Brahmamudi Promo: యాక్సిడెంట్ స్పాట్ నుంచి రాజ్ మిస్సింగ్- మాయం చేసేసిన యామిని- రక్తపు మరకలతో షర్ట్- రాజ్ ఇక లేడంటూ!

Best Web Hosting Provider In India 2024

Brahmamudi Promo: యాక్సిడెంట్ స్పాట్ నుంచి రాజ్ మిస్సింగ్- మాయం చేసేసిన యామిని- రక్తపు మరకలతో షర్ట్- రాజ్ ఇక లేడంటూ!

Sanjiv Kumar HT Telugu
Published Mar 09, 2025 08:08 AM IST

Brahmamudi Latest Episode Promo: స్టార్ మా ఛానెల్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (జియో హాట్‌స్టార్) ఓటీటీలో ప్రసారం అవుతోన్న బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో ప్రోమోలో చూపించారు. రక్తపు మరకలతో ఉన్న రాజ్ షర్ట్ మాత్రమే దొరికిందని అప్పు చెబుతుంది. దాంతో రాజ్ ఇక లేడని రుద్రాణి అంటుంది.

బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో
బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో

Brahma Mudi Serial Latest Episode Promo: బ్రహ్మముడి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో రాజ్, కావ్య కారులో శ్రీశైలం వెళ్తుంటారు. ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు యామిని అరెంజ్ చేసిన ప్రొఫెషనల్ కిల్లర్ గన్ పట్టుకోని ఎయిమ్ చేసి రెడీగా ఉంటాడు. కావ్యను టార్గెట్ చేసి షూట్ చేస్తాడు కిల్లర్.

కింద పడిన పెళ్లి ఫొటో

కానీ, అది మిస్ అయి పొరపాటుగా కారు టైర్‌కు తగులుతుంది. దాంతో రాజ్, కావ్య కారు లోయలోకి పడిపోయి పేలిపోయినట్లుగా చూపిస్తారు. మరోవైపు దుగ్గిరాల ఇంట్లో రాజ్, కావ్యల పెళ్లి ఫొటో కిందపడుతుంది. అది చూసి అపర్ణ కంగారుపడుతుంది. ఇంకోవైపు కారు టైర్‌కు బుల్లెట్ పొరపాటున తగిలింది అని యామినికి కాల్ చేసి చెబుతాడు కిల్లర్. దాంతో యామిని షాక్ అవుతుంది.

పోలీసులను అడగమని

కట్ చేస్తే కావ్య హాస్పిటల్‌లో ఉన్నట్లు సుభాష్‌కు కాల్ వస్తుంది. దాంతో అంతా షాక్ అయి ఆసుపత్రికి వెళ్తారు. అక్కడ ఐసీయూలో ఉన్న కావ్యను చూసి అపర్ణ, కనకం, ఇందిరాదేవి కన్నీళ్లు పెట్టుకుంటారు. నర్స్ వచ్చి చెప్పడంతో అంతా రిసెప్షన్ హాల్‌లో కూర్చుంటారు. ఇంతలో అపర్ణకు రాజ్ గురించి గుర్తు రావడంతో డాక్టర్‌ను అడుగుతారు. కావ్య ఒక్కరినే తీసుకొచ్చినట్లు, కావాలంటే పోలీసులను అడగమని చెబుతాడు డాక్టర్.

రక్తం చాలా పోయిందంటూ

ఇక కావ్యకు రక్తం చాలా పోయిందని, ముందు రక్తం ఎక్కించాలని చెప్పి వెళ్లిపోతాడు. పోలీసులను అడుగుతానని అప్పు వెళ్తుంది. దేవుడు తమకు అనుకూలంగా చేస్తున్నట్లు రుద్రాణి సంతోషిస్తుంది. ఇప్పుడు ఏమైనా అంటే ఉరికించి ఉరికించి కొడతారు. కాసేపు ఆనందాన్ని ఆపుకో అని రాహుల్ సలహా ఇస్తాడు. మరోవైపు పోలీసులను రాజ్ గురించి, యాక్సిడెంట్ గురించి అడుగుతుంది అప్పు. కానీ, వాళ్లు ఒక్క కావ్య ఒక్కరే ఉన్నట్లు చూశామని, అక్కడ ఎక్కడ ఎవరు లేరని చెబుతారు.

రాజ్ ఏమైపోయాడు

తర్వాత కావ్యకు యాక్సిడెంట్ గుర్తుకు వచ్చి ఏవండి అంటూ లేస్తుంది. దాంతో కావ్య దగ్గరికి అంతా వస్తారు. యాక్సిడెంట్ అయిందని ఫోన్ వస్తే ఇక్కడికి వచ్చాం. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే ఒక్కదానివే ఉన్నావ్. రాజ్ గురించి అడిగితే డాక్టర్లు, పోలీసులు తెలియదంటున్నారు అని కావ్యకు సుభాష్ చెబుతాడు. దాంతో కావ్య షాక్ అవుతుంది. రాజ్ ఏమైపోయాడని బాధపడుతుంది.

రక్తపు మరకలతో రాజ్ షర్ట్

అప్పు వస్తే.. ఏమైందని అపర్ణ అడుగుతుంది. అక్కడ ఎంత గాలించిన బావ కనిపించలేదు. ఒక చెట్టు కొమ్మకి బావ వేసుకున్న షర్ట్ మాత్రం చిక్కుకుని ఉంది అని చెప్పిన అప్పు ఆ షర్ట్ చూపిస్తుంది. ఆ షర్ట్ రక్తపు మరకలతో ఉంటుంది. అది చూసి రుద్రాణి ఎమోషనల్ డ్రామా చేస్తుంది. మనకి ఇక రాజ్ లేడు అని అంటుంది. దాంతో అంతా షాక్ అయి బాధపడిపోతుంటారు.

తీసుకెళ్లిపోయిన యామిని

తర్వాత రక్తపు మరకలతో ఉన్న రాజ్ షర్ట్‌ను పట్టుకుని అపర్ణ వెక్కి వెక్కి ఏడుస్తుంది. అయితే, యాక్సిడెంట్ స్పాట్ నుంచి రాజ్‌ను పాత లవర్ యామిని మాయం చేసినట్లుగా తెలుస్తోంది. కారు లోయలోకి పడిపోయినట్లు కిల్లర్ ద్వారా తెలుసుకున్న యామిని అక్కడికి వచ్చి రాజ్‌ను మాత్రం తీసుకెళ్లినట్లు అర్థం అవుతోంది. తన దగ్గరే ఉంచుకుని రాజ్‌కు యామిని ట్రీట్‌మెంట్ ఇప్పిస్తుందని తెలుస్తోంది. ఇక మిగతాదంతా సోమవారం నాటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్‌లో తెలియనుంది.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌ కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024