Sonakshi Sinha: సుధీర్ బాబు హారర్ థ్రిల్లర్‌లో దబాంగ్ హీరోయిన్- చంద్రముఖిలా ఫస్ట్ లుక్- తెలుగులో సోనాక్షి సిన్హా ఎంట్రీ!

Best Web Hosting Provider In India 2024

Sonakshi Sinha: సుధీర్ బాబు హారర్ థ్రిల్లర్‌లో దబాంగ్ హీరోయిన్- చంద్రముఖిలా ఫస్ట్ లుక్- తెలుగులో సోనాక్షి సిన్హా ఎంట్రీ!

Sanjiv Kumar HT Telugu
Published Mar 09, 2025 10:35 AM IST

Sonakshi Sinha Telugu Debut With Sudheer Babu Jatadhara: సుధీర్ బాబు హారర్ థ్రిల్లర్ జటాధర మూవీతో తెలుగులో ఎంట్రీ ఇస్తోంది బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా. సల్మాన్ ఖాన్ దబాంగ్‌తో హీరోయిన్‌గా అడుగుపెట్టిన సోనాక్షి సిన్హా జటాధర ఫస్ట్ లుక్‌ను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేశారు.

సుధీర్ బాబు హారర్ థ్రిల్లర్‌లో దబాంగ్ హీరోయిన్- చంద్రముఖిలా ఫస్ట్ లుక్- తెలుగులో సోనాక్షి సిన్హా ఎంట్రీ!
సుధీర్ బాబు హారర్ థ్రిల్లర్‌లో దబాంగ్ హీరోయిన్- చంద్రముఖిలా ఫస్ట్ లుక్- తెలుగులో సోనాక్షి సిన్హా ఎంట్రీ!

Sonakshi Sinha In Sudheer Babu Horror Movie Jatadhara: సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ జటాధార మూవీతో బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా తెలుగులోకి పరిచయం అవుతున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె కొత్త పోస్టర్‌ను రివిల్ చేశారు మేకర్స్. ఈ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్‌లో యాక్షన్, మిస్టరీతో కూడిన పవర్‌ఫుల్ అవతార్‌లో సోనాక్షి సిన్హా కనిపించనున్నారు.

అటు ఇటుగా చంద్రముఖిలా

హీరామండిలో పవర్ ఫుల్ పాత్ర తర్వాత సోనాక్షి సిన్హా.. పౌరాణికాలు, యాక్షన్, అతీంద్రియ అంశాలను బ్లెండ్ చేసే పాన్-ఇండియా చిత్రం జటాధారతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. అయితే, జటాధరలోని సోనాక్షి సిన్హా ఫస్ట్ లుక్ పోస్టర్ కాస్తా అటు ఇటుగా చంద్రముఖి పోస్టర్‌లా ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇంటెన్సివ్‌గా సోనాక్షి సిన్హా పోస్టర్

లూజ్ హెయిర్, కాస్తా చెరిగిన బొట్టు, మొహానికి చేయి అడ్డు పెట్టుకుని కేవలం కళ్లు, నుదురుతో ఉన్న సోనాక్షి సిన్హా జటాధర ఫస్ట్ లుక్ చంద్రముఖి తరహాలో ఉందంటూ సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. కానీ, ఏది ఏమైనా సోనాక్షి సిన్హా ఫస్ట్ లుక్ మాత్రం చాలా ఇంటెన్సివ్‌గా అట్రాక్ట్ చేసేలా ఉంది.

మౌంట్ అబూ అడవుల్లోకి

కాగా జటాధర ప్రయాణం ఫిబ్రవరి 14న హైదరాబాద్‌లో జరిగిన గ్రాండ్ ముహూర్త వేడుకతో ప్రారంభమైంది. దీనికి పరిశ్రమలోని ప్రముఖులు హాజరయ్యారు. ఇప్పుడు, టీం మౌంట్ అబూ అడవుల్లోకి వెళ్లనుంది. అక్కడ మౌకా స్టూడియోస్‌లో సినిమా ఆధ్యాత్మిక ప్రపంచాన్ని జీవం పోయడానికి ఒక అద్భుతమైన అడవి సెట్ నిర్మించారు.

హీరోగా సుధీర్ బాబు

ఇక జటాధర సినిమాలో సుధీర్ బాబు హీరోగా లీడ్ రోల్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు వెంకట్ కల్యాణ్ దర్శకత్వం వహించగా.. జీ స్టూడియోస్‌ ఉమేష్ కేఆర్ బన్సాల్, ప్రేరణ అరోరా, అరుణ అగర్వాల్, శివిన్ నారంగ్ నిర్మించారు. సహ నిర్మాతలుగా అక్షయ్ కేజ్రీవాల్, కుస్సుమ్ అరోరా ఉన్నారు. క్రియేటివ్ ప్రొడ్యూసర్స్‌గా దివ్య విజయ్, సాగర్ ఆంబ్రే కూడా ఈ చిత్రానికి కొలబరేట్ అయ్యారు.

మార్చి 10 నుంచి సోనాక్షి సిన్హాతో షూటింగ్

ఇక జటాధర సినిమా షూటింగ్‌లో మార్చి 10న సోనాక్షి సిన్హా జాయిన్ అవుతారు. అద్భుతమైన కథాంశం, విజువల్స్‌తో ‘జటాధార’ ఈ సంవత్సరంలో మోస్ట్ ఎవైటెడ్ మూవీస్‌లో ఒకటిగా నిలవనుందని తెలుస్తోంది. ఇది మునుపెన్నడూ లేని విధంగా గ్రేట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని అందించనుందని ప్రమోషన్స్ చూస్తే తెలుస్తోంది.

దబాంగ్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ

ఇదిలా ఉంటే, సల్మాన్ ఖాన్ సూపర్ హిట్ మూవీ దబాంగ్‌తో బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అనేక పాత్రలతో సోనాక్షి సిన్హా ఆకట్టుకుంది. అంతేకాకుండా రజనీకాంత్ లింగా చిత్రంతో తమిళంలోకి కూడా అడుగుపెట్టింది. ఈ మూవీ తెలుగులో కూడా డబ్ అయింది.

లింగాతో తమిళ డెబ్యూ

అయితే, సోనాక్షి సిన్హా నేరుగా చేస్తున్న తొలి తెలుగు మూవీ మాత్రం జటాధర. మరి సుధీర్ బాబు హీరోగా చేస్తున్న ఈ జటాధర సోనాక్షి సిన్హాకు ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌ కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024