Girl Child Parenting: మీ కూతుర్ని ధైర్యంగా పెంచాలనుకుంటున్నారా? ఆమెకు ఏయే విషయాల్లో అవగాహన కల్పించాలో తెలుసుకోండి?

Best Web Hosting Provider In India 2024

Girl Child Parenting: మీ కూతుర్ని ధైర్యంగా పెంచాలనుకుంటున్నారా? ఆమెకు ఏయే విషయాల్లో అవగాహన కల్పించాలో తెలుసుకోండి?

Ramya Sri Marka HT Telugu
Published Mar 08, 2025 07:00 PM IST

Girl Child Safety: ప్రస్తుత సమాజానికి తగ్గట్లుగా మీ కూతుర్ని ధైర్యంగా పెంచాలనుకుంటున్నారా? వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించాలంటే వారికి కొన్ని విషయాలపై అవగాహాన కల్పించడం చాలా అవసరం. తల్లిదండ్రుగా మీరు మీ బాలికకు ఎలాంటి మార్గనిర్దేశం చేయాలో తెలుసుకోండి.

ఆడపిల్లను ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో పెంచాలంటే తల్లిదండ్రులు ఏం చేయాలి?
ఆడపిల్లను ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో పెంచాలంటే తల్లిదండ్రులు ఏం చేయాలి? (pixabay)

నేటి సమాజానికి తగ్గట్టుగా మీ ఇంట్లోని ఆడపిల్లలను తయారు చేయాలనుకుంటున్నారా? అయితే యుక్తవయస్సు రాకముందే అంటే చిన్ననాటి నుంచే అమ్మాయిల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం, వారికి ధైర్యాన్ని ఇవ్వడం తప్పనిసరి. ఏది సరైనది, ఏది తప్పు, ఏది అనుకరించకూడదు మొదలైన అనేక విషయాలపై తల్లిదండ్రులు అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం. పెద్దయ్యాక వారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడానికి సరైన మార్గదర్శకత్వం, ప్రోత్సాహం, అవకాశాలను అందించడంలో తల్లిదండ్రులు కీలక పాత్ర పోషిస్తారు. కాబట్టి యుక్తవయస్సుకు చేరుకునే ముందు మీరు బాలికలకు అవగాహన కల్పించాల్సిన విషయాలు ఏమిటి? మీ కూతుర్నీ మీరు ఏ మార్గంలో గైడ్ చేయాలో తెలుసుకోండి.

ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించండి

ఫలితాల కంటే కృషిని అభినందించండి. ప్రతి విషయాన్ని నిర్భయంగా మాట్లాడడానికి, అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి వారిని ప్రోత్సహించండి. వారి స్వంత నిర్ణయాలు తీసుకొని సమస్యలను పరిష్కరించేలా చేయండి. ఎదురుదెబ్బలు, ఓటములను ఎదుర్కోవడం వారికి నేర్పండి.

ఆరోగ్యకరమైన పరిమితులు తెలపండి

వ్యక్తిగత పరిమితులను అర్థం చేసుకోవడంలో వారికి సహాయపడండి. ధైర్యంగా ఉండేందుకు వారిని ప్రోత్సహించండి. ఇంటి వెలుపల, స్కూల్లో ఎలాంటి సమస్యలున్నా స్వేచ్ఛగా పంచుకునే వాతావరణాన్ని కల్పించండి. తరచుగా వారితో స్నేహపూర్వకంగా మెలుగుతూ అడుగుతూ ఉండండి.

శరీర మార్పుల గురించి మాట్లాడండి

ప్రైవేట్ భాగాలు, శరీర మార్పులను గురించి వివరించండి. పరిశుభ్రత లేదా వైద్య కారణాల వల్ల తప్ప వాటిని ఎవరూ తాకకూడదని వారికి చెప్పండి. సురక్షితమైన స్పర్శ (గుడ్ టచ్), అసురక్షిత స్పర్శ(బ్యాడ్ టచ్)ల గురించి వివరంగా వారితో మాట్లాడండి.

అపరిచితుల పట్ల అవగాహన

అపరిచితులందరూ చెడ్డవారు కాదు, కానీ అందరూ సురక్షితమైన వ్యక్తులు కాదని వారికి చెప్పండి. తల్లిదండ్రులతో చెప్పకుండా ఎవరితోనూ వెళ్లవద్దు. అత్యవసర పరిస్థితుల్లో నమ్మకమైన సభ్యులకు మాత్రమే తెలిసిన సురక్షితమైన పదాన్ని చెప్పండి. వివిధ సందర్భాల్లో ఎలా స్పందించాలో వారికి నేర్పండి.

ఇంటర్నెట్‌తో పాటు డిజిటల్ భద్రతా

గ్యాడ్జెట్ల వాడకంపై లిమిట్స్ సెట్ చేయండి. ఆన్‌లైన్ యాక్టివిటీని పర్యవేక్షిస్తూ ఉండండి. సోషల్ మీడియాలో అపరిచితులతో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని వారికి సూచించండి. ఏదైనా సమస్య ఉంటే, తల్లిదండ్రులకు ముందుగానే చెప్పాలని వారికి తెలియజేయండి.

నాయకత్వ లక్షణాలతో పాటు నిర్ణయం తీసుకునే నైపుణ్యాలను పెంపొందించండి

కుటుంబ నిర్ణయాల్లో వారిని నిమగ్నం చేయండి. స్కూలు లేదా కార్యకలాపాల్లో నాయకత్వం వహించడానికి వారికి సపోర్ట్‌‌‌‌గా ఉండండి. సమస్యా పరిష్కారం, సంప్రదింపుల నైపుణ్యాలను ప్రోత్సహించండి. ఏదైనా నిర్ణయాలు తీసుకోవడానికి ముందుకు రావడానికి లేదా వారి అభిప్రాయం చెప్పడానికి ప్రోత్సహించండి.

వారి ఇంటరస్ట్‌లతో పాటు టాలెంట్‌ను ఎంకరేజ్ చేయండి

పలు రకాలైన అభిరుచులు, క్రీడలు, నైపుణ్యాలను అన్వేషించండి. క్రియేటివిటీతో పాటు వారిలో కలిగే యాంగ్జైటీని ప్రోత్సహించండి. మంచి సెలక్షన్ చేయగలిగినప్పుడు ప్రశంసించండి. పాజిటివ్ బిహేవియర్‌ను ప్రోత్సహించండి.

సెల్ఫ్ లవ్ అండ్ పాజిటివిటీ నేర్పించండి

శరీరం లేదా లుక్ గురించి నెగెటివ్ కామెంట్స్ చేయడం మానుకోండి. ఒత్తిడి లేకుండా సమతుల్యమైన, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించండి. ఇతరులతో పోల్చకుండా వారి ప్రత్యేకతను ప్రశంసించండి. సరైన మార్గంలో వెళితే, మీరు గెలుస్తారని ప్రోత్సహించండి.

యుక్తవయస్సుకు ముందే ఆడపిల్లలకు సాధికారత అనేది తల్లిదండ్రులు ఇవ్వగల అమూల్యమైన బహుమతులలో ఒకటి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం, స్వాతంత్య్రాన్ని ప్రోత్సహించడం, ముఖ్యమైన జీవన నైపుణ్యాలను బోధించడం ద్వారా, బాలికలు బలమైన ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తులుగా ఎదగడానికి సహాయపడవచ్చు.

Ramya Sri Marka

eMail
మార్క రమ్యశ్రీ హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ లైఫ్‌స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు.జర్నలిజంలో ఎనిమిదేశ్లకు పైగా అనుభవం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. 2024 నవంబరులో హెచ్.టి తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024