Best Web Hosting Provider In India 2024

వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, సోషల్ మీడియా టాస్క్‌ఫోర్స్ సభ్యులు రమేష్‌గౌడ్ పిలుపు
కూటమి ప్రభుత్వంలో.. దగాపడ్డ విద్యార్థులు, నిరుద్యోగులు
మద్దతు తెలిపిన ఐక్య విద్యార్థి యువజన, కుల సంఘాలు
అనంతపురం : వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు కూటమి ప్రభుత్వంలో అన్యాయానికి గురవుతున్న విద్యార్థులకు, నిరుద్యోగులకు అండగా ఉండేందుకు ఈనెల 12న (బుధవారం) ‘యువత పోరు’కు అన్ని వర్గాల నుంచి మద్దతు వెల్లువెత్తుతోంది. పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి నేతృత్వంలో అనంతపురం జిల్లాలో యువత పోరును విజయవంతం చేసేందుకు ఆదివారం అనంతపురం జిల్లా వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా టాస్క్‌ఫోర్స్ సభ్యులు, వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి బీసీ రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో సంఘీభావ సదస్సు ఏర్పాటు చేశారు. అనంతపురం నగరంలోని ప్రెస్‌క్లబ్ నందు ఐక్య విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి రమేష్ గౌడ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబా సలాం, ఏఐఎస్‌బీ జిల్లా ప్రధాన కార్యదర్శి పాపిరెడ్డిపల్లి ఫృథ్వీ, పీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు మంజుల నరేంద్ర, జీవీఎస్‌ఎస్ జాతీయ ఉపాధ్యక్షులు మల్లికార్జున నాయక్, గిరిజన విద్యార్థి నాయకులు లక్ష్మీపతి నాయక్, ఎస్సీ జనసంఘం వ్యవస్థాపక అధ్యక్షులు దాసగానిపల్లి కుల్లాయప్ప, ఏఐఎస్‌బీ జిల్లా అధ్యక్షులు బిల్లే జగదీష్, ఎస్వీఎస్‌ఎఫ్ బీసీ చక్రధర్ యాదవ్, ఎంఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జెన్నే చిరంజీవి, బీసీ ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షులు కేశవ గౌడ్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఓబులేసు, జీపీఎస్ జిల్లా అధ్యక్షులు సాకే ఆనందర్, వైయస్ఆర్‌సీపీ జిల్లా విద్యార్థి విభాగం నగర అధ్యక్షులు కైలాష్, వివిధ కుల సంఘాలు, ప్రజాసంఘాల నాయకులు తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, టాస్క్‌ఫోర్స్ సభ్యులు రమేష్‌గౌడ్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రూ.3900 కోట్ల ఫీజు రీఎంబర్స్‌మెంట్, వసతి దీవెన, నిరుద్యోగభృతి, మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయకుండా నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. ఈనెల 12వ తేదీన ఉదయం 10 గంటలకు అనంతపురంలోని జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ కొనసాగుతుందన్నారు. సప్తగిరి సర్కిల్, సూర్య నగర్ మీదుగా కలెక్టరేట్ వరకు చేరుకుని జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందివ్వనున్నట్లు తెలిపారు.
ఎన్నికలకు ముందు చంద్రబాబు, కూటమి ప్రభుత్వానికి చెందిన ముఖ్యనాయకులు అందరూ.. రాష్ట్రంలో ఊరూరా తిరిగి మేము.. 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం.. నిరుద్యోగులకు ప్రతి నెల రూ.3వేలు అందిస్తామని చెప్పడం జరిగింది. అయితే ఇదే హామీని చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల్లో కూడా ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకపోవడం, మళ్లీ అదే చంద్రబాబు నాయుడు 2024 ఎన్నికలకు ముందు ఇదే హామీని ఇచ్చారని ఈసారైనా చెప్పిన 20లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగులకు భృతి ఇస్తారనే ఆశతో చంద్రబాబుకు ఓట్లు వేసి గెలిపించారు.. అయితే ప్రభుత్వం ఏర్పడి దాదాపు 9నెలలు గడుస్తున్నా ఏ హామీని కూడా నెలవేర్చలేదన్నారు.
గతంలో 2019 నుండి 2024 వరకు వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ సచివాలయాల ద్వారా దాదాపు 1,35,000 వేల ఉద్యోగాలు, వైద్య రంగంలో దాదాపు 75వేల ఉద్యోగాలు, అన్ని రంగాలలో నిరుద్యోగలకు జగన్‌మోహన్‌రెడ్డి అండగా నిలిచారన్నారు. గతంలో చదువుకు పేదరికం అడ్డు రాకూడదనే ఉద్ధేశ్యంతో దివంగతనేత డాక్టర్ వైయస్ రాజశేఖర్‌రెడ్డి ఫీజురియంబర్స్‌మెంట్ అనే పథకాన్ని ప్రశేశపెట్టారన్నారు. ఈ పథకంతో వేలాధిమంది విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఇంజనీర్లు, డాక్టర్లుగా ఈరోజు రాష్ట్రంలోనే కాకుండా దేశ విదేశాల్లో ఆంధ్రప్రదేశ్ యెక్క చరిత్రను తిరగరాసేవిధంగా అభివృద్ధి చెందినటువంటి పరిస్థుతులు మనం చూస్తున్నామన్నారు.
స్వాతంత్య్రం భారతదేశంలో గత 75యేళ్లుగా దాదాపు 11 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు మాత్రమే ఉన్నాయని, అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువారం 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలల నిర్మాణాలు పూర్తిచేశారని, అందులో 5 మెడికల్ కళాశాలకు సంబంధించి అడ్మిషన్లు చేపట్టి ప్రతి సంవత్సరం 2550 మంది పేద విద్యార్థులకు నాణ్యమైనటువంటి వైద్య విద్యను అందించేందుకు శ్రీకారం చుట్టినటువంటి చరిత్ర జగన్‌మెహన్‌రెడ్డి దే అన్నారు. వీటిని కూడా ప్రైవేట్ పరం చేస్తూ కార్పోరేట్ వ్యక్తులకు విద్యావ్యవస్థను తాకట్టు పెట్టే విధంగా కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు బాధాకరమన్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం రూ.1780 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెట్టిపోతే వైయస్ జగన్ సీఎం కాగానే ఆ బకాయిలను విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 37వేల పైచిలుకు పాఠశాలలను నాడు`నేడు పథకం కింద అభివృద్ధి చేసి.. కార్పొరేట్ దీటుగా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టి పేద విద్యార్థులకు పెద్దపీట వేసిన ఘనత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కిందన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9నెలలు అవుతున్నా ఒక్క రూపాయి కూడా చెల్లించలేదన్నారు. తాజాగా ఫీజులు చెల్లించాలని కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. లేకపోతే పరీక్షలకు సైతం అనుమతించేది లేదని తేల్చి చెబుతున్నారన్నారు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నట్లు చెప్పారు. కొన్ని చోట్ల ఫీజుల ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలోనే విద్యార్థులకు అండగా వైయస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో ‘ఫీజు పోరు’ నిర్వహించనున్నట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, స్వచ్ఛందంగా తరలిరావాలని కోరారు. సమావేశంలో నాయకులు బెస్త వెంకటేష్, చంద్ర, నరసింహులు, నాగేంద్ర, వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు లబ్బె రాఘవ, హేమకిరణ్, దూదూ, వంశీ, మోహన్, గణేష్, మారుతి, బాలాజీ, వినీత్, రోహిత్ కుమార్, చిన్న, హరీష్, మణికంఠ, వైయస్ఆర్‌సీపీ నాయకులు, విద్యార్థి నాయకులు తదితరులు పాల్గొన్నారు.