




Best Web Hosting Provider In India 2024

AP P4 Survey : ఏపీలో నేటి నుంచి పీ4 సర్వే రెండో విడత- ఏ ప్రశ్నలు అడుగుతున్నారంటే?
AP P4 Survey : ఏపీ ప్రభుత్వం ఉగాది నుంచి పీ4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఇందులో భాగంగా పీ4 సర్వేను నిర్వహిస్తోంది. గత నెలలో తొలివిడత సర్వే చేపట్టారు. నేటి నుంచి పీ4 సర్వే రెండో విడత చేపట్టనున్నారు.

ఏపీలో నేటి నుంచి పీ4 సర్వే రెండో విడత- ఏ ప్రశ్నలు అడుగుతున్నారంటే?
AP P4 Survey : రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా, ప్రతి ఇంట్లో ‘ఆరోగ్యం, ఆదాయం, ఆనందం’ ఉండాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు పీ4 సర్వేకు సంకల్పించారు. ప్రజల మధ్య ఆర్థిక అసమానతలను తొలగించి జీవన ప్రమాణాలు మెరుగుపరచాలని పబ్లిక్, ప్రైవేట్, పీపుల్, పార్టనర్‌షిప్(పీ4) సర్వేకు శ్రీకారం చుట్టారు.
నేటి నుంచి పీ4 సర్వే 2వ విడత ప్రారంభం అయ్యింది. సచివాలయ ఉద్యోగులు వారం రోజులు పాటు గ్రామాల్లో సర్వే చేయనున్నారు. ఇప్పటికే సర్వేలో వివరాలు సమర్పించిన కుటుంబాల జాబితా వివరాలను గ్రామసభలో ప్రచురించారు. గ్రామ ప్రజలందరూ పీ4 సర్వే నమోదు చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
నేటి నుంచి పీ4 సర్వే 2వ విడత
- పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం అమలు చేయనున్న పీ4 కార్యక్రమం కోసం మార్చి 8 నుంచి 18 వరకు చేపట్టనున్న సర్వే ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభం అయ్యింది.
- రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్, ప్రైవేటు, పీపుల్ భాగస్వామ్యం (పీ4)తో ఉగాది నుంచి ఈ కార్యక్రమం చేపట్టనుంది.
- కుటుంబ వివరాలు, సామాజిక ఆర్థిక స్థితిగతులకు సంబంధించి మొత్తం 27 ప్రశ్నల ద్వారా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు సమాచారం సేకరించనున్నారు.
- సర్వే పూర్తయ్యాక ఈనెల 21వ తేదీన సమాచార జాబితాను గ్రామ సభల్లో ప్రదర్శించనున్నారు.
- ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం పీ4 సర్వేకు శ్రీకారం చుట్టింది.
పీ4 సర్వేలో ఏ సమాచారం సేకరిస్తున్నారంటే?
- ఇంటి యాజమాని పేరు
- కుటుంబ సభ్యుల వివరాలు
- ఇంట్లో సంపాదన పరులు ఎంతమంది
- ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా?
- ఇల్లు ఏ రకం
- బ్యాంకు ఖాతా వివరాలు
- పట్టణాల్లో స్థలం ఉందా?
- ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలు ఉన్నాయా?
- రక్షిత తాగునీరు సరఫరా అవుతుందా?
- ఇంట్లో గృహాపకరణాల సమాచారం
- వంట గ్యాస్ వినియోగిస్తున్నారా?
- నెలకు కరెంటు బిల్లు ఎంత వస్తుంది?
- గత రెండేళ్లలో ఆదాయపు పన్ను చెల్లించారా?
ఈ విధంగా మొత్తం 27 ప్రశ్నలతో యాప్ రూపొందించారు.
టాపిక్
Andhra Pradesh NewsTrending ApTelugu NewsAp Govt
మరిన్ని ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.