



Best Web Hosting Provider In India 2024

Re-release: సరిగ్గా పదేళ్లకు మళ్లీ థియేటర్లలోకి నాని, విజయ్ దేవరకొండ చిత్రం.. రీ-రిలీజ్ ఎప్పుడంటే..
Yevade Subramanyam Re-release: ఎవడే సుబ్రమణ్యం చిత్రం మళ్లీ థియేటర్లలోకి వస్తోంది. సరిగ్గా 10 సంవత్సరాల తర్వాత మళ్లీ బిగ్‍స్క్రీన్‍పైకి రానుంది. ఈ చిత్రం రీ-రిలీజ్ డేట్ ఖరారైంది.

తెలుగులో రీ-రిలీజ్‍ల ట్రెండ్ జోరుగా సాగుతోంది. చాలా చిత్రాలు మళ్లీ థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. తాజాగా ఈ వారమే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ పన్నెండేళ్ల తర్వాత రీ-రిలీజ్ కాగా అదిరిపోయే రెస్పాన్స్ దక్కించుకుంటోంది. ఇప్పుడు మరో మూవీ రీ-రిలీజ్‍కు రెడీ అయింది. ‘ఎవడే సుబ్రమణ్యం’ చిత్రం మళ్లీ బిగ్‍స్క్రీన్ మీదకు వచ్చేస్తోంది. నేచురల్ స్టార్ నాని, విజయ్ దేవరకొండ కలిసి నటించిన ఈ సినిమా మళ్లీ థియేటర్లలోకి అడుగుపెడుతోంది. రీ-రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.
పదేళ్ల సందర్భంగా..
ఎవడే సుబ్రమణ్యం చిత్రం మార్చి 21వ తేదీన థియేటర్లలో రీ-రిలీజ్ కానుంది. తొలుత విడుదలైన సరిగ్గా పదేళ్ల తర్వాత మళ్లీ వెండితెరపైకి వచ్చేస్తోంది. ప్రశంసలతో పాటు కమర్షియల్‍గానూ హిట్ అయిన ఈ చిత్రాన్ని మళ్లీ థియేటర్లలో చూడొచ్చు. మార్చి 21న ఎవడే సుబ్రమణ్యం రీ-రిలీజ్ కానుందని వైజయంతీ మూవీస్ నేడు (మార్చి 8) వెల్లడించింది.
నాగ్ అశ్విన్ తొలి మూవీ
ఎవడే సుబ్రమణ్యం మూవీతో నాగ్అశ్విన్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. మంచి సబ్జెక్ట్, నరేషన్, లోతైన ఆలోచనలతో మూవీని తెరకెక్కించి ప్రశంసలు పొందారు. ఈ చిత్రంలో నాని, విజయ్ దేవరకొండ కలిసి నటించారు. పెళ్లిచూపులు మూవీ కంటే ముందే రిలీజైన ఈ చిత్రం విజయ్ దేవరకొండకు మంచి పేరు తీసుకొచ్చింది. నాగ్ అశ్విన్‍కు తొలి మూవీతోనే ఫేమ్ వచ్చింది. ఆ తర్వాత మహానటితో ప్రశంసలు పొందిన నాగ్.. గతేడాది కల్కి 2898 ఏడీ చిత్రంతో భారీ బ్లాక్‍బస్టర్ కొట్టడంతో పాటు పాన్ ఇండియా రేంజ్‍లో గుర్తింపు తెచ్చుకున్నారు.
ఎవడే సుబ్రమణ్యం గురించి..
ఎవడే సుబ్రమణ్యం చిత్రంలో సుబ్బు అలియాజ్ సుబ్రమణ్యం క్యారెక్టర్ చేశారు నాని. కెరీర్, డబ్బు అంటూ ఎప్పుడూ ఆరాటపడే యువకుడు.. ఓ ప్రయాణంలో తనను తాను ఎలా తెలుసుకున్నాడో, నిజమైన సంతోషమంటే ఎంటో ఎలా గుర్తించాడో అని చేసే జర్నీ చుట్టూ ఈ చిత్రం సాగుతుంది. సెల్ఫ్ డిస్కవరీ అనే అంశం ప్రధానంగా ఉంటుంది. ఈ మూవీలో రిషి పాత్ర చేశారు విజయ్ దేవరకొండ. ఈ చిత్రంలో మాళవిక నాయర్, రితూ వర్మ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం నవ్విస్తూనే.. చాలాచోట్ల ఎమోషనల్‍గా టచ్ చేస్తుంది. అలా లోతైన భావంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు నాగ్ అశ్విన్. ఈ మూవీలో లెజెండరీ యాక్టర్ కృష్ణంరాజు, సీనియర్ నటి షావుకారి జానకి కూడా నటించారు. నాజర్, రాజేశ్ వివేక్, శ్రీనివాస్ అవసరాల, పవిత్రా లోకేశ్, శివన్నారాయణ కీలకపాత్రలు పోషించారు.
కమర్షియల్‍గానూ హిట్
ఎవడే సుబ్రమణ్యం చిత్రం ప్రశంసలను దక్కించుకోవడంతో పాటు సూపర్ హిట్ అయింది. రూ.5కోట్లలోపు బడ్జెట్‍తో రూపొందించిన ఈ చిత్రం దాదాపు రూ.18కోట్ల కలెక్షన్లతో కమర్షియల్‍గా విజయం సాధించింది. ఈ చిత్రాన్ని స్వప్న సినిమాస్ పతాకంపై ప్రియాంక దత్, స్వప్న దత్ ప్రొడ్యూజ్ చేశారు. ఈ చిత్రానికి రధన్ సంగీతం అందించారు. రాకేశ్, నవీన్ యాదవ్ సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటింగ్ చేశారు.
సంబంధిత కథనం
టాపిక్