SSMB 29 Leak: మహేశ్ – రాజమౌళి మూవీకి మరోసారి లీక్ బెడద.. షూటింగ్ వీడియో చక్కర్లు

Best Web Hosting Provider In India 2024

SSMB 29 Leak: మహేశ్ – రాజమౌళి మూవీకి మరోసారి లీక్ బెడద.. షూటింగ్ వీడియో చక్కర్లు

Chatakonda Krishna Prakash HT Telugu
Published Mar 09, 2025 04:54 PM IST

SSMB 29 Leak: మహేశ్ బాబు – రాజమౌళి సినిమా సెట్స్ నుంచి మరో వీడియో లీక్ అయింది. ఇటీవలే సెట్స్ వీడియో బయటికి రాగా.. ఇప్పుడు ఏకంగా షూటింగ్ వీడియో చక్కర్లు కొడుతోంది. ఆ వివరాలు ఇవే..

SSBM 29 Leak: మహేశ్ - రాజమౌళి మూవీకి మరోసారి లీక్ బెడద.. షూటింగ్ వీడియో చక్కర్లు
SSBM 29 Leak: మహేశ్ – రాజమౌళి మూవీకి మరోసారి లీక్ బెడద.. షూటింగ్ వీడియో చక్కర్లు

దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‍లో తెరకెక్కుతున్న మూవీ (ఎస్ఎస్ఎంబీ29)పై అంచనాలు అత్యంత భారీగా ఉన్నాయి. గ్లోబల్ రేంజ్‍లో గ్రాండ్ స్కేల్‍లో ఈ అడ్వెంచర్ యాక్షన్ మూవీ రూపొందుతోంది. ఇటీవలే హైదరాబాద్‍లో కాస్త షూటింగ్ జరగగా.. ప్రస్తుతం ఒడిశాలో సాగుతోంది. ఈ మూవీకి మరోసారి లీక్ బెదడ తగిలింది. ఇటీవలే ఒడిశా షూటింగ్ సెట్‍కు సంబంధించి ఓ వీడియో బయటికి వచ్చింది. అయితే, ఇప్పుడు ఏకంగా షూటింగ్ వీడియోనే లీకైంది.

లీక్డ్ వీడియో ఇలా..

ఎస్ఎస్ఎంబీ29 (వర్కింగ్ టైటిల్) ఒడిశా షూటింగ్ స్పాట్ నుంచి వీడియో క్లిప్ లీకైంది. మహేశ్ బాబు అలా నడిచి వస్తుంటే.. గన్ పట్టుకున్న ఓ సెక్యూరిటీ పర్సన్ వెనక నుంచి తోస్తాడు. ఆ తర్వాత వీల్‍చైర్‌లో కూర్చున్న వ్యక్తి ముందు మహేశ్ మోకాళ్లపై కూర్చుంటారు. ఇలా ఈ లీక్డ్ వీడియోలో ఉంది. ఇది ఓ యాక్షన్ సీన్‍లా కనిపిస్తోంది. ఈ సీన్‍ను కారులో నుంచి మొబైల్‍తో రికార్డు చేసినట్టుగా అనిపిస్తోంది.

సోషల్ మీడియాలో వైరల్

మహేశ్ – రాజమౌళి మూవీ షూటింగ్ స్పాట్ నుంచి లీకైన ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. విపరీతంగా వైరల్ అవుతోంది. మహేశ్ లుక్ అదిరిపోయిందని మరోసారి నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ వీల్‍చైర్‌లో ఉన్నది పృథ్విరాజ్ సుకుమారన్ అని కొందరు అభిప్రాయపడుతున్నారు.

షేర్ చేయవద్దంటూ..

ఎస్ఎస్ఎంబీ29 షూటింగ్ స్పాట్ నుంచి లీకైన వీడియోను పోస్ట్, షేర్ చేయవద్దని కొందరు మహేశ్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇలాంటి లీక్‍ల వల్ల బిగ్ స్క్రీన్‍పై ఎగ్జైట్‍మెంట్ తగ్గుతుందని చెబుతున్నారు. లీక్డ్ వీడియోలను వైరల్ చేయడం సరికాదంటూ సూచిస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియా నుంచి తొలగించేలా మేకర్స్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఒడిశాలోని కోరపుత్ ప్రాంతంలో వేసిన ఈ మూవీ షూటింగ్ సెట్ వీడియో ఇటీవల వైరల్ అయింది.

రాజమౌళి ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో!

సాధారణంగా షూటింగ్ స్పాట్‍లో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు డైరెక్టర్ రాజమౌళి. ఎవరికీ ఫోన్లు అనుమతించరు. కానీ ఈ ఎస్ఎస్ఎంబీ29కు సంబంధించి వీడియో లీక్‍ల బెడద ఎక్కువైంది. మరింత రాజమౌళి మరింత కఠినంగా ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి. లీక్డ్ వీడియో షేర్ చేయవద్దంటూ మేకర్స్ ఏమైనా అనౌన్స్‌మెంట్ చేస్తారేమో చూడాలి.

ఎస్ఎస్ఎంబీ29 మూవీలో మహేశ్‍ బాబుతో పాటు మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా కీలకపాత్రలు పోషిస్తున్నారు. హైదరాబాద్‍లో కొన్ని రోజులు షూటింగ్ జరిగింది. ప్రస్తుతం ఒడిశాలో చిత్రీకరణ సాగుతోంది. ఆర్ఆర్ఆర్ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి పాపులర్ అయ్యారు. దీంతో గ్లోబల్ రేంజ్‍లోనే ఈ చిత్రం ఉండనుంది. ఈ సినిమాను కేఎల్ నారాయణ నిర్మిస్తుండగా.. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

మహేశ్ – రాజమౌళి కాంబినేషన్‍లో రెండు పార్ట్‌లుగా ఎస్ఎస్ఎంబీ29 ఉంటుందని తెలుస్తోంది. ఫస్ట్ పార్ట్‌ను 2027లో రిలీజ్ చేసేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం బడ్జెట్ రూ.1000కోట్లుగా ఉంటుందనే రూమర్లు ఉన్నాయి. హాలీవుడ్ రేంజ్‍లో భారీ స్కేల్‍లో ఈ చిత్రం ఉండనుందని తెలుస్తోంది.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024