




Best Web Hosting Provider In India 2024

Romantic OTT: ఆరు నెలల తర్వాత మరో ఓటీటీలోకి వచ్చిన తెలుగు రొమాంటిక్ లవ్ డ్రామా మూవీ – రెజీనా హీరోయిన్
Romantic OTT: రెజీనా హీరోయిన్‌గా నటించిన తెలుగు మూవీ ఉత్సవం మరో ఓటీటీలోకి వచ్చింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీ శుక్రవారం సన్ నెక్స్ట్ ఓటీటీలో రిలీజైంది. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో దిలీప్ ప్రకాష్ హీరోగా నటించాడు.

Romantic OTT: రెజీనా హీరోయిన్‌గా నటించిన తెలుగు మూవీ ఉత్సవం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ ఫ్యామిలీ డ్రామా మూవీ మరో ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం సన్ నెక్స్ట్ ఓటీటీలో ఈ సినిమా విడుదలైంది. ఉత్సవం సినిమాలో దిలీప్ ప్రకాష్ హీరోగా నటించాడు.
ప్రకాష్‌రాజ్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, నాజర్ కీలక పాత్రల్లో నటించారు. అర్జున్ సాయి దర్శకత్వం వహించాడు.
నాటక రంగ కళతో…
గత ఏడాది సెప్టెంబర్‌లో ఉత్సవం మూవీ థియేటర్లలో రిలీజైంది. అంతరించిపోతున్న నాటక రంగ కళను బతికించాలనే కాన్సెప్ట్‌కు లవ్‌స్టోరీని జోడించి దర్శకుడు అర్జున్ సాయి ఈ మూవీని తెరకెక్కించాడు.మంచి సినిమాగాగా పేరొచ్చిన ఉత్సవం కమర్షియల్‌గా మాత్రం ఆశించిన విజయాన్ని దక్కించుకోలేకపోయింది.
పెళ్లికి ముందు లేచిపోతే…
అభిమన్యు నారాయణ (ప్రకాష్ రాజ్) రంగస్థల కళాకారుడిగా గొప్ప పేరుప్రఖ్యాతులు సంపాదించుకుంటాడు.కొడుకు కృష్ణ (దిలీప్ ప్రకాష్) తనలా నాటకాల్లోకి రాకుండా మంచి జాబ్ చేయాలని అభిమన్యు నారాయణ కలలు కంటుంటాడు ఇంజినీరింగ్ పూర్తిచేసిన కృష్ణ ఎలాంటి ఉద్యోగ ప్రయత్నాలు చేయకుండా నాటక రంగ కళను బతికించేందుకు ప్రయత్నాలు చేస్తుంటాడు. .మరో రంగస్థలకారుడు మహాదేవనాయుడు (నాజర్) కూతురు రమతో (రెజీనా) కృష్ణ పెళ్లిని ఫిక్సవుతుంది పెళ్లికి కొద్ది గంటల ముందు రమ, కృష్ణ మిస్సవుతారు.
పెళ్లి కుదరడానికి ముందే ఒకరినొకరు ప్రాణంగా ఇష్టపడ్డ కృష్ణ, రమ ఎలా విడిపోయారు? ప్రేమ జంట మధ్య మనస్పర్థలకు కారణమేమిటి? తమకు పెద్దలు పెళ్లి కుదిర్చిన విషయం కృష్ణ, రమలకు ఎలా తెలిసింది? ఈ యువజంట ప్రేమకథ ఎలా సుఖాంతమైంది అన్నదే ఉత్సవం మూవీ కథ.
రీఎంట్రీ…
ఉత్సవం మూవీకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించాడు. లాంగ్ గ్యాప్ తర్వాత ఉత్సవం మూవీతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది రెజీనా. కానీ ఆమెకు హిట్టు మాత్రం దక్కలేదు.
తెలుగులో ఒకప్పుడు గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది రెజీనా. కొత్త జంట, పవర్, పిల్లా నువ్వు లేని జీవితం, జ్యో అచ్యుతానంద, అ! తో పాటు పలు సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసింది. పరాజయాల కారణంగా టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. అజిత్ హీరోగా నటించిన విదాముయార్చిలో ఓ కీలక పాత్రలో కనిపించింది. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో జాట్, సెక్షన్ 108 సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తోంది. నయనతార మూకుతి అమ్మన్2లో నటిస్తోంది రెజీనా.
సంబంధిత కథనం