APOSS SSC Hall Tickets 2025 : ఏపీ ఓపెన్ టెన్త్ హాల్ టికెట్లు విడుదల – ఇలా డౌన్లోడ్ చేసుకోండి

Best Web Hosting Provider In India 2024

APOSS SSC Hall Tickets 2025 : ఏపీ ఓపెన్ టెన్త్ హాల్ టికెట్లు విడుదల – ఇలా డౌన్లోడ్ చేసుకోండి

Maheshwaram Mahendra Chary HT Telugu Published Mar 09, 2025 12:35 PM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Twitter
  • Share on Facebook
Maheshwaram Mahendra Chary HT Telugu
Published Mar 09, 2025 12:35 PM IST

APOSS SSC Hall Tickets 2025 : ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ పదో తరగతి హాల్ టికెట్లు విడుదల అయ్యాయి. విద్యార్థులు ఏపీఓఎస్ఎస్ అమరావతి అధికారిక వెబ్‌సైట్‌ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మార్చి 17వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

ఏపీ ఓపెన్ స్కూల్ టెన్త్  హాల్ టికెట్లు
ఏపీ ఓపెన్ స్కూల్ టెన్త్ హాల్ టికెట్లు
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on twitter
  • Share on Facebook

ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ(APOSS) పదో తరగతి హాల్ టికెట్లు వచ్చేశాయ్..! విద్యార్థులు ఏపీఓఎస్ఎస్ అమరావతి అధికారిక వెబ్‌సైట్‌ లేదా ఏపీ ప్రభుత్వ వాట్సాప్ (మన మిత్ర) నుంచి నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మార్చి 17 నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. విద్యార్థి పేరు, స్కూల్ పేరు, జిల్లా వివరాలు నమోదు చేసి హాల్ టికెట్ పొందవచ్చు.

ఏపీఓఎస్ఎస్ టెన్త్ హాల్ టికెట్ 2025 డౌన్లోడ్ :

  • విద్యార్థులు ముందుగా ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ, అమరావతి అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోంపేజీలో హాల్ టికెట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ SSC, ఇంటర్ అని ఉంటుంది. మీరు SSC ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ కొత్త విండో ఓపెన్ అవుతుంది.
  • ఇక్కడ జిల్లా, స్కూల్, విద్యార్థి పేరును నమోదు చేయాలి. డౌన్లోడ్ హాల్ టికెట్ పై క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.

ఇక ఈ హాల్‌ టికెట్లను వాట్సాప్‌ ద్వారా డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కూడా ఉంది. విద్యార్థులు వాట్సప్‌ నంబరు 9552300009 కి హాయ్‌ అనే సందేశాన్ని పంపాలి. ఆ తర్వాత సర్వీసును ఎంపిక చేసుకొని…. హాల్‌టికెట్‌ డౌన్లోడ్ చేసుకోవచ్చు. 

పదో తరగతి పరీక్షల తేదీలు:

ఏపీ ఓపెన్ టెన్త్ ప‌బ్లిక్ ప‌రీక్ష‌లు ఆరో రోజులు పాటు జ‌రుగుతాయి. ప‌రీక్ష‌లు ప్ర‌తి రోజూ ఉద‌యం 9.30 గంట‌ల నుండి మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల వ‌ర‌కు జ‌రుగుతాయి. పరీక్షలో పాల్గొనే విద్యార్థులు పరీక్ష ప్రారంభ సమయానికి కనీసం గంట ముందుగా సంబంధిత పరీక్షా కేంద్రంలో ఫోటో గుర్తింపు కార్డు, హాల్ టికెట్ తో రిపోర్ట్ చేయాలి. పరీక్ష తేదీలు చూస్తే…

  1. మార్చి 17 (సోమ‌వారం) – హిందీ
  2. మార్చి 19 (బుధ‌వారం) – ఇంగ్లీష్
  3. మార్చి 21 (శుక్ర‌వారం) – తెలుగు, ఉర్దూ, క‌న్న‌డ‌, ఒరియా, తమిళం
  4. మార్చి 24 (సోమ‌వారం) – గ‌ణితం, భార‌తీయ సంస్కృతి, వార‌స‌త్వం
  5. మార్చి 26 (బుధ‌వారం) – సాంకేతిక విజ్ఞాన శాస్త్రం, గృహ విజ్ఞాన శాస్త్రం
  6. మార్చి 28 (శ‌నివారం) – సాంఘిక శాస్త్రం, ఆర్థిక శాస్త్రం.

ఈ లింక్ పై క్లిక్ చేసి ఏపీ ఓపెన్ టెన్త్ హాల్ టికెట్లను నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు…

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్

Ap SscOpen UniversityAndhra Pradesh NewsEducation
Source / Credits

Best Web Hosting Provider In India 2024