


Best Web Hosting Provider In India 2024
Crime news : వాట్సాప్ గ్రూప్ నుంచి తీసేశాడని.. అడ్మిన్‌ని కాల్చి చంపేశాడు!
Pakistan crime news : వాట్సాప్ గ్రూప్ నుంచి తీసేశాడన్న కోపంతో, ఓ వ్యక్తి.. సదరు గ్రూప్ అడ్మిన్‌ని తుపాకీతో కాల్చి చంపేశాడు. ఈ ఘటన పాకిస్థాన్‌లో చోటు చేసుకుంది.

పాకిస్థాన్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. చాట్ నుంచి తీసేశాడన్న కోపంతో, వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌ని ఓ వ్యక్తి తుపాకీతో కాల్చి చంపేశాడు! పోలీసులు అతడిని ఇప్పటివరకు పట్టుకోలేకపోయారు.
ఇదీ జరిగింది..
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వ ప్రాంతంలో జరిగింది ఈ ఘటన. ముస్తఖ్ అహ్మద్ అనే వ్యక్తి వాట్సాప్‌లో ఒక గ్రూప్‌కి అడ్మిన్‌గా ఉన్నాడు. అదే గ్రూప్‌లో ఉన్న అష్ఫఖ్ అనే వ్యక్తితో గ్రూప్‌లో అతనికి గొడవైంది. ఫలితంగా అష్ఫఖ్‌ని ఆ వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించాడు. ఇది అష్ఫఖ్‌కి నచ్చలేదు. ముస్తఖ్పై కోపం పెంచుకున్నాడు.
గురువారం సాయంత్రం.. గొడవను పరిష్కరించుకుందామని చెప్పి ముస్తఖ్‌ని పిలిపించాడు అష్ఫఖ్. కానీ అష్ఫఖ్ తనతో పాటు గన్ తీసుకెళ్లి.. ముస్తఖ్‌ని చంపేశాడు. ఈ విషయాన్ని ముస్తఖ్ సోదరుడు పోలీసులకు చెప్పాడు.
“ఆ గొడవ పెద్ద విషయమే కాదు. చాలా చిన్న మాటర్. అసలు వివాదం ఎంటో మా కుటుంబంలో ఎవరికీ తెలియదు. దానికే అష్ఫఖ్ నా సోదరుడిని చంపేశాడు,” అని బాధితుడి సోదరుడు మీడియాకు చెప్పాడు.
ముస్తఖ్‌ని చంపేసిన తర్వాత నిందితుడు ఘటనాస్థలం నుంచి పారిపోయాడు. పోలీసులు అతడిని ఇంకా పట్టుకోలేదని సమాచారం. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు వివరించారు.
మరోవైపు చిన్న విషయానకే హత్య జరిగిందన్న వార్త కలకలం సృష్టించింది. వివాదాస్పద, సున్నితమైన ప్రాంతంలో సులభంగా ఆయుధాలు దొరుకుతుండటం సర్వత్రా ఆందోళనకు గురిచేస్తోంది.
ఇండియాలో కూడా..!
ఆన్లైన్ వివాదాల చుట్టూ నేరాలు అనేవి పాకిస్థాన్‌లోనే కాదు, ఇండియాలోనూ జరుగుతున్నాయి. మహారాష్ట్ర థానెలో వాట్సాప్ చుట్టూ జరిగిన వివాదంలో ముగ్గురు వ్యక్తులు, తమ స్నేహితుడిపై దాడి చేశారు.
ప్రధాన నిందితుడు వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌గా ఉన్నాడు. గ్రూప్‌కి తగ్గట్టు స్టేటస్ మార్చుకోవాలని తన స్నేహితుడికి చెప్పాడు. కానీ అతను ఆ పని చేయలేదు.
అంతే! కోపంతో ఊగిపోయిన అడ్మిన్.. మరో ఇద్దరితో కలిసి స్నేహితుడిని కత్తితో పొడిచారు. అతనికి తీవ్ర గాయాలయ్యాయి.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link