




Best Web Hosting Provider In India 2024

OTT Movies: ఈ వారంలో ఓటీటీలోకి వచ్చిన టాప్-8 సినిమాలు ఇవి.. వివిధ జానర్ల చిత్రాలు.. స్ట్రీమింగ్ వివరాలివే
OTT Top Movies: ఈ వారంలో ఓటీటీల్లోకి చాలా చిత్రాలు వచ్చేశాయి. వివిధ జానర్లలో ఉన్న సినిమాలు స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చాయి. వాటిలో ఎనిమిది ఇంట్రెస్టింగ్‍గా ఉన్నాయి. ఆ చిత్రాలు ఏవో.. ఇక్కడ స్ట్రీమ్ అవుతున్నాయో ఇక్కడ తెలుసుకోండి.

వివిధ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లోకి ఈ వారం కొన్ని సినిమాలు అడుగుపెట్టాయి. వివిధ జానర్లలో తెరకెక్కిన చిత్రాలు స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చాయి. ఇందులో తొమ్మిది సినిమాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్న మనమే మూవీ ఈవారంలోనే ఓటీటీలోకి వచ్చింది. రేఖాచిత్రం అడుగుపెట్టింది. తండేల్ మూవీ కూడా స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఈవారం ఓటీటీల్లోకి వచ్చిన టాప్-8 చిత్రాలు ఏవో ఇక్కడ చూడండి.
బాపు
బాపు చిత్రం ఈ శుక్రవారం (మార్చి 7) జియోహాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. బ్రహ్మాజీ, ఆమని, సుధాకర్ రెడ్డి, ధన్య బాలకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ థియేటర్లలో రిలీజైన మూడు వారాల్లోగానే హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చింది. ఫాదర్ సెంటిమెంట్‍తో సాగే ఈ రూరల్ ఫ్యామిలీ డ్రామా మూవీకి దయాకర్ రెడ్డి దర్శకత్వం వహించారు.
తండేల్
తండేల్ మూవీ కూడా ఈ వారం మార్చి 7న నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో రూ.100కోట్లకు పైగా కలెక్షన్లను దక్కించుకున్న ఈ మూవీ సరిగ్గా నెలకు తండేల్ మూవీ స్ట్రీమింగ్‍కు వచ్చింది.
మనమే
మనమే చిత్రం మార్చి 7న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. శర్వానంద్, కృతి శెట్టి జంటగా నటించిన ఈ మూవీ థియేటర్లలో రిలీజైన 9 నెలల తర్వాత ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చింది. ఈ రొమాంటిక్ కామెడీ మూవీకి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు.
రేఖాచిత్రం
మలయాళ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ రేఖాచిత్రం మార్చి 6న సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ముందుగా చెప్పిన డేట్ కంటే ఒకరోజు ముందే అడుగుపెట్టింది. ఈ సినిమా మలయాళం, తెలుగు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో సోనీలివ్‍లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆసిఫ్ అలీ, అనస్వర రాజన్ ప్రధాన పాత్రలు పోషించిన రేఖాచిత్రం జనవరిలో థియేటర్లలో రిలీజై భారీ హిట్ సాధించింది. ఈ మూవీకి జోఫిన్ టీ చాకో దర్శకత్వం వహించారు.
ఫతే
సోనూసూద్ హీరోగా నటించిన ఫతే చిత్రం మార్చి 7న జియోహాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. థియేటర్లలో రిలీజైన సుమారు రెండు నెలలకు ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఈ మూవీకి హీరో సోనూసూదే దర్శకత్వం వహించారు.
కుటుంబస్తన్
ఫ్యామిలీ కామెడీ డ్రామా మూవీ ‘కుటుంబస్తన్’ జీ5 ఓటీటీలో మార్చి 7న స్ట్రీమింగ్‍కు వచ్చింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, కన్నడ భాషల్లోనూ స్ట్రీమ్ అవుతోంది. మణికందన్ హీరోగా నటించిన ఈ చిత్రం జనవరి 24 థియేటర్లలో రిలీజై మంచి హ్టట్ అయింది. ఈ చిత్రానికి రాజశేఖర్ కలిసామి డైరెక్షన్ చేశారు.
నయనీతే మూన్నాన్‍మక్కల్
మలయాళ డ్రామా మూవీ ‘నయనీతే మూన్నాన్‍మక్కల్’ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. జోజూ జార్జ్, సూరజ్ వెంజరమూడు ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ థియేటర్లలో రిలీజైన నెలకు ప్రైమ్ వీడియోలో ఎంట్రీ ఇచ్చింది. ఈ ఈ చిత్రానికి శరణ్ వేణుగోపాల్ దర్శకత్వం వహించారు.
నాదానియా
నాదానియా మూవీ మార్చి 7న నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ హీరోగా నటించారు. ఈ చిత్రంతో తెరంగేట్రం చేశారు. ఈ హిందీ చిత్రం నేరుగా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చింది. ఖుషి కపూర్ హీరోయిన్‍గా నటించిన ఈ మూవీకి శౌనా గౌతమ్ దర్శకత్వం వహించారు.
సంబంధిత కథనం