


Best Web Hosting Provider In India 2024

Vishwak Sen: ఏడాది కిత్రం ఇదే రోజు విశ్వక్‍పై ప్రశంసల వర్షం.. ఇప్పుడంతా రివర్స్!
Vishwak Sen: గామి సినిమా రిలీజై నేటితో సరిగ్గా సంవత్సరం అయింది. ఈ ప్రయోగాత్మక చిత్రం కమర్షియల్‍గా హిట్ అయింది. పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది.

నటీనటుల కెరీర్లో ఒడిదొడుకులు సహజమే. ప్రశంసలు, విమర్శలు వస్తూనే ఉంటాయి. అయితే, తక్కువ వ్యవధిలోనే ఈ రెండు ఎక్కువగా ఎదురైనప్పుడు కాస్త ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. యంగ్ హీరో విశ్వక్ సేన్ విషయంలోనూ ఇదే జరిగింది. విశ్వక్ హీరోగా నటించిన గామి చిత్రం సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు (మార్చి 8, 2024) థియేటర్లలో రిలీజైంది. అయితే, అప్పటికి.. ఇప్పటికి విశ్వక్ పరిస్థితి పూర్తి రివర్స్‌లో ఉంది.
భారీగా ప్రశంసలు
గామి చిత్రం రిలీజైన రోజు విశ్వక్‍సేన్‍పై ప్రశంసల వర్షం కురిసింది. ప్రేక్షకులతో పాటు విశ్లేషకులు కూడా అతడి పర్ఫార్మెన్స్‌ను పొగిడారు. మానవ స్పర్శతో తీవ్రమైన సమస్య ఉన్న శంకర్ అనే అఘోర పాత్రలో తన పర్ఫార్మెన్సుతో విశ్వక్ మెప్పించారు. తన అరుదైన సమస్యను పరిష్కరించుకునేందుకు సవాళ్లను అధిగమిస్తూ హిమాలయాల్లో కఠినమైన ప్రయత్నంలో అతడి నటన ఆకట్టుకుంది. ఎమోషనల్ సీన్లలోనే ఇంటెన్సీతో ప్రశంసలు పొందారు. విశ్వక్ నటనలోని మరో మరో కోణాన్ని ప్రపంచానికి చూపింది గామి. అతడి కెరీర్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ అని కూడా కామెంట్లు వచ్చాయి.
గామి చిత్రానికి విద్యాధర్ కాగిత దర్శకత్వం వహించారు. సుమారు ఆరేళ్ల పాటు ఈ చిత్రం కోసం పని చేశారు. ఎన్నో సవాళ్లను దాటుకొని ఈ మూవీ తెరెకెక్కింది. సుమారు రూ.6కోట్ల బడ్జెట్‍తో రూపొందిన ఈ మూవీ రూ.22కోట్లను దక్కించుకొని కమర్షియల్‍గానూ సక్సెస్ సాధించింది. ముఖ్యంగా ఈ చిత్రంతో విశ్వక్‍తో పాటు డైరెక్టర్ విద్యాధర్‌కు భారీగా ప్రశంసలు దక్కాయి.
ఇప్పుడు.. విశ్వక్‍పై విమర్శలు
గామి తర్వాత విశ్వక్‍సేన్‍కు వరుసగా పరాజయాలు ఎదురయ్యాయి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకీ, లైలా ఇలా మూడు ప్లాఫ్‍లు పడ్డాయి. కమర్షియల్ పరాజయాల కంటే అతడి స్టోరీ సెలెక్షన్‍పై కూడా అసంతృప్తి వ్యక్తమైంది. లైలా చిత్రంతో విశ్వక్‍పై అన్ని విధాలుగా విమర్శలు భారీగా వచ్చాయి. ఈ చిత్రం డిజాస్టర్ అవడంతో పాటు అతడి కెరీర్లో ఓ మచ్చగా మిగిలిపోయింది. ఈ మూవీలో లేడీ గెటప్ వేశారు విశ్వక్. అయితే, అసభ్యత, డబుల్ మీనింగ్ డైలాగ్‍లతో ఈ కామెడీ మూవీ తెరకెక్కింది. ఇది ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోగా.. చిరాకు తెప్పించింది. విశ్వక్ సేన్ క్షమాపణలు కూడా చెప్పేశారు.
గతేడాదిలోనే వచ్చిన గ్యాంగ్స్ ఆప్ గోదావరి చిత్రం హిట్ కాకపోయినా.. విశ్వక్ ఇంటెన్స్ యాక్షన్‍కు మంచి మార్కులే పడ్డాయి. మెకానిక్ రాకీ కథ రొటీన్ అయినా.. విశ్వక్ ఓకే అనిపించారు. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరి 14న రిలీజైన లైలా తీవ్రంగా నిరాశపరిచింది. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పూర్తి నెగెటివ్ టాక్ అందుకుంది. అసలు విశ్వక్ ఈ మూవీ ఎలా చేశాడన్న రేంజ్‍లో విమర్శలు వచ్చాయి.
ఇలా ఏడాది కిందట ప్రశంసలు దక్కించుకున్న విశ్వక్.. ఇప్పుడు తీవ్రమైన విమర్శలు ఎదుర్కొనే స్థితికి వచ్చారు. లైలా మూవీ ఎదురుదెబ్బగా మారింది. అయితే, టాలెంటెడ్ యాక్టర్ అయిన విశ్వక్.. మళ్లీ బౌన్స్ బ్యాక్ అవడం పెద్ద కష్టమేమీ కాదు. ప్రస్తుతం జాతిరత్నాలు ఫేమ్ డైరెక్టర్ అనుదీప్‍తో విశ్వక్.. ఫంకీ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం క్లీన్ కామెడీతో సక్సెస్ అయితే విశ్వక్ మళ్లీ ట్రాక్‍లో పడినట్టే. ఏం జరుగుతుందో చూడాలి.
సంబంధిత కథనం