మం మెరిసిపోయేలా చేయడానికి చాలా మంచివే. కానీ, పాలు, నిమ్మకాయ కలిపితే మాత్రం చర్మంపై ఇరిటేషన్ మొదలవుతుంది. ఇటువంటి పొరబాట్లు చేయకుండా ఫేస్ మాస్క్ చేసుకోవాలనుకుంటే ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి.
ఇంట్లో చేసిన ఫేస్ మాస్కులు మార్కెట్లో దొరికే వాటికంటే బెటరా?
ఇంట్లో తయారుచేసిన ఫేస్ మాస్క్ లు సేఫ్టీపరంగానే కాదు, ఆరోగ్యానికి కూడా మంచివట. నిల్వ ఉండేందుకు, సువాసన వచ్చేందుకు కలిపే కెమికల్స్ వల్ల ఆ మాస్క్ లలో ఒరిజినాలిటీ ఎక్కువగా ఉండదు. కానీ, ఇంట్లో తయారుచేసుకునే వాటిలో మొక్కల ఆకులను, సహజంగా తయారయ్యే పదార్థాలను కలపడం వల్ల ప్రమాదరహితంగా, అలర్జీ కలగకుండా సహజమైన కాంతిని అందిస్తాయి. వీటి వల్ల ముడతలు, మచ్చలు, డార్క్ సర్కిల్స్ వంటివి దూరమవుతాయి కూడా. పైగా మార్కెట్లో దొరికే ఫేస్ మాస్కులు చర్మానికి తగ్గట్టుగా ఉండవు. కొన్ని మాస్కులలో ఉండే సింథటిక్ సమ్మేళనాలు ప్రతి చర్మానికి సెట్ అవవు. అందుకే ఇంట్లో తయారుచేసుకునే ఫేస్ మాస్క్‌లే బెటర్ ఛాయీస్ అంటున్నారు నిపుణులు.
ఫేస్ మాస్క్ ఎలా తయారుచేయాలి?
మీ ఫేస్ మాస్క్ సురక్షితంగా, ప్రభావవంతంగా పనిచేయాలంటే ఒక విషయం తప్పక తెలుసుకోవాలి. అందులో ఏయే పదార్థాలు కలపాలి. అవి మీ చర్మానికి సరిపోతాయా అనేది అర్థం చేసుకోవాలి. ఇంకా ఫేస్ మాస్క్ చేసే సమయంలో ఈ 5 విషయాలు గుర్తుంచుకోవాలి.
ముఖానికి మాస్క్ ఎలా చేయాలో తెలుసుకోవడానికి కొన్ని ముఖ్యమైన విషయాలు:
చర్మం రకాన్ని బట్టి ఎంపిక:
మొదట, మీ చర్మం ఎలాంటిదో తెలుసుకోవాలి. చర్మం తీరును బట్టి ఒక్కో పదార్థం ఒక్కోలా పనిచేస్తుంది. మొటిమలు ఉంటే చందనం, వేప, గులాబీ రేకులు, కందిపప్పు వాడొచ్చు. పొడి చర్మం ఉంటే కలబంద, అవకాడో లాంటివి మంచివి. వీటికి బదులుగా తప్పుగా వాడితే మాత్రం, చర్మంపై మంట, పొడిబారడం లేదా మొటిమలు రావడం వంటి సమస్యలు అధికమవుతాయి.
పిహెచ్ బ్యాలెన్స్:
పిహెచ్ బ్యాలెన్స్ కూడా ముఖ్యం. నిమ్మకాయ, టొమాటో లాంటివి ఎక్కువ యాసిడ్ క్వాలిటీని కలిగి ఉంటాయి. దాని వల్ల చర్మం సున్నితంగా మారుతుంది, ఎర్రగా అవుతుంది. కొందరికి పసుపు, కర్పూరం లాంటి వాటి వల్ల దురద లేదా మంట రావచ్చు.
పదార్థాల కలయిక:
పదార్థాలు ఒకదానితో మరొకటి కలిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాలి. విటమిన్ సి ఉన్న నిమ్మకాయ లేదా నారింజ తొక్క గాలి తగిలినా లేదా వేరే పదార్థాలతో కలిపినా వాటి శక్తి తగ్గిపోతుంది.
ఉదాహరణకు, వాల్‌నట్ పొడితో వేప ఉత్పత్తులు కలిపితే చర్మం బాగా మండుతుంది.
కలపకూడని పదార్థాలు:
కొన్ని పదార్థాల కాంబినేషన్ ప్రమాదకరంగా మారుతుంది. నిమ్మకాయ, బేకింగ్ సోడా కలిపితే చర్మంపై మంట వస్తుంది. వెనిగర్, బేకింగ్ సోడా కూడా కలపకూడదు. నిమ్మకాయ, పసుపు ఎక్కువ కలిపితే చర్మంపై మచ్చలు ఏర్పడతాయి. పాలు, నిమ్మకాయ కలిపితే విరిగిపోతాయి. హైడ్రోజన్ పెరాక్సైడ్, వెనిగర్ కలిపితే ప్రమాదకరమైన యాసిడ్ గా మారుతుంది. ఇది ప్రమాదకరం.
కలిపితే మంచి ఫలితాలు ఇచ్చే పదార్థాలు:
- పసుపు, కలబంద, తేనె కలిపితే చర్మం మెరుస్తుంది. మచ్చలు తగ్గుతాయి, తేమ అందుతుంది.
- నిమ్మకాయ, పెరుగు, తేనె కలిపితే చర్మం శుభ్రపడుతుంది. రంగు సమానంగా అవుతుంది.
- ఆయిలీ స్కిన్ లేదా మొటిమలు ఉన్నవాళ్ళు వేప, చందనం, గులాబీ నీరు కలిపి వాడొచ్చు.
- మొటిమలు ఉంటే ముల్తానీ మట్టి, నారింజ తొక్క పొడి, గ్రీన్ టీ వాడొచ్చు.
- పొడి చర్మం ఉంటే అవకాడో, బాదం నూనె, దోసకాయ వాడొచ్చు.
- పాలు, ఓట్స్, గులాబీ రేకులు కలిపితే చర్మం మంట తగ్గుతుంది. మృదువుగా అవుతుంది.
- బొప్పాయి, తేనె, నిమ్మకాయ కలిపితే వయసు మీద పడిన లక్షణాలు కనిపించవు.
- కుంకుమపువ్వు, పాలు, కలబంద కలిపితే చర్మం మెరుస్తుంది.
సంబంధిత కథనం