




Best Web Hosting Provider In India 2024

OTT Bold Telugu: ఓటీటీలోకి తెలుగు బోల్డ్ కామెడీ సిరీస్.. వారి ప్లేసులో కొత్తగా ఇద్దరు హీరోయిన్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
3 Roses Season 2 OTT Streaming Teaser Release: ఓటీటీలోకి తెలుగు బోల్డ్ కామెడీ వెబ్ సిరీస్ 3 రోజెస్ సీజన్ 2 రానుంది. ఈసారి పాయిల్ రాజ్‌పుత్, పూర్ణ ప్లేసులో కొత్తగా ఇద్దరు హీరోయిన్స్ రానున్నారు. దీనికి సంబంధించిన 3 రోజెస్ 2 టీజర్‌ను ఉమెన్స్ డే సందర్భంగా మార్చి 8న రిలీజ్ చేశారు.

3 Roses Season 2 OTT Streaming Teaser Release: తెలుగులో బోల్డ్ కంటెంట్‌తో వచ్చిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు చాలా తక్కువ. అయితే, గత కొంతకాలంగా టాలీవుడ్‌లోనూ బోల్డ్ సినిమాలను తెరకెక్కిస్తున్నారు. అలా తెలుగులో వచ్చిన బోల్డ్ కామెడీ వెబ్ సిరీసే 3 రోజెస్.
3 రోజెస్ సీజన్ 2 ఓటీటీ
టాలీవుడ్ హీరోయిన్స్ పాయల్ రాజ్‌పుత్, ఈషా రెబ్బా, పూర్ణ మెయిన్ లీడ్ రోల్స్‌లో నటించిన 3 రోజెస్ ఓటీటీలోకి డైరెక్ట్ స్ట్రీమింగ్‌కు వచ్చిన విషయం తెలిసిందే. 2021లో ఓటీటీ రిలీజ్ అయిన 3 రోజెస్ మంచి రెస్పాన్సే అందుకుంది. పాయల్ రాజ్‌పుత్ హాట్‌నెస్, పూర్ణ కామెడీ, ఈషా రెబ్బ గ్లామర్‌తో 3 రోజెస్ క్లిక్ అయింది. ఇప్పుడు ఈ సిరీస్‌కు సీక్వెల్‌గా 3 రోజెస్ సీజన్ 2 రానుంది.
ఇదివరకే 3 రోజెస్ సీజన్ 2 అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. మరోసారి ముగ్గురు అమ్మాయిలు ప్రేమకథలను బోల్డ్‌గా చెప్పనున్నారు. ఈ సీజన్‌లో ఈషా రెబ్బ, హర్ష చెముడు, ప్రిన్స్ సిసిల్, హేమ, సత్యం రాజేశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌ను మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్‌కేఎన్ నిర్మిస్తున్నారు.
డైరెక్టర్ మారుతి షో రన్నర్
డైరెక్టర్ మారుతి షో రన్నర్‌గా వ్యవహరిస్తున్న 3 రోజెస్ సీజన్ 2కి రవి నంబూరి, సందీప్ బొల్ల రచన చేయగా.. కిరణ్ కె కరవల్ల దర్శకత్వం వహించారు. త్రీ రోజెస్ సీజన్ 2 అనౌన్స్‌మెంట్ టీజర్‌ను ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే 2025 సందర్భంగా మార్చి 8న విడుదల చేశారు మేకర్స్. పంచ్ డైలాగ్‌లతో 3 రోజెస్ 2 అనౌన్స్‌మెంట్ టీజర్ వీడియో నవ్వించే ప్రయత్నం చేసింది.
త్రీ రోజెస్ సీజన్ 2 అనౌన్స్‌మెంట్ టీజర్ ఎలా ఉందో చూస్తే.. హర్ష, ఈషా రెబ్బ ఓ రెస్టారెంట్‌లో భోజనం చేస్తూ మాట్లాడుకుంటుంటారు. ఫ్రాన్స్, ఫలావ్ అంటూ డైలాగ్‌లతో కామెడీ పండించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మిగిలిన 2 రోజెస్ గురించి హర్ష అడగగా.. ఇందుకు పెళ్లయ్యిందని, జాను కబీర్‌తో టూర్స్ అంటూ తిరుగుతోందని ఈషా చెబుతుంది.
ఫన్ మాములుగా ఉండదు
“నువ్వు సింగిల్ సింతకాయ్‌లాగా ఉన్నావు కదా” అని హర్ష అంటే.. “సింగిల్‌గా ఎవరున్నారు. సింగిల్ కాదు ఇప్పుడు కూడా ఇద్దరున్నారు. ఈ సారి ఫన్ మామూలుగా ఉండదు. సీజన్ 2 సర్వింగ్ సూన్” అని చెప్పి షాక్ ఇస్తుంది. ఇలా త్రీ రోజేస్ సీజన్ 2 టీజర్ ఫన్‌తో పాటు కావాల్సినంత క్యూరియాసిటీ క్రియేట్ చేసింది.
అయితే, మొదటి సీజన్‌లో పాయల్ రాజ్‌పుత్, పూర్ణ అలరించగా.. రెండో సీజన్‌లో వీరిద్దరు ఉండరని తెలుస్తోంది. వీరి ఇద్దరి స్థానంలో మరో ఇద్దరు కొత్త హీరోయిన్స్ ఎంట్రీ ఇస్తారని టీజర్‌లో ఈషా రెబ్బ మాటలతో అర్థం అవుతోంది. మరి ఆ ఇద్దరు హీరోయిన్స్ ఎవరో తెలియాల్సి ఉంది.
ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్
ఇలా అనౌన్స్‌మెంట్ టీజర్‌తో 3 రోజెస్ సీజన్ 2పై క్యూరియాసిటీ నెలకొల్పారు మేకర్స్. అజయ్ అరసాడ మ్యూజిక్ అందిస్తోన్న 3 రోజెస్ సీజన్ 2 ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అయితే, 3 రోజెస్ 2 ఓటీటీ రిలీజ్ డేట్‌ను ఇంకా ప్రకటించలేదు.
సంబంధిత కథనం