Rekhachithram Review: 6 కోట్ల‌తో తీస్తే అర‌వై కోట్లు వ‌చ్చాయి – మ‌ల‌యాళం మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ ఎలా ఉందంటే?

Best Web Hosting Provider In India 2024

Rekhachithram Review: 6 కోట్ల‌తో తీస్తే అర‌వై కోట్లు వ‌చ్చాయి – మ‌ల‌యాళం మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ ఎలా ఉందంటే?

Nelki Naresh HT Telugu
Published Mar 08, 2025 02:20 PM IST

Rekhachithram Review: మ‌ల‌యాళం బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ రేఖ‌చిత్రం సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీలో ఆసిఫ్ అలీ, అన‌స్వ‌ర రాజ‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

రేఖ‌చిత్రం రివ్యూ
రేఖ‌చిత్రం రివ్యూ

Rekhachithram Review: మ‌ల‌యాళంలో ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌లో ఒక‌టిగా రేఖ‌చిత్రం నిలిచింది. కేవ‌లం ఆరు కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ అర‌వై కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాలో ఆసిఫ్ అలీ, అన‌స్వ‌ర రాజ‌న్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. ఇటీవ‌లే సోనీ లివ్ ద్వారా ఓటీటీ ప్రేక్ష‌కుల‌ ముందుకొచ్చిన ఈ మూవీ ఎలా ఉందంటే?

జూనియ‌ర్ ఆర్టిస్ట్ మ‌ర్డ‌ర్‌…

వివేక్ (ఆసిఫ్ అలీ) ఓ పోలీస్ ఆఫీస‌ర్‌. డ్యూటీలో ఉండ‌గా ఆన్‌లైన్ ర‌మ్మీ ఆడుతూ దొరికిపోయి స‌స్పెండ్ అవుతాడు. స‌స్పెన్ష‌న్ ముగిసిన త‌ర్వాత మ‌ల‌క్కాప‌ర అనే ఏరియాలో అత‌డికి పోస్టింగ్ వ‌స్తుంది. డ్యూటీలో జాయిన్ అయిన తొలిరోజే వివేక్‌కు ఓ ఛాలెంజింగ్ కేసు ఎదుర‌వుతుంది. రాజేంద్ర అనే వ్య‌క్తి మ‌ల‌క్కాప‌ర అట‌వీ ప్రాంతంలో గ‌న్‌తో కాల్చుకొని చ‌నిపోతాడు.

తాను చ‌నిపోయిన ప్ర‌దేశంలోనే చాలా ఏళ్ల క్రితం మ‌రికొంద‌రితో క‌లిసి ఓ అమ్మాయిని చంపి పూడ్చిపెట్టిన‌ట్లు ఫేస్‌బుక్ లైవ్‌లో చెప్పి రాజేంద్ర ఆత్మ‌హ‌త్య చేసుకుంటాడు. రాజేంద్ర‌ చెప్పిన పేర్ల‌లో విన్సెట్ (మ‌నోజ్ కే జ‌య‌న్‌) అనే పెద్ద బిజినెస్‌మెన్ ఉంటాడు. దాంతో ఈ కేసు రాష్ట్ర‌వ్యాప్తంగా సంచ‌న‌లంగా మారుతుంది. చ‌నిపోయిన అమ్మాయి జూనియ‌ర్ ఆర్టిస్ట్‌ రేఖ (అన‌స్వ‌ర రాజ‌న్‌) అనే నిజం వివేక్ ఇన్వేస్టిగేష‌న్‌లో బ‌య‌ట‌ప‌డుతుంది.

మ‌మ్ముట్టి సినిమా షూటింగ్‌లో పాల్గొన‌డానికి వ‌చ్చిన ఆ అమ్మాయి అనుకోకుండా మిస్స‌వుతుంది. మ‌రోవైపు రేఖ మ‌ర్డ‌ర్ కేసుకు సంబంధించి వివేక్ క‌లిసిన సాక్షులు కూడా ఒక్కొక్క‌రు దారుణంగా హ‌త్య‌ల‌కు గుర‌వుతుంటారు. ఈ కేసు మిస్ట‌రీని వివేక్ ఎలా సాల్వ్ చేశాడు? రేఖ చావుకు కార‌ణం ఏమిటి? విన్సెంట్‌కు రేఖ హ‌త్య‌కు ఎలాంటి సంబంధం ఉంది? పుష్పం ఎవ‌రు? రేఖ కుటుంబం గురించి వివేక్‌కు ఎలాంటి నిజాలు తెలిశాయి అన్న‌దే రేఖ చిత్రం క‌థ‌.

విల‌న్ ఎవ‌ర‌న్న‌ది…

రేఖ చిత్రం మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ క‌థాంశంతో తెర‌కెక్కిన థ్రిల్ల‌ర్ మూవీ. సాధార‌ణంగా ఇలాంటి థ్రిల్ల‌ర్ సినిమాల్లో విల‌న్ ఎవ‌ర‌న్న‌ది చివ‌ర‌లో రివీల్ చేసి ఆడియెన్స్‌ను స‌ర్‌ప్రైజ్ చేస్తుంటారు డైరెక్ట‌ర్స్‌. కానీ రేఖ‌చిత్రంలో మాత్రం విల‌న్ ఎవ‌ర‌న్న‌ది సినిమా ప్రారంభమైన ప‌దిహేను నిమిషాల‌కే తెలిసిపోతుంది. అత‌డిని హీరో ఎలా ప‌ట్టుకుంటాడ‌న్న‌ది ప్రారంభం నుంచి చివ‌రి వ‌ర‌కు ఉత్కంఠ‌భ‌రితంగా చూపించాడు డైరెక్ట‌ర్‌.

సినిమా బ్యాక్‌డ్రాప్‌లో…

సినిమా బ్యాక్‌డ్రాప్‌లో క‌థ సాగ‌డం ప్రేక్ష‌కుల‌కు కొత్త అనుభూతిని పంచుతుంది. స్టార్ హీరో సినిమాలో న‌టిస్తోన్న జూనియ‌ర్ ఆర్టిస్ట్ అనూహ్యంగా హ‌త్య‌కు గురువ్వ‌డం, ఆమె గురించి ఎలాంటి చిన్న క్లూ కూడా లేన‌ట్లుగా చూపించి ఆడియెన్స్‌లో నెక్స్ట్ ఏం జ‌రుగుతుందో అనే క్యూరియాసిటీని చివ‌రి వ‌ర‌కు క‌లిగించ‌డంలో ద‌ర్శ‌కుడు స‌క్సెస్ అయ్యాడు. ఓ వైపు సినిమా షూటింగ్‌…మ‌రోవైపు వివేక్ ఇన్వేస్టిగేష‌న్‌తో సినిమా ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది.

మైండ్ గేమ్‌…

ఒక్కో ఆధారాన్ని వివేక్ సేక‌రించ‌డం, వాటిని విన్సెట్‌ మాయం చేయ‌డం ఇలా మైండ్ గేమ్‌తో స్క్రీన్‌ప్లేను రాసుకున్నారు. క్లైమాక్స్‌లో పుష్పం పాత్ర‌కు సంబంధించి రివీల‌య్యే ట్విస్ట్ మాత్రం అదిరిపోతుంది. విల‌న్ విష‌యంలో ద‌ర్శ‌కుడు వేసిన ఎత్తు బాగా వ‌ర్క‌వుట్ అయ్యింది.

క‌మ‌ర్షియ‌ల్ హంగులు లేకుండా…

ఓ సినిమాలా కాకుండా క్రైమ్ ఇన్వేస్టిగేష‌న్‌ను ప్ర‌త‌క్ష్యంగా చూసిన ఫీలింగ్‌ను క‌లిగిస్తుంది. క‌థ‌ను ప‌క్క‌దారి ప‌ట్టించే యాక్ష‌న్ సీన్స్‌, కామెడీ ట్రాక్‌లు, డ్యూయెట్లు సినిమాలో క‌నిపించ‌వు. ఆరంభంలో చ‌నిపోయిన అమ్మాయి ఎవ‌రు అన్న‌ది వివేక్ అండ్ టీమ్ తెలుసుకునే సీన్లు నెమ్మ‌దిగా సాగుతూ ఓపిక‌కు ప‌రీక్ష పెడ‌తాయి. రేఖ ఎవ‌ర‌న్న‌ది రివీలైన త‌ర్వాతే క‌థ‌లో వేగం పెరుగుతుంది.

సెటిల్డ్ యాక్టింగ్‌…

హీరోయిజం, ఎలివేష‌న్లు లాంటి క‌మ‌ర్షియ‌ల్ హంగులు లేకుండా సెటిల్డ్ యాక్టింగ్‌తో ఆసిఫ్ అలీ మెప్పించాడు. చాలా నాచుర‌ల్‌గా అత‌డి పాత్ర సాగుతుంది. రేఖ పాత్ర‌లో అన‌స్వ‌ర రాజ‌న్ మెప్పించింది. మ‌మ్ముట్టి అభిమాని పాత్ర‌లో ఆక‌ట్టుకుంటుంది. మ‌నోజ్ కే జ‌య‌న్ విల‌నిజం పండించిన తీరు కొత్త‌గా అనిపిస్తుంది. మ‌మ్ముట్టి గెస్ట్ పాత్ర‌లో సినిమాలో క‌నిపించాడు. ఏఐ ద్వారా ఆయ‌న క్యారెక్ట‌ర్‌ను క్రియేట్ చేశారు.

మిస్ కాకుండా చూడాల్సిన మూవీ…

క్రైమ్ ఇన్వేస్టిగేష‌న్ మూవీస్‌, మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ సినిమాల‌ను ఇష్ట‌ప‌డే ఆడియెన్స్ మిస్ కాకుండా చూడాల్సిన మూవీ ఇది. మంచి థ్రిల్ల‌ర్ సినిమా చూసిన ఫీలింగ్‌ను క‌లిగిస్తుంది.

Nelki Naresh

TwittereMail
నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.
Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024