Sunita Williams : అంతరిక్షంలో రెండు ప్రత్యేకమైన రికార్డులు సృష్టించిన సునీతా విలియమ్స్

Best Web Hosting Provider In India 2024


Sunita Williams : అంతరిక్షంలో రెండు ప్రత్యేకమైన రికార్డులు సృష్టించిన సునీతా విలియమ్స్

Anand Sai HT Telugu Published Mar 09, 2025 02:45 PM IST
Anand Sai HT Telugu
Published Mar 09, 2025 02:45 PM IST

Sunita Williams : ఎనిమిది నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్ తిరిగి రావడానికి మరో 10 రోజుల సమయం ఉంది. ఈ ఎనిమిది నెలల్లో ఆమె ఆరోగ్యం క్షీణించడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. అంతరిక్షంలో సునీతా విలియమ్స్ రెండు ప్రత్యేకమైన రికార్డులను సృష్టించారు.

సునీతా విలియమ్స్
సునీతా విలియమ్స్

భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమికి తిరిగి వచ్చే తేదీ దగ్గర పడుతోంది. పది రోజుల తర్వాత సునీతా విలియమ్స్ తోటి వ్యోమగామి బుచ్ విల్మోర్ తో కలిసి స్పేస్ ఎక్స్ డ్రాగన్‌లో తిరిగి వస్తారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా ఈ విషయం గురించి మాట్లాడారు. గత 8 నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఇద్దరు వ్యోమగాములు చిక్కుకుపోయారు. మంచి విషయం ఏంటంటే ఇద్దరు బాగానే ఉన్నారు. గతంలో ఆమె ఫోటోలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. ఆ ఫోటోల్లో చాలా సన్నగా కనిపించారు. ఆరోగ్యం క్షీణించినప్పటికీ సునీతా విలియమ్స్ ఈ ఎనిమిది నెలల్లో రెండు ప్రత్యేకమైన రికార్డులను నెలకొల్పారు.

తొలి మహిళ

వరుసగా ఎక్కువ కాలం అంతరిక్షంలో ఉన్న తొలి మహిళగా రికార్డు సృష్టించారు సునీతా విలియమ్స్. చాలా నెలలకు పైగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో ఉన్నారు. ఈ ఘనత సాధించిన మెుదటి మహిళగా రికార్డు సృష్టించారు. అంతేకాకుండా అత్యధిక స్పేస్ వాక్ లు చేసిన తొలి మహిళగా సునీతా విలియమ్స్ పేరిట రికార్డు నమోదైంది.

తొమ్మిది స్పేస్ వాక్‌లు

సునీతా విలియమ్స్ కు ఇది మూడో స్పేస్ ట్రిప్. ఈ మూడు ట్రిప్పులతో కలిపి ఆమె ఇప్పటివరకు తొమ్మిది స్పేస్ వాక్ లు చేశారు. ఈ సమయంలో 62 గంటల 6 నిమిషాలు స్పేస్ వాక్ లో గడిపారు. 2006-07లో సునీత తన తొలి అంతరిక్ష ప్రయాణంలో మొత్తం 29 గంటల 17 నిమిషాల పాటు స్పేస్ వాక్ చేశారు. ఒక మహిళ చేసిన సుదీర్ఘ స్పేస్ వాక్ ఇదే కావడం విశేషం. గతంలో 21 గంటలకు పైగా స్పేస్ వాక్ చేసిన కేథరిన్ థార్న్ టన్ పేరిట ఈ రికార్డు నమోదైంది. సునీత తన మూడు అంతరిక్ష యాత్రల్లో ఇప్పటివరకు మొత్తం తొమ్మిది స్పేస్ వాక్ లు చేశారు. ఈ స్పేస్ వాక్ ల మొత్తం సమయం 62 గంటల 6 నిమిషాలకు చేరుకుంది.

త్వరలో తీసుకువస్తాం : ట్రంప్

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన ఇద్దరు వ్యోమగాములను త్వరలోనే భూమికి తీసుకువస్తామని ట్రంప్ ఇటీవలే అన్నారు. ‘ఇద్దరు వ్యోమగాములు అంతరిక్షంలో చిక్కుకున్నారు. నేను ఎలాన్ మస్క్‌తో చెప్పాను, స్పేస్ ఎక్స్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా తీసుకువస్తాం.’ అని ట్రంప్ అన్నారు.

Anand Sai

eMail
Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link