Best Web Hosting Provider In India 2024
Holi Special Trains : రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్, విజయవాడ మీదుగా నాలుగు హోలీ ప్రత్యేక రైళ్లు
Holi Special Trains : హోలీ పండుగకు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వాల్తేర్ రైల్వే డివిజన్ ప్రత్యేక రైళ్లను నడపనుంది. నాలుగు ప్రత్యేక రైళ్లను విజయవాడ మీదుగా నడుపుతున్నట్లు ప్రకటించింది. భువనేశ్వర్-చర్లపల్లి-భువనేశ్వర్, విశాఖ-బెంగళూరు-విశాఖ మధ్య స్పెషల్ ట్రైన్స్ నడపనున్నారు.
Holi Special Trains : రైల్వే ప్రయాణికులకు వాల్తేర్ డివిజన్ గుడ్‌న్యూస్ చెప్పింది. హోలీ పండుగకు ప్రయాణికుల అదనపు రద్దీని తగ్గించడానికి నాలుగు ప్రత్యేక రైళ్లను విజయవాడ మీదుగా నడపాలని నిర్ణయించింది. ఈ ప్రత్యేక రైళ్ల సేవలను ప్రజలు వినియోగించుకోవాలని రైల్వేశాఖ కోరుతోంది.
స్పెషల్ రైళ్లు
1. భువనేశ్వర్-చర్లపల్లి హోలీ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు (08479) సోమవారాల్లో మార్చి 10, మార్చి 17, మార్చి 24 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఆయా తేదీల్లో మధ్యాహ్నం 12.10 గంటలకు గంటలకు భువనేశ్వర్ నుండి రైలు బయలుదేరుతుంది. సాయంత్రం 5.10 గంటలకు విజయనగరం చేసుకుంటుంది. అక్కడ నుండి సాయంత్రం 5.20 గంటలకు బయలుదేరి, దువ్వాడ సాయంత్రం 6.30 గంటలకు చేరుకుంటుంది. అక్కడ నుంచి సాయంత్రం 6.32 గంటలకు బయలుదేరి మంగళవారం ఉదయం 7.50 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.
2. చర్లపల్లి – భువనేశ్వర్ హోలీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు ( 08480) మంగళవారాల్లో అంటే మార్చి 11, మార్చి 18, మార్చి 25 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఆయా తేదీల్లో ఉదయం 9.50 గంటలకు చర్లపల్లి నుండి రైలు బయలుదేరుతుంది. ఈ రైలు రాత్రి 9.30 గంటలకు దువ్వాడ చేరుకుని, అక్కడి నుంచి రాత్రి 10.45 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు (బుధవారం) ఉదయం 6.10 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది.
ఈ రెండు రైళ్లు చర్లపల్లి-భువనేశ్వర్ మధ్య నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస తదితర రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. ఈ రెండు రైళ్లలో సెకెండ్ ఏసీ-1, థర్డ్ ఏసీ-4, స్లీపర్ క్లాస్ కోచ్‌లు-9, జనరల్ సెకండ్ క్లాస్ చైర్ కార్ -1, సెకండ్ క్లాస్ కమ్ లగేజ్/ దివ్యాంగన్ -1, మోటార్ కార్-1 ఉంటాయి.
3. విశాఖపట్నం- ఎస్ఎంవీ బెంగళూరు హోలీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు (08549) ఆదివారాల్లో అంటే మార్చి 9, మార్చి 16, మార్చి 23 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఆయా తేదీల్లో మధ్యాహ్నం 3.30 గంటలకు విశాఖపట్నం నుండి రైలు బయలుదేరుతుంది. మరుసటి రోజు మధ్యాహ్నం 12.45 గంటలకు ఎస్ఎంవీ బెంగళూరు చేరుకుంటుంది.
4. ఎస్ఎంవీ బెంగళూరు – విశాఖపట్నం హోలీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు (08550) సోమవారాల్లో అంటే మార్చి 10, మార్చి 17, మార్చి 24 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఆయా తేదీల్లో మధ్యాహ్నం 3.50 గంటలకు ఎస్ఎంవీ బెంగళూరు నుండి రైలు బయలుదేరుతుంది. ఈ రైలు మరుసటి రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
ఈ రెండు రైళ్లు విశాఖపట్నం-ఎస్ఎంవీ బెంగళూరు మధ్య దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, పెరంబూరు, అరకోణం, కాట్పాడి, జోలార్‌పేట, కుప్పం, బంగారుపేట, కృష్ణరాజపురం తదితర రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. ఈ రెండు రైళ్లలో సెకండ్ ఏసీ-4, థర్డ్ ఏసీ ఎకానమీ-2, స్లీపర్ క్లాస్ కోచ్‌లు-8, జనరల్ సెకండ్ క్లాస్ -4, సెకండ్ క్లాస్ కమ్ లగేజ్/ దివ్యాంగజన్ -1, మోటార్ కార్-1 ఉంటాయి.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం
టాపిక్