

Best Web Hosting Provider In India 2024

Cucumber Face Pack: వేసవిలో మీ చర్మాన్ని రక్షించుకోవడానికి ఈ ఒక్క ఫేస్ ప్యాక్ చాలు! ఇది అన్ని సమస్యలకూ చెక్ పెడుతుంది
Cucumber Face Pack: వేసవిలో సూర్యుడి తాపం నుంచి మీ చర్మాన్ని కాపాడుకోవాలనుకుంటే కీరదోస ప్యాక్ మీకు చాలా బాగా సహాయపడుతుంది. ఇంట్లోనే తయారు చేసుకునే ఈ ప్యాక్ అన్ని రకాల చర్మ సమస్యలను నయం చేస్తుంది. కీరదోస ప్యాక్ వల్ల చర్మానికి కలిగే ప్రయోజనాలేంటో దీన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం రండి.

వేసవి వచ్చేసింది. రోజు రోజుకీ పెరుగుతున్న ఎండల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా భానుడి తాపానికి చర్మం సులువుగా దెబ్బతింటుంది. ట్యాన్, చెమట కారణంగా ముఖం కాంతిని కోల్పోతుంది. మొటిమలు, ముడతలతో పాటు చర్మంపై మృతకణాలు ఎక్కువ అవుతాయి. వీటన్నింటినీ తప్పించుకోవడానికి వేలకు వేలు ఖర్చు పెట్టకుండా ఈజీగా ఇంట్లోనే సహజమైన ప్యాక్‌ను తయారు చేసుకోవచ్చు.అది కూడా ఇంట్లో ఎప్పుడూ ఉండే మూడు రకాల పదార్థాలతో.
ఈ ఒక్క ఫేస్ ప్యాక్‌తో వేసవిలో వచ్చే చర్మ సమస్యలన్నింటికీ చెక్ పెట్టచ్చు. అదే కీరదోస ఫేస్ ప్యాక్. వేసవిలో కీరదోస తినడం వల్ల ఎన్ని లాభాలు కలుగుతాయో మీ అందరికీ తెలిసిందే. ముఖానికి రాసుకోవడం వల్ల చర్మానికి మరింత మేలు కలుగుతుంది. ఆలస్యం చేయకుండా ఈ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలో తెలుసుకోండి.
కీరదోస ఫేస్ ప్యాక్ తయారీకి కావాల్సిన పదార్థాలు:
- దోసకాయ
- కాఫీ పొడి
- గోధుమ పిండి
కీరదోస ప్యాక్ తయారు చేసే విధానం:
1.ముందుగు ఒక కీరదోసను తీసుకుని సన్నగా తురుముకుని రెండూ స్సూన్ల వరకూ తీసుకుని ఒక బౌల్ లో వేసుకోండి.
2. తరువాత దీంట్లోనే ఒక స్పూన్ కాఫీ పౌడర్, ఒక స్పూన్ గోధుమపిండి వేసి బాగా కలపండి.
3. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ, చేతులు ఇలా బయటకు కనిపించేంత వరకూ చర్మానికి పట్టించండి. తేలికగా మసాజ్ చేస్తే పట్టిస్తే మరింత మంచిది.
4. దీన్ని అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరనివ్వండి.
3. తర్వాత గోరు వెచ్చటి లేదా చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి.
కీరదోస ప్యాక్ తో కలిగే ప్రయోజనాలు:
లోతైన శుభ్రత: కీరదోస ప్యాక్ కనీసం వారానికి రెండు సార్లైనా అప్లై చేసుకోవడం వల్ల చర్మానికి లోతైన శుభ్రత అందుతుంది. చర్మపు రంధ్రాలలో పేరుకుపోయిన మురికి, నూనె, కాలుష్యాన్ని తొలగిస్తుంది.
తేమ అందిస్తుంది: దోసకాయ చర్మాన్ని చల్లబరుస్తుంది. చర్మారోగ్యానికి కావాల్సిన తేమ అంది చికాకు, ఎరుపుదనం వంటి సమస్యలను తగ్గిస్తుంది.
మృతకణాల తొలగింపు: కాఫీ పొడి చర్మంపై మృతకణాలను సున్నితంగా తొలగిస్తుంది, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, చర్మాన్ని మరింత కాంతివంతంగా మారుస్తుంది. సహజమైన మెరుపును అందిస్తుంది.
నూనె నియంత్రణ, మ్యాట్ ఎఫెక్ట్: గోధుమ పిండి చర్మంపై ఉన్న అదనపు నూనెను పీల్చుకుంటుంది, చర్మాన్ని జిడ్డుగా లేకుండా చేస్తుంది.
వృద్ధాప్య ఛాయలను తొలగిస్తుంది: దోసకాయ, కాఫీపొడి, గోధుమపిండిల కలయిక చర్మాన్ని బిగుతుగా చేయడానికి చాలా బాగా సహాయపడుతుంది. ముఖంపై ఏర్పడే సన్నని గీతలు, ముడతలను తగ్గించి వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా చేస్తుంది.
సహజమైన రంగు: కీరదోస ఫేస్ ప్యాక్‌ను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల ముఖంపై మొటిమలు, నల్ల మచ్చలు, టాన్ తగ్గుతాయి. చర్మానికి సహజమైన, సమానమైన రంగు అందుతుంది.
వేసవిలో ఈ చిట్కా ఎందుకు ఉపయోగపడుతుంది?
- వేసవిలో చర్మం ఎక్కువ నూనెను ఉత్పత్తి చేస్తుంది, దీనిని గోధుమపిండి నియంత్రిస్తుంది.
- ఎండ వేడికి చర్మం ఎర్రబడటం, మంట రావడం వంటి సమస్యలు వస్తాయి. దోసకాయ చల్లదనం ఇస్తుంది.
- కాఫీ పొడి చర్మానికి మంచి స్క్రబ్ లా పనిచేసి చర్మంలోని మృతకణాలను తొలగిస్తుంది.
ఈ సహజమైన చిట్కాను ఉపయోగించి మీ చర్మాన్ని వేసవిలో ఆరోగ్యంగా ఉంచుకోండి.
సంబంధిత కథనం