




Best Web Hosting Provider In India 2024

OTT Telugu Movies: ఒకటి 23 నెలలకు.. మరొకటి 9 నెలలకు.. ఓటీటీలోకి ఆలస్యంగా రెండు తెలుగు సినిమాలు
OTT Telugu Movies: రెండు తెలుగు చిత్రాలు ఓటీటీలోకి వచ్చేందుకు బాగా ఆలస్యమయ్యాయి. అసలు స్ట్రీమింగ్‍కు వస్తాయా అనే అనుమానాలు రేగాయి. అయితే, ఎట్టకేలకు ఒకే నెలలో ఆ రెండు చిత్రాలు ఓటీటీలోకి అడుగుపెట్టేస్తున్నాయి. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

సాధారణంగా ఎక్కువ శాతం తెలుగు చిత్రాలు ఇటీవలి కాలంలో థియేటర్లలో రిలీజైన సుమారు నెలకే ఓటీటీల్లోకి వస్తున్నాయి. కొన్ని సినిమాలు మాత్రం రెండు నెలలకో.. మూడు నెలలకో స్ట్రీమింగ్‍కు అడుగుపెడుతున్నాయి. అయితే, తెలుగులో రెండు పాపులర్ చిత్రాలు.. స్ట్రీమింగ్ హక్కులు అమ్ముడైనా ఓటీటీలోకి వస్తాయా లేదా అనే సస్పెన్స్ రేపాయి. ఆ రెండు డిజాస్టర్ చిత్రాలే. కానీ ఆలస్యం అవుతుండటంతో ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో క్యూరియాసిటినీ పెంచాయి. అవే ‘ఏజెంట్’, ‘మనమే’ చిత్రాలు. ఈ రెండు చిత్రాలు ఇదే నెలలో స్ట్రీమింగ్ ఫిక్స్ చేసుకున్నాయి. మనమే ఇప్పటికే స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఏజెంట్ డేట్ ఖరారైంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
ఏజెంట్.. దాదాపు 23 నెలలకు..
అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ చిత్రం 2023 ఏప్రిల్ 28వ తేదీన థియేటర్లలో రిలీజైంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ భారీ డిజాస్టర్ అయింది. రూ.85 కోట్ల బడ్జెట్‍తో రూపొందించిన ఈ చిత్రం కనీసం రూ.9కోట్ల గ్రాస్ కలెక్షన్లు కూడా దక్కించుకోలేక అల్ట్రా ప్లాఫ్ అయింది. అఖిల్‍కు భారీ పరాజయం ఎదురైంది. ఓటీటీ స్ట్రీమింగ్ కూడా ఆలస్యమవుతూ వచ్చింది.
ఏజెంట్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సోనీ లివ్ సొంతం చేసుకుంది. 2023 సెప్టెంబర్‌లోనే స్ట్రీమింగ్‍కు వస్తుందని వెల్లడించింది. అయితే స్ట్రీమింగ్‍కు రాలేదు. అప్పటి నుంచి ఎన్నో రూమర్లు వచ్చాయి. కానీ ఈ మూవీ మాత్రం ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వలేదు.
అయితే, ఎట్టకేలకు థియేటర్లలో రిలీజైన దాదాపు 23 నెలలకు ఏజెంట్ చిత్రం సోనీలివ్ ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు రానుంది. ఈనెల మార్చి 14వ తేదీన ఏజెంట్ మూవీని స్ట్రీమింగ్‍కు తీసుకురానున్నట్టు సోనీ లివ్ వెల్లడించింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్‍కు తీసుకురానున్నట్టు ప్రకటించింది. ఏజెంట్ చిత్రంలో మలయాళ స్టార్ మమ్ముట్టి ఓ కీలకపాత్ర పోషించారు. అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్‍గా చేశారు. మార్చి 14 నుంచి ఈ మూవీని సోనీ లివ్‍లో చూడొచ్చు. మరి స్ట్రీమింగ్ తర్వాత ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
మనమే.. సరిగ్గా 9 నెలలకు..
శర్వానంద్, కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన మనమే చిత్రం 2024 జూన్ 7వ తేదీన థియేటర్లలో రిలీజైంది. మంచి అంచనాలతో వచ్చిన ఈ రొమాంటిక్ కామెడీ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం దక్కించుకోలేకపోయింది. ప్లాఫ్‍గా నిలిచింది. ఈ మూవీకి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు.
మనమే చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ కూడా బాగా ఆలస్యమైంది. ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను తీసుకున్న అమెజాన్ ప్రైమ్ వీడియో తాత్సారం చేస్తూ వచ్చింది. అయితే, ఎట్టకేలకు ఈ శుక్రవారం (మార్చి 7) ఈ మూవీ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు వచ్చింది. థియేటర్లలో రిలీజైన సరిగ్గా 9 నెలలకు మనమే చిత్రం స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చింది.
మనమే చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, రామ్సే స్టూడియోస్ పతాకాలు సంయుక్తంగా నిర్మించగా.. హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించారు. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య కుమారుడు మాస్టర్ విక్రమాదిత్య కూడా ఈ చిత్రంలో కీలకపాత్ర పోషించారు.
సంబంధిత కథనం