




Best Web Hosting Provider In India 2024

Nani: నా కెరీర్‌లో ఇలా బతిమిలాడలేదు.. అలా జరగకపోతే నా హిట్ 3 సినిమాను చూడొద్దు.. హీరో నాని సంచలన కామెంట్స్
Nani About Hit 3 In Court State Vs A Nobody Pre Release Event: నేచురల్ స్టార్ నాని షాకింగ్ కామెంట్స్ చేశాడు. కోర్ట్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఇది ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అని, తాను చెప్పినట్లుగా లేకుంటే మరో రెండు నెలల్లో రిలీజ్ అయ్యే తన హిట్ 3 సినిమాను చూడొద్దంటూ నాని సంచలన కామెంట్స్ చేశాడు.

Nani About Hit 3 In Court Pre Release Event: నేచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ సినిమా సమర్పించిన మూవీ ‘కోర్ట్’ – స్టేట్ వర్సెస్ ఏ నోబడీ’. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన కోర్ట్ మూవీకి రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు.
హోలీ పండుగ సందర్భంగా
ఇప్పటికే విడుదలైన కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నో బడీ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇక కోర్ట్ మూవీ మార్చి 14న హోలీ పండుగ సందర్భంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్‌గా కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నో బడీ ప్రీ రిలీజ్ అండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని నిర్వహించారు.
అతిథులుగా స్టార్ డైరెక్టర్స్
బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ నాగ్ అశ్విన్, ప్రశాంత్ వర్మ, శైలేష్ కొలను, శ్రీకాంత్ ఓదెల, శౌర్యువ్, ఇంద్రగంటి మోహన కృష్ణ, దేవకట్టా ఈ వేడుకలో అతిథులుగా పాల్గొన్నారు. కోర్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నాని షాకింగ్ కామెంట్స్ చేశాడు. దీంతో నాని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దయచేసి సినిమా చూడండి
నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. “ఇక్కడికి వచ్చిన మా డైరెక్టర్స్‌కి థాంక్యూ సో మచ్. ఈ సినిమా గురించి ఒక విషయం బలంగా చెబుతున్నాను. 14న ఈ సినిమాని మీరు మిస్ అవ్వకండి. నా కెరియర్‌లో ఎప్పుడూ కూడా దయచేసి సినిమా చూడండి అని అడగలేదు. కానీ, ఈ సినిమాకి అడుగుతున్నాను” అని అన్నాడు.
అందరిని బ్రతిమిలాడుతున్నాను
“దయచేసి ఈ సినిమా చూడండి. 14న థియేటర్‌కి వెళ్లండి. ఇలాంటి మంచి సినిమా మీరు మిస్ అవ్వకూడదని చెబుతున్నాను. మాకేదో సక్సెస్ రావాలని కాదు. తెలుగు ప్రేక్షకులు ఇలాంటి మంచి సినిమాని మిస్ కాకూడదని చెబుతున్నాను. మీ అందరిని బ్రతిమిలాడుతున్నాను” అని నాని రిక్వెస్ట్ చేశాడు.
ఇంతకంటే బలంగా చెప్పలేను
“ఫ్యామిలీతో కలిసి సినిమాకి వెళ్లండి. గొప్ప సినిమా చూశారానే ఫీలింగ్‌తో వస్తారు. ఒకవవేళ 14న కోర్ట్ సినిమాకి వెళ్లి నేను చెప్పిన అంచనాలకి మ్యాచ్ కాలేదని అనిపిస్తే.. ఇంకో రెండు నెలల్లో రిలీజ్ అవుతున్న నా హిట్ 3ని ఎవరూ చూడొద్దు. ఇంతకంటే బలంగా చెప్పలేను” అని నాని ఊహించని విధంగా కామెంట్స్ చేశాడు.
గ్రేట్ కోర్ట్ రూమ్ డ్రామా ఇచ్చారు
“మార్చి 14న థియేటర్‌కి వెళ్లండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సినిమా చూసినప్పుడు నాకు గొప్ప ఎక్స్‌పీరియన్స్ కలిగింది. సినిమా చూసిన తర్వాత మీరే అందరికీ చెబుతారు. టీమ్ అందరికీ కంగ్రాట్స్ అండ్ థాంక్ యూ. తెలుగు సినిమాకి గ్రేట్ కోర్ట్ రూమ్ డ్రామా ఇచ్చారు. మార్చి14న థియేటర్స్‌లో కలుద్దాం” అని నేచురల్ స్టార్ నాని తన స్పీచ్ ముగించాడు.
అలాంటి సినిమాలు చేయాలని
ఇదే కోర్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ.. “కోర్ట్ పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. రోషన్, శ్రీదేవి చాలా సహజంగా కనిపిస్తున్నారు. ప్రియదర్శి అన్న మల్లేశం సినిమాకి నేను పెద్ద ఫ్యాన్‌ని. ఆయన అలాంటి సినిమాలు చాలా చేయాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్ జగదీశ్‌కి కంగ్రాట్స్. నాని అన్న థాంక్ యూ. సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు.
సంబంధిత కథనం