Vizag Crime : ఎన్‌ఆర్‌ఐ మహిళ అనుమానాస్పద మృతి – ఆ హోటల్ లో ఏం జరిగింది..?

Best Web Hosting Provider In India 2024

Vizag Crime : ఎన్‌ఆర్‌ఐ మహిళ అనుమానాస్పద మృతి – ఆ హోటల్ లో ఏం జరిగింది..?

HT Telugu Desk HT Telugu Published Mar 09, 2025 10:05 AM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Twitter
  • Share on Facebook
HT Telugu Desk HT Telugu
Published Mar 09, 2025 10:05 AM IST

విశాఖ‌ప‌ట్నంలోని ఓ హోటల్ లో ఎన్ఆర్ఐ మ‌హిళ అనుమానాస్ప‌దస్థితిలో మృతి చెంచింది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో వైద్యుడైన శ్రీధర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఎన్ఆర్ఐ మ‌హిళ అనుమానాస్ప‌ద మృతి (representative image )
ఎన్ఆర్ఐ మ‌హిళ అనుమానాస్ప‌ద మృతి (representative image )
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on twitter
  • Share on Facebook

విశాఖ‌ప‌ట్నంలో ఎన్ఆర్ఐ మ‌హిళ అనుమానాస్ప‌ద మృతి చెందింది. ప్రైవేట్ స్థ‌లం లీజ్ నిమిత్తం కొన్ని రోజుల క్రిత‌మే ఆమె వైజాగ్ వ‌చ్చినట్లు తెలిసింది. ఆమె మృతి ఘటన స్థానికంగా సంచ‌ల‌నంగా మారింది. హోట‌ల్‌లోని వాష్ రూమ్ ష‌వ‌ర్‌కు సదరు మ‌హిళ ఉరేసుకున్న‌ట్లు పోలీసుల‌కు స‌మాచారం అందింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు న‌మోదు చేసి… ద‌ర్యాప్తు చేస్తున్నారు.

వైజాగ్ వచ్చిన మహిళా ఎన్ఆర్ఐ..!

విశాఖ‌ప‌ట్నంలోని ఒక స్టార్ హోట‌ల్‌లో చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న శ‌నివారం వెలుగులోకి వ‌చ్చింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం… విశాఖ‌ప‌ట్నంలోని సీత‌మ్మ‌ధార‌కు చెందిన మ‌హిళ (48) ఆమెకారిలో చాలా ఏళ్ల క్రిత‌మే సెటిల్ అయింది. ఆమెకు భ‌ర్త‌, ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. విశాఖ‌ప‌ట్నానికి చెందిన వైద్యుడు శ్రీ‌ధ‌ర్ (52) కూడా అమెరికాలోనే సెటిల్ అయ్యారు. శ్రీధ‌ర్‌కు ఆ మ‌హిళ‌తో స్నేహం ఉంది. నెల రోజుల క్రితం శ్రీధ‌ర్ వైజాగ్ వ‌చ్చారు. ఆయ‌న విశాఖ‌ప‌ట్నంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ స‌మీపంలోనే ఓక స్టార్ హోట‌ల్‌లో రూమ్ రెంట్‌కు తీసుకుని ఉంటున్నారు.

హోటల్ లో సూసైడ్…

సీత‌మ్మ‌ధార‌కు చెందిన ఎన్ఆర్ఐ మ‌హిళ విశాఖ‌ప‌ట్నంలోనే ద్వారకాన‌గ‌ర్‌లో ఒక ప్రైవేట్ స్థ‌లం లీజ్ అగ్రిమెంట్ చేసుకోవ‌డానికి ఇటీవ‌ల అమెరికా నుంచి వ‌చ్చారు. ఆమె కూడా శ్రీధ‌ర్ రెంట్‌కు తీసుకున్న హోట‌ల్ రూమ్‌లోనే… ఉంటున్నారు. ఈ క్ర‌మంలో గురువారం మ‌ధ్యాహ్నం బాత్రూంలోని ష‌వ‌ర్‌కు ఉరేసుకుని మ‌హిళ ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు పోలీసులు స‌మాచారం అందింది. దీంతో హుటాహుటిన పోలీసులు ఆ హోట‌ల్ వ‌ద్ద‌కు చేరుకున్నారు. ఘ‌ట‌నా స్థ‌లాన్ని పోలీసులు ప‌రిశీలించారు. పోలీసులు అనుమాన‌స్ప‌ద మృతిగా న‌మోదు చేసి విచారణ జ‌రుపుతున్నారు.

ఎన్ఆర్ఐ మహిళ సూసైడ్ విషయాన్ని పోలీసులు ఈ విష‌యాన్ని గోప్యంగా ఉంచారు. ఈ ఘ‌ట‌న శ‌నివారం వెలుగులోకి రావ‌డంతో ఒక్క‌సారిగా సంచ‌లనం అయింది. హోట‌ల్ రూమ్‌లో ఏం జ‌రిగింద‌నే వివరాలు తెలియాల్సి ఉంది. అయితే బ్రాత్‌రూంలో ఉరేసుకున్న‌ట్లు ఆన‌వాళ్లు లేక‌పోవ‌డంతో అనారోగ్య కార‌ణాల‌తో మృతి చెంది ఉండ‌వ‌చ్చ‌ని అనుమానిస్తున్నారు. మ‌హిళ ఉంటున్న‌ హోట‌ల్ రూమ్‌లో ఉన్న‌ స్నేహితుడు శ్రీధ‌ర్ ఫోన్‌లో ఉన్న మ‌హిళ వీడియోల‌ను చూస్తే వారిద్ద‌రి మ‌ధ్య గొడ‌వ జ‌రిగిన‌ట్లు పోలీసులు ప్రాథ‌మిక నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. అయితే ఈ నేప‌థ్యంలో మ‌న‌స్తాపానికి గురై ఆత్మ‌హ‌త్య చేసుకుందా…? లేక హ‌త్య‌కు గురైందా…? అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

మ‌హిళ భ‌ర్త శ‌నివారం అమెరికా నుంచి విశాఖ‌ప‌ట్నం వ‌చ్చారు. పోస్టుమార్టం అనంత‌రం మృత‌దేహాన్ని తీసుకెళ్లారు. అయితే ఆమెతో హోట‌ల్ రూమ్‌లో ఉన్న శ్రీధ‌ర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ద‌ర్యాప్తు జ‌రుగుతోంద‌ని, పోస్టుమార్టం నివేదిక వ‌చ్చిన త‌రువాత వాస్త‌వాలు వెల్ల‌డ‌వుతాయ‌ని ఏసీపీ ల‌క్ష్మ‌ణ‌మూర్తి తెలిపారు. అయితే మ‌హిళ‌ ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు శ్రీధ‌ర్ పోలీసుల‌కు ఫిర్యాద చేసిన‌ట్లు త్రీటౌన్ సీఐ ర‌మ‌ణ‌య్య తెలిపారు.

రిపోర్టింగ్: జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.

Whats_app_banner

టాపిక్

Andhra Pradesh NewsVisakhapatnamCrime ApAp PoliceNri News Usa TeluguNri News
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024