Best Web Hosting Provider In India 2024

తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో కేక్ కట్ చేసిన మాజీ మంత్రి ఆర్కే రోజా
జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో సంబరాలు చేసుకున్న మహిళలు
వైయస్ జగన్ పాలనను గుర్తుకు తెచ్చుకున్న వనితలు
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మంత్రి ఆర్కే రోజా, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి పాల్గొని మహిళా నాయకురాళ్లతో కలిసి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేకు కట్ చేసి జోహార్ వైయస్ఆర్, జై జగన్ అంటూ నినాదాలు చేస్తూ ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలియజేశారు. విజయవాడ నగరంలో మల్లాది విష్ణు, దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో మేయర్ రాయన భాగ్యలక్ష్మి, రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరే శ్యామల పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రాల్లో మాజీ మంత్రి కేవీ ఉషాశ్రీ చరణ్, అనంత వెంకట్రామిరెడ్డి పాల్గొని మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. అన్ని జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ సంక్షేమ పాలనను గుర్తు చేసుకున్నారు. నాడు మహిళలక పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏకంగా చట్టం చేసినట్లు మహిళలు గుర్తు చేసుకున్నారు. మళ్లీ అలాంటి పాలనను తెచ్చుకుందామని, మహిళలు మేల్కొని కూటమి అరాచక పాలనకు వ్యతిరేకంగా నడుం బిగించాలని మహిళా నాయకురాళ్లు పిలుపునిచ్చారు.