



Best Web Hosting Provider In India 2024
ఒక్క మహిళ- 36మంది బాయ్‌ఫ్రెండ్స్! అందరి చేత ఇళ్లు కొనిపించి జంప్.. అసలేం జరిగింది?
చైనాకు చెందిన ఓ మహిళ 36మందిని డేట్ చేసి, పెళ్లి చేసుకుందామని చెప్పింది. కానీ, పెళ్లికి ముందు ఇల్లు కొనాలని కండీషన్ పెట్టింది. ఆమెను నమ్మి వారందరు ఇళ్లు కొన్నారు. చివరికి మోసపోయినట్టు తెలుసుకున్నారు.

చైనాలో జరిగిన ఒక షాకింగ్ ఘటన ఇప్పుడు వైరల్‌గా మారింది! ఓ మహిళ కొన్ని నెలల పాటు ఏకంగా 36మందిని డేట్ చేసింది. పెళ్లి చేసుకుందామని చెప్పి, వారి చేత ఇళ్లు కొనిపించింది. ఆ తర్వాత మాయమైపోయింది. వారిలో చాలా మంది ఇప్పుడు హోం లోన్లు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు! అసలేం జరిగిందంటే..
ఇదీ జరిగింది..
చైనాలోని షెన్హెన్ అనే ప్రాంతానికి చెందిన అటాఓ (పేరు మార్చడం జరిగింది).. ఆన్లైన్ డేటింగ్ యాప్‌లో గతేడాది మార్చ్‌లో లియు జియా అనే మహిళను కలిశాడు. తన వయస్సు 30ఏళ్లు అని, తాను హునన్ రాష్ట్రానికి చెందిన మహిళ అని, కానీ ఉద్యోగం రిత్యా షెన్హెన్లో పనిచేస్తున్నట్టు ఆ వ్యక్తికి చెప్పింది లియు జియా. కొన్ని రోజుల్లోనే వారిద్దరు ప్రేమలో పడ్డాడు. వారిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఇక్కడే అటాఓకి లియు ట్విస్ట్ ఇచ్చింది! పెళ్లి ప్రతిపాదనతో తన తల్లిదండ్రులను కలిసే ముందు మంచి ఇల్లు కొనాలని అటాఓకి లియు చెప్పింది. అవసరమైతే డౌన్‌పేమెంట్ కింద తాను 30,000 యువాన్ (రూ. 3.3లక్షలు) ఇస్తానని చెప్పి హుయిజౌ అనే ప్రాంతంలో ఇల్లు కొనాలని ప్రతిపాదించింది. సరిగ్గా ఆ సమయంలోనే అక్కడి డెవలపర్స్.. ఇళ్ల మీద 1,00,000 యువాన్ల (రూ. 11లక్షలు) సబ్సిడీ ఇస్తున్నట్టు ప్రకటించారు.
అది మంచి డీల్ అని అటాఓ అనుకున్నాడు. మరి లియు డబ్బులు ఇచ్చిందో, లేదో తెలియదు కానీ.. అటాఓ మాత్రం ఇల్లు కొన్నాడు. అంతే! ఇల్లు కొన్న తర్వాత లియు మాయమైపోయింది. అటాఓతో మాట్లాడటం కట్ చేసింది. అతడి నెంబర్ని బ్లాక్ చేసింది.
ఇంటి ఓనర్షిప్ సర్టిఫికెట్లో మాత్రం లియు తన పేరు రాకుండా చూసుకుంది.
36మంది బాధితులు..!
లియు బారిన పడిన వ్యక్తుల లిస్ట్ చాలా పెద్దదే! వాంగ్ అనే ఇంటి పేరు ఉన్న ఓ వ్యక్తి కూడా లియు గురించి చెప్పుకుని తన బాధను బయటపెట్టాడు.
“నేను ఇల్లు కొన్న తర్వాత లియు నాతో మాట్లాడటం మానేసింది. బిజీగా ఉన్నానని అంటూ, ఏదో ఒక కారణంతో నన్ను దూరం పెట్టింది. చివరికి నన్ను బ్లాక్ చేసింది,” అని వాంగ్ చెప్పుకొచ్చాడు.
ఇలా మొత్తం మీద 36మందిని లియు మోసం చేసిందని అటాఓ చెప్పాడు. బాధితుల వయస్సు 30ఏళ్ల కన్నా ఎక్కువ ఉంటుందని, వారందరు ఉద్యోగం రిత్యా షెన్హెన్లో పనిచేస్తున్నారని వెల్లడించాడు. లియు చేసిన పనికి తన మీద ఆర్థిక భారం విపరీతంగా పెరిగిపోయిందని, తనకు వస్తున్న జీతంలో నెలకు 4,100 యువాన్లు (సుమారు రూ. 50వేలు) హోం లోన్‌కే వెళ్లిపోతోందని అటాఓ చెప్పుకొచ్చాడు.
“ఇప్పుడు ఇక నేను జీవితంలో గర్ల్‌ఫ్రెండ్ కోసం చూడను,” అని అటాఓ అంటున్నాడు.
మరో విషయం ఏంటంటే.. ఈ 36మంది చేత హుయిజౌలోని రెండు రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లలో (జియు జింగ్ టాయ్, హఓ యూ షాంగ్ యున్) ఇళ్లు కొనిచ్చింది లియు.
సోషల్ మీడియాలో వైరల్..
లియు అనే మహిళ 36మందిని మోసం చేసి, వారి చేత ఇళ్లు కొనిపించిందన్న వార్త చైనా సోషల్ మీడియాలో ఇన్స్టెంట్గా వైరల్ అయ్యింది. చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తుంటే, ఇంకొందరు మాత్రం ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.
“లియుకి బెస్ట్ సేల్స్ పర్సన్ ఆఫ్ రియల్ ఎస్టేట్” అని బిరుదు ఇవ్వాలని నెటిజన్లు అంటున్నారు.
మరికొందరు మాత్రం, ముందు వెనుక చూడకుండా మహిళను నమ్మిన పురుషులును విమర్శిస్తున్నారు. జీవితంలో ఇంత అజాగ్రత్తగా ఎలా ఉంటారని నిందిస్తున్నారు.
మరి ఈ వ్యవహారంపై మీరేం అంటారు?
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link