

Best Web Hosting Provider In India 2024

Kendriya Vidyalaya Jobs : విజయవాడ కేంద్రీయ విద్యాలయలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు-ఇంటర్వ్యూతోనే ఉద్యోగాలు
Vijayawada Kendriya Vidyalaya : విజయవాడ కేంద్రీయ విద్యాలయలో 10 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కేవలం ఇంటర్వ్యూలతోనే టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు మార్చి 12, 13 తేదీల్లో జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావొచ్చని నిర్వాహకులు తెలిపారు.

Vijayawada Kendriya Vidyalaya : విజయవాడ కేంద్రీయ విద్యాలయలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. కేవలం ఇంటర్వ్యూలతోనే పోస్టులను భర్తీ చేస్తున్నారు. పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. మొత్తం 10 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరుకావాలని కోరారు. మార్చి 12, 13 తేదీల్లో ఇంటర్వ్యూలు జరుగుతాయి.
పోస్టులు
ట్రైయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) ఇంగ్లీష్, హిందీ, మాథ్యమెటిక్స్, సైన్స్, సోషల్ సైన్స్, సంస్కృతం పోస్టులు, ప్రైమరీ టీచర్ (పీఆర్టీ), కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్, అకడమిక్ కౌన్సిలర్, స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
జీతాలు
1. టీజీటీ ఇంగ్లీష్- రూ. 26,250
2. టీజీటీ హిందీ- రూ. 26,250
3. టీజీటీ మాథ్యమెటిక్స్- రూ. 26,250
4. టీజీటీ సోషల్ సైన్స్- రూ. 26,250
5. టీజీటీ సంస్కృతం- రూ. 26,250
6. సైన్స్- రూ. 26,250
7. ప్రైమరీ టీచర్ (పీఆర్టీ)- రూ.21,250
8. కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్- రూ. 26,250
9. అకడమిక్ కౌన్సిలర్- రూ. 26,250
10. స్పెషల్ ఎడ్యుకేటర్- రూ.21,250
అర్హతలు
ఒక్కో పోస్టుకు ఒక్కో రకమైన అర్హతలు ఉన్నాయి. 50 శాతం డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఆయా విభాగాల్లో స్పెషల్ సబ్జిక్స్ కూడా పూర్తి చేసి ఉండాలి. అలాగే బీఈడీ చేసి ఉండాలి. అభ్యర్థులు ఇంగ్లీష్, హిందీ మీడియంలోనే బోధన నిర్వహించాలి. ఎటువంటి ఫీజు లేదు.
ఇంటర్వ్యూకు తీసుకెళ్లాల్సిన ధ్రువీకరణ పత్రాలు
1. సంబంధిత విద్యార్థ అర్హత ఒరిజినల్ సర్టిఫికేట్లు
2. ఒక సెట్ జెరాక్ట్ కాపీలు
3. కలర్ పాస్‌పోర్టు సైజ్ ఫోటో
4. టీజీటీ అభ్యర్థులు సీటెట్ సర్టిఫికేట్ తప్పనిసరి.
ఏఏ పోస్టులకు ఎప్పుడెప్పుడు ఇంటర్వ్యూలు
1. ప్రైమరీ టీచర్ (పీఆర్టీ), టీజీటీ మాథ్యమెటిక్స్, సైన్స్, సోషల్ సైన్స్ లకు మార్చి 12న ఉదయం 8.30 గంటలకు ఇంటర్వ్యూలు జరుగుతాయి.
2. టీజీటీ ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం, కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్, స్పెషల్ ఎడ్యుకేటర్, అకడమిక్ కౌన్సిలర్ పోస్టులకు మార్చి 13న ఉదయం 8.30 గంటలకు ఇంటర్వ్యూలు జరుగుతాయి.
ఇంటర్వ్యూ జరిగే స్థలం
KENDRIYA VIDYALAYA, No.2, WAGON WORKSHOP COLONY, GUNTUPALLI, VIJAYAWADA521 241, Ph:0861-2947767.
ఇతర వివరాలు అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://cdnbbsr.s3waas.gov.in/s3kv016b4ba5765600aa65c8fe4b759c55/uploads/2025/03/2025030341.pdf లో చూడొచ్చు.
వెబ్‌సైట్ః https://no2vijayawada.kvs.ac.in/updates/ ,
బయోడేటా ఫాంః https://cdnbbsr.s3waas.gov.in/s3kv016b4ba5765600aa65c8fe4b759c55/uploads/2025/03/2025030368.pdf
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం
టాపిక్