


Best Web Hosting Provider In India 2024
World Junior Chess Champion Pranav: అప్పుడు గుకేశ్.. ఇప్పుడు ప్రణవ్.. భారత్ నుంచే మరో వరల్డ్ ఛాంపియన్.. ఎవరీ కుర్రాడు?
World Junior Chess Champion Pranav: ప్రపంచ చెస్ లో భారత ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. ప్రపంచ చెస్ ఛాంపియన్ గా గుకేశ్ నిలిచిన నాలుగు నెలల వ్యవధిలోనే భారత్ నుంచి మరో వరల్డ్ విన్నర్ వచ్చాడు. ప్రపంచ జూనియర్ చెస్ టైటిల్ ను దక్కించుకున్న ప్రణవ్ వెంకటేష్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాడు.

నాలుగు నెలల వ్యవధిలోనే భారత్ కు చెస్ లో మరో ప్రపంచ ఛాంపియన్ షిప్ టైటిల్ దక్కింది. గ్రాండ్ మాస్టర్ ప్రణవ్ వెంకటేష్ ప్రపంచ జూనియర్ చెస్ ఛాంపియన్ గా నిలిచాడు. మాంటెనెగ్రోలోని పెట్రోవాక్ లో జరిగిన టోర్నమెంట్ ఓపెన్ కేటగీరిలో ప్రణవ్ అదరగొట్టాడు. 11 రౌండ్ల నుంచి 9 పాయింట్లు సాధించి టైటిల్ ఖాతాలో వేసుకున్నాడు.
63 దేశాల నుంచి
ఈ ప్రపంచ జూనియర్ చెస్ టోర్నీ అండర్ -20 ఈవెంట్ లో 44 దేశాలకు చెందిన దాదాపు 230 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఓపెన్ విభాగంలో 63 దేశాలకు చెందిన 157 మంది క్రీడాకారులు పోటీపడ్డారు. ఇందులో 12 మంది గ్రాండ్ మాస్టర్లు కూడా ఉన్నారు. వీళ్లందరినీ దాటి ప్రణవ్ టైటిల్ సాధించడం సాధారణ విషయం కాదు. గతేడాది డిసెంబర్ లో గుకేశ్ ప్రపంచ సీనియర్ ఛాంపియన్ గా నిలిచి హిస్టరీ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.
నాలుగో ప్లేయర్ గా హిస్టరీ
ప్రపంచ జూనియర్ చెస్ ఛాంపియన్ గా నిలిచిన నాలుగో భారత ఆటగాడు ప్రణవ్. 1987లో విశ్వనాథన్ ఆనంద్, 2004లో పెంటేల హరిక్రిష్ణ, 2004లో అభిజీత్ గుప్తా ఈ టైటిల్ దక్కించుకున్నారు. ఇప్పుడు రెండు దశబ్దాల తర్వాత మరోసారి ఆ ట్రోఫీని ప్రణవ్ భారత్ కు తీసుకొచ్చాడు. 18 ఏళ్ల ప్రణవ్.. వెస్ట్ బ్రిడ్జ్ ఆనంద్ చెస్ అకాడమీలో దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ దగ్గర శిక్షణ పొందుతున్నాడు.
ప్రణవ్ పై విషీ ప్రశంసల వర్షం కురిపించారు. అతను నిరంతరంగా తన గేమ్ ను అనాలిసిస్ చేసుకుంటూనే ఉంటాడని ఆనంద్ తెలిపారు.
6 ఏళ్ల వయసులో
బెంగళూరులో పుట్టిన ప్రణవ్ ఆరేళ్ల వయసులో చెస్ ఆడటం మొదలెట్టాడు. క్రమంగా రాటుదేలాడు. ఎత్తులు వేయడంలో పట్టు సాధించాడు. 2021లో ఓ గ్రాండ్ మాస్టర్ (జీఎం) నార్మ్ సాధించాడు. 2022లో మరో జీఎం నార్మ్ అందుకున్నాడు. 2022లో మూడో జీఎం నార్మ్ తో గ్రాండ్ మాస్టర్ హోదా దక్కించుకున్నాడు. 75వ భారత గ్రాండ్ మాస్టర్ గా నిలిచాడు.
కార్ల్ సన్ ను ఓడించి
2022 లో ఓ వైపు అండర్-16 యూత్ ఒలింపియాడ్ ఆడుతూనే.. మరోవైపు మాగ్నస్ కార్ల్ సన్ అకాడమీ ఛాలెంజ్ లో పాల్గొన్నాడు. ఈ రెండింట్లోనూ విజేతగా నిలిచాడు. ఆన్ లైన్ టోర్నీలో ప్రపంచ నంబర్ వన్ కార్ల్ సన్ ను ప్రణవ్ ఓడించి సంచలనం క్రియేట్ చేశాడు. 2023 యూరోపియన్ చెస్ క్లబ్ కప్ గెలిచిన ఆఫర్ స్పిల్ చెస్ క్లబ్ లో ప్రణవ్ భాగం. గతేడాది వరల్డ్ యూత్ అండర్-18 వరల్డ్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ టోర్నీతో పాటు చెన్నై గ్రాండ్ మాస్టర్స్ ఛాలెంజర్ విభాగంలో ప్రణవ్ టైటిళ్లు గెలిచాడు.
సంబంధిత కథనం
టాపిక్
Best Web Hosting Provider In India 2024
Source link